పనీర్ పకోడి రెసిపీ తయారీ విధానం : పనీర్ పకోరా, పోషకాలు
భారతీయ వంటకాలు

పనీర్ పకోడి రెసిపీ తయారీ విధానం : పనీర్ పకోరా, పోషకాలు

రోజూ సాయంత్రం పూట బయట దొరికే ఒకే రకమైన స్నాక్స్ తిని విసుగుపుడుతోందా.. అయితే ఖచ్చితంగా ఈ రెసిపీ మీ కోసమే, ఎంచక్కా ఇంట్లోనే అదిరిపోయే పన్నీర్ పకోడీ ఎలా తయారుచేయాలి, తయారీకి కావలసిన పదార్దాలు ఏమిటో ఈ ఆర్టికల్ యందు తెలుసుకుందాం. మీరు నేర్చుకుని ట్రై చేయండి.

పన్నీర్ పకోడీ తయారీకి కావాల్సిన పదార్దాలు

  • పన్నీర్ -  పావు కేజీ
  • కారం - అర స్పూన్
  • ధనియాల పొడి - ఒక స్పూన్
  • శెనగపిండి - ఒక కప్పు
  • కరివేపాకు - రెండు రెమ్మలు
  • గరం మసాలా - ఒక స్పూన్
  • పచ్చిమిర్చి - రెండు లేదా మూడు
  • నూనె - వేయించటానికి సరిపడా
  • ఉప్పు తగినంత

పన్నీర్ పకోడీ తయారీ విధానం

పన్నీర్ చతుస్త్రాకారంలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి పేస్టులా చేసుకుని పెట్టుకోవాలి. ఇపుడు ఒక గిన్నెలో శెనగపిండి తీసుకుని అందులో సరిపడా ఉప్పు, కారం ధనియాల పొడి, గరం మసాలా, పచ్చి మిర్చి పేస్ట్, కరివేపాకు వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పిండు చిక్కగా కలుపుకోవాలి.

ఇప్పుడు కళాయిలో వేయించటానికి సరిపడా నూనె వేయాలి. నూనె వేడయ్యాక ముందుగా కలిపిన పిండిలో పన్నీర్ ముక్కలు ముంచి వేసుకోవాలి. పన్నీర్ ముక్కలు ఎర్రగా వేగినతరవాత తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవటమే.

పన్నీర్ పకోడీలో లభించే పోషకాలు

ప్రతి 100 గ్రాముల పనీర్‌లో 265 కేలరీలు, 20.8 గ్రాముల కొవ్వు, 1.2 గ్రాముల మొత్తం కార్బోహైడ్రేట్ ఉంటాయి. 18.3 గ్రాముల ప్రోటీన్ మరియు 208 mg కాల్షియం. పన్నీర్ అధిక-నాణ్యత ప్రోటీన్‌తో సమృద్ధిగా ఉంటుంది. పనీర్‌లో అవసరమైన అమైనో ఆమ్లాలను అందించే అధిక-నాణ్యత ప్రోటీన్ ఉంటుంది. పనీర్‌లో కాల్షియం, జింక్ మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలు సంవృద్ధిగా ఉంటాయి. ఇందులో విటమిన్ బి12, విటమిన్ డి, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి మరియు విటమిన్ ఎ వంటి విటమిన్లు కూడా పుష్కలంగా లభిస్తాయి.

పన్నీర్ ప్రోటీన్ యొక్క మంచి మూలం. ముఖ్యంగా శాఖాహారులకు పనీర్ ముఖంగా ఆహారం. పన్నీర్ బరువు తగ్గడానికి మంచిది, కండరాల నిర్మాణానికి సహాయపడుతుంది అలాగే రక్తంలో చక్కెరను నిర్వహించడంలో సహాయపడుతుంది, ఎముకలు మరియు దంతాలకు మంచిది, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది మరియు మెదడు ఆరోగ్యానికి మంచిది, ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది.

Post Comment