పాలకూర పప్పు తయారీ విధానం : పాలకూర పప్పు రెసిపీ
భారతీయ వంటకాలు

పాలకూర పప్పు తయారీ విధానం : పాలకూర పప్పు రెసిపీ

రోజూ ఒకే రకమైన వంట తిని విసుగుపుడుతోందా.. అయితే ఖచ్చితంగా ఈ రెసిపీ మీ కోసమే. ఈ ఆర్టికల్ యందు పాలకూర మరియు పప్పు కాంబినేషన్లో అదిరిపోయే పాలకూర పప్పు రెసిపీ తక్కువ సమయంలో ఎలా తయారుచేయాలో, తయారీకి కావాల్సిన పదార్ధాలు ఏమిటో తెలుసుకుందాం.

పాలకూర పప్పు తయారీకి కావాల్సిన పదార్దాలు

  • కందిపప్పు - ఒక కప్పు
  • పాల కూర - రెండు కట్టలు
  • పచ్చి మిర్చి - నాలుగు
  • ఉల్లిపాయ : ఒకటి
  • టమోటా  - రెండు
  • పసుపు  - అర టీ స్పూన్
  • ఉప్పు - రుచికి తగినంత
  • వెల్లుల్లి రెబ్బలు -  4-6
  • ఆవాలు - అర టీ స్పూన్
  • జీరా - పావు టీ స్పూన్
  • మినపప్పు - అర టీ స్పూన్
  • ఎండుమిర్చి : రెండు
  • కరివేపాకు : రెండు రెమ్మలు
  • ఇంగువ - చిటికెడు
  • నెయ్యి - ఒక స్పూన్
  • నూనె - ఒక స్పూన్

పాలకూర పప్పు తయారీ విధానం

ముందుగా పాలకూర బాగా కడిగి సన్నగా కోసుకోవాలి. తర్వాత పప్పుని శుభ్రంగా కడిగి, కుక్కర్లో వేసి అందులో పాలకూర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమోటా ముక్కలు, పసుపు, సరిపడా నీళ్లు, ఒక స్పూన్ నూనె వేసి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడకనివ్వాలి.

ఉడికిన పాలకూర పప్పులో సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. అలాగే పప్పు దగ్గరగా ముద్దలా అయితే కొద్దిగా నీరు పోసి బాగా మెదపాలి. తరువాత పోపు కోసం స్టవ్ ఆన్ చేసి పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, కాగాక వెల్లుల్లి రేకులు, కరివేపాకు, మినపప్పు, ఎండుమిర్చి, జీల కర్ర, ఆవాలు వేసి, పోపు బాగా వేగనివ్వాలి.

చివరగా ఇంగువ కూడా అందులో వేసి వేయించాలి, పోపు వేగిన తర్వాత ఉడికించిన పప్పులో వేసి ఓ రెండు నిముషాలు మగ్గనివ్వాలి. అంతే ఎంతో టేస్టీగా ఉన్న పాలకూర పప్పు రెడీ అయినట్లే.

పాలకూర పప్పులో లభించే పోషక విలువలు

పాలకూర పప్పు ప్రోటీన్ మరియు ఫైబర్ అధికంగా ఉండే తక్కువ కేలరీల భోజనం, ఇది మీకు పూర్తి మరియు సంతృప్తిని కలిగించడంలో సహాయపడుతుంది మరియు మీ మొత్తం క్యాలరీలను తగ్గించడంలో సహాయపడుతుంది. పాలకూర పప్పులోని అధిక ఫైబర్ కంటెంట్ క్రమంగా ప్రేగు కదలికలను ప్రోత్సహించడానికి మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది.

ఎముకల ఆరోగ్యానికి అవసరమైన కాల్షియం మరియు ప్రోటీన్లకు పాలకకూర పప్పులో సంవృద్ధిగా ఉంటాయి. పాలకూర పప్పులోని విటమిన్లు మరియు ఖనిజాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి మరియు ఇన్ఫెక్షన్ నుండి రక్షించడానికి సహాయపడతాయి. పాలకూర పప్పు యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం, ఇది శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.

పాలకూర పప్పులో ఫైబర్ మరియు పొటాషియం పుష్కలంగా ఉంటాయి, ఇది రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.  పాలకూర పప్పులోని విటమిన్లు ఎ, సి మరియు ఇ ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహించడానికి మరియు ఫ్రీ రాడికల్స్ నుండి డ్యామేజ్ కాకుండా రక్షించడానికి సహాయపడతాయి.

Post Comment