రవ్వ లడ్డు తయారీ విధానం : రవ్వ లడ్డు రెసిపీ, చిట్కాలు
భారతీయ వంటకాలు

రవ్వ లడ్డు తయారీ విధానం : రవ్వ లడ్డు రెసిపీ, చిట్కాలు

రోజూ సాయంత్రం ఒకే రకమైన స్నాక్స్ లేదా స్వీట్స్ తిని తిని మీ ఇంట్లో వాళ్ళు బోరుకొడుతుంది అంటున్నారా.. అయితే ఈ రెసిపీ ఖచ్చితంగా మీ కోసమే, ఒక్కసారి నేర్చుకుని ట్రై చేయండి.ఈ ఆర్టికల్ యందు అదిరిపోయే రవ్వలడ్డు ఎలా తయారుచేయాలో, కావాల్సిన పదార్దాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

రవ్వ లడ్డు తయారీకి కావాల్సిన పదార్దాలు

  • బొంబాయి రవ్వ - నాలుగు కప్పులు
  • పంచదార - రెండున్నర కప్పులు ( సరిపడా)
  • ఎండుకొబ్బరి పొడి - అర కప్పు
  • జీడిపప్పు - సరిపడా
  • బాదాం పప్పు - సరిపడా
  • కిస్మిస్ - సరిపడా
  • యాలకుల పొడి - రెండు స్పూన్స్
  • నెయ్యి - రెండు టేబుల్ స్పూన్స్
  • పాలు - ఒక కప్పు

రవ్వ లడ్డు తయారీ విధానం

ముందుగా స్టౌ వెలిగించి కళాయి పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ లు దోరగా వేయించుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అనంతరం పాన్‌లో మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుని కొబ్బరి తురుముని వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. మరోపక్క పాలు మరిగించి పక్కనపెట్టి చల్లార్చుకోవాలి. అలాగే మిక్సీలో పంచదార, యాలకులు వేసుకుని బరకగా ఉండేలా ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి.

తరవాత అదే పాన్‌లో మిగిలిన నెయ్యి వేసుకుని బొంబాయి రవ్వని వేసుకోవాలి. రవ్వ వేసాక మంటను లో- ఫ్లేమ్ లో పెట్టుకుని ఎర్రగా కమ్మటి వాసన వచ్చే వరకూ వేయించుకోవాలి. ఇప్పుడు వేయించిన రవ్వలో ముందుగా రెడీ చేసుకున్న పంచదార, యాలకుల పొడి వేసి రెండు, మూడు నిముషాలు వేయించుకోవాలి. వేగాక ఈ బొంబాయి రవ్వని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.

అనంతరం అందులో వేయించుకున్న జీడిపప్పు, బాదాం, కిస్మిస్, లతో పాటు కొబ్బరి తురుము వేసుకుని కొంచెం పాలు పోసుకుని, రవ్వ చల్లారకముందే ఉండలుగా మీకు కావాల్సిన సైజులో చుట్టుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ కొబ్బరి రవ్వ లడ్డు రెడీ. ఇవి సుమారు ఒక వారం రోజులపాటు నిల్వ ఉంటాయి.

రవ్వ లడ్డు తయారీకి కొన్ని చిట్కాలు

రవ్వ లడ్డు తయారీకి నాణ్యమైన రవ్వ తీసుకోవాలి. రవ్వ లడ్డు కోసం రవ్వను కొద్దిగా నెయ్యి వేసి దోరగా వేయించుకోవాలి. లేదంటే అందులో తేమ వలన పచ్చి వాసన వస్తుంది. యాలకులు దోరగా వేయించి పొడి చేసుకోవాలి. డ్రైఫ్రూప్ట్స్ ను నెయ్యిలో దోరగా వేయించి కలుపుకోవాలి. రవ్వలో చల్లని పాలు మాత్రమే కలపాలి. వేడి పాలు వేస్తే రవ్వ ఉడికి పోతుంది. రవ్వ వేయించిన తరవాత వేడి వేడిగా ఉన్నప్పుడే లడ్డు చేసుకోవాలి. లేదంటే లడ్డు విరిగిపోతుంది.

రవ్వ లడ్డులో లభించే పోషక విలువలు

రవ్వలో మెగ్నీషియం మరియు ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి, ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది మరియు ఎర్ర రక్త కణాల పెరుగుదలకు తోడ్పడుతుంది . పొటాషియం మూత్రపిండాల ఆరోగ్యానికి మంచిది. రవ్వలో తక్కువ కొవ్వు, తక్కువ సోడియం మరియు తక్కువ కొలెస్ట్రాల్ ఉన్న ఆహరం. భాస్వరం ఆరోగ్యకరమైన ఎముకలు మరియు దంతాల నిర్వహణలో పాత్ర పోషిస్తుంది మరియు శరీరంలోని అనేక సెల్యులార్ ప్రక్రియలలో పాల్గొంటుంది.

డ్రై ఫ్రూట్ లడ్డులో ప్రోటీన్లు, కాల్షియం మరియు ఇతర సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉన్నాయి, ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది మరియు వాటిని బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. గర్భధారణ సమయంలో డ్రై ఫ్రూట్ లడ్డూను తీసుకోవడం వల్ల ఔత్సాహిక తల్లులు బలమైన మరియు ఆరోగ్యకరమైన ఎముకల ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు

రవ్వ కార్బోహైడ్రేట్ల యొక్క మంచి మూలం మరియు ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాల వంటి అవసరమైన పోషకాలను అందిస్తుంది. రోజువారీ రవ్వ తినడం సమతుల్య ఆహారంలో భాగం కావచ్చు, కానీ ఏదైనా ఆహారం వలె, ఇది మితంగా తీసుకోవాలి.

Post Comment