వెజిటబుల్ సూప్ తయారీ విధానం : టేస్టీ, హెల్తీ వెజ్ సూప్ రెసిపీ
భారతీయ వంటకాలు

వెజిటబుల్ సూప్ తయారీ విధానం : టేస్టీ, హెల్తీ వెజ్ సూప్ రెసిపీ

కూరగాయలతో మనకు ఎన్నో పోషకాలు లభిస్తాయి. ఇవి మన శరీరంలో అంతర్గత విధులను నిర్వహించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడుతాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతాయి. ఈ ఆర్టికల్ యందు ఇన్ని ప్రయోజనాలు ఉన్న వెజిటబుల్ సూప్ ఎలా తయారు చేసుకోవాలి, కావాల్సిన పదార్దాలు ఏమిటి అని చూద్దాం.

వెజిటబుల్ సూప్ తయారీకి కావాల్సిన పదార్దాలు

  • క్యారెట్ - అర కప్పు
  • క్యాబేజీ - అర కప్పు
  • అల్లం తురుము - ఒక స్పూన్
  • క్యాప్సికమ్ - ఒక కప్పు
  • బీన్స్ - అర కప్పు
  • పచ్చి బఠాణీ - పావు కప్పు
  • పచ్చిమిర్చి - రెండు లేదా మూడు
  • వెల్లుల్లి రెబ్బలు - ఎనిమిది
  • స్వీట్ కార్న్ - అర కప్పు
  • కొత్తిమీర - రెండు రెమ్మలు
  • ఉల్లిపాయలు - రెండు
  • వెజ్ ఆయిల్ - రెండు స్పూన్స్
  • ఉప్పు - సరిపడా
  • మిరియాల పొడి - అర స్పూన్
  • బటర్ - ఒక స్పూన్
  • కార్న్ ఫ్లోర్ - ఒక స్పూన్
  • చక్కెర - ఒక స్పూన్
  • చిటికెడు సోయా సాస్ - అర స్పూన్
  • నిమ్మరసం - ఒక స్పూన్

వెజిటబుల్ సూప్ తయారీ విధానం

ముందుగా కూరగాయలు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. తరవాత కూరగాయలు, స్వీట్ కార్న్, అల్లం, వెల్లుల్లి మొదలైన వాటిని వీలైనంత చిన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేడి చేసి అందులో సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఆపై సన్నగా తరిగిన కూరగాయలను, స్వీట్ కార్న్ కూడా వేసి వేయించాలి, లో- ఫ్లేమ్ లో మాడకుండా జాగ్రత్త పడాలి.

ఇప్పుడు రుచికి తగినట్లుగా ఉప్పు, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. స్మూత్ అవ్వడానికి ఒక టీస్పూన్ వెన్న కూడా వేసుకోవాలి. కూరగాయముక్కలు కొంచెం క్రిస్పీగా అయ్యాక సూప్ కోసం తగినన్ని నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్ లో మరిగించుకోవాలి.

ఆలా మరుగుతుండగా సూప్ చిక్కదనం కోసం కొద్దిగా మొక్కజొన్న పిండి స్లర్రీని నెమ్మదిగా వేసి కలుపుకోవాలి. సూప్ ఉడికిన తర్వాత పైన సోయా సాస్, ఆపై కొంత నిమ్మరసం, పంచదార వేసి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. అంతే, మిక్స్‌డ్ వెజిటబుల్ సూప్ సిద్ధం అయినట్లే. ఒక కప్పులో సర్వ్ చేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే ఆస్వాదించండి.

వెజిటబుల్ సూప్ తయారీకి కొన్ని చిట్కాలు

వెజిటబుల్ సూప్ తయారీకి తాజా మరియు లేత కూరగాయలను తీసుకోండి. కూరగాయలను ఒకే సైజులో కట్ చేసుకుంటే అన్ని సమానంగాఉడుకుతాయి . నీటికి బదులుగా కూరగాయల రసం లేదా స్టాక్ ఉపయోగించండి, నీళ్ళకు బదులుగా కట్ చేయగా మిగిలిన కూరగాయల వ్యర్దాలను రసం మరిగించుకుని వేసుకుంటే సూప్ మరింత రుచిగా ఉంటుంది. సూప్ ఎక్కువ మంటపై మరిగించ కూడదు. ఎక్కువ మంటపై మరిగిస్తే సూప్ చిక్కగా అవుతుంది. మీరు ఎంత ఎక్కువ కూరగాయలు ఉపయోగిస్తే, మీ సూప్‌లో ఎక్కువ రుచి మరియు పోషణ ఉంటుంది. కొన్ని మంచి ఎంపికలలో క్యారెట్లు, కీప్సికం , క్యాబేజి, పచ్చి బాటని ఉల్లిపాయలు, బంగాళదుంపలు, బఠానీలు , మొక్కజొన్న మరియు టమోటాలు ఉన్నాయి.

వెజిటబుల్ సూప్‌లో లభించే పోషకవిలువలు

కూరగాయలు విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లతో సంవృద్ధిగా నిండి ఉంటాయి, మంచి ఆరోగ్యానికి పోషకాలు చాలా అవసరం. వెజిటబుల్ సూప్ తక్కువ కేలరీలు ఆహరం మరియు తక్కువ కొవ్వు పదార్దాలు కలిగి ఉంటుంది, ఇది బరువు తగ్గడానికి లేదా నిర్వహణకు మంచి ఆహార ఎంపిక.

కూరగాయల సూప్ తొందరగా జీర్ణం అవుతుంది, జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇది మంచి ఆహార ఎంపిక. వెజిటబుల్ సూప్ మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. కూరగాయలలోని విటమిన్లు మరియు ఖనిజాలు మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి మరియు అనారోగ్యం నుండి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడతాయి.

కూరగాయలలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో మరియు మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. కూరగాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. కొన్ని అధ్యయనాలు కూరగాయలు అధికంగా ఉండే ఆహారం క్యాన్సర్ నుండి రక్షించడంలో సహాయపడుతుందని చూపించాయి.

విటమిన్ బి, సి, కె వంటి అనేక నీటిలో కరిగే విటమిన్లు అలాగే డైటరీ ఫైబర్ మరియు మినరల్స్ శ్రేణితో సహా కూరగాయలలో లభించే పోషకాలు కూడా జీర్ణవ్యవస్థను క్రమబద్ధీకరించడానికి మరియు మనకు లభించేలా చేయడంలో సహాయపడతాయి కాబట్టి ఇది పోషకాహారంగా కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

Post Comment