ఎగ్ బుర్జీ రెసిపీ తయారీ విధానం : గుడ్డు పుట్టు తయారీ విధానం
భారతీయ వంటకాలు

ఎగ్ బుర్జీ రెసిపీ తయారీ విధానం : గుడ్డు పుట్టు తయారీ విధానం

రోజూ ఇంట్లో ఒకే రకమైన వంటలు అని, ఏదైనా కొత్తగా నేర్చుకుని ట్రై చేయాలనిపిస్తుందా.. అయితే ఖచ్చితంగా ఈ రెసిపీ మీ కోసమే. ఈ ఆర్టికల్ యందు అదిరిపోయే ఎగ్ బుర్జీ రెసిపీ ఎలా తయారుచేయాలో ఇక్కడ తెలుసుకోండి. మీరు నేర్చుకుని ఒక్కసారి ట్రై చేయండి.

ఎగ్ బుర్జీ తయారీకి కావాల్సిన పదార్దాలు

  • గుడ్లు - నాలుగు
  • ఉల్లిపాయలు - రెండు
  • పచ్చిమిర్చి - రెండు
  • టమాటా - ఒకటి
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర స్పూన్
  • కారం - అర స్పూన్
  • పసుపు - అర స్పూన్
  • ఉప్పు - సరిపడా
  • కొత్తిమీర - రెండు రెమ్మలు
  • నూనె - రెండు టేబుల్ స్పూన్స్

ఎగ్ బుర్జీ తయారీ విధానం

ముందుగా ఉల్లిపాయలు, టమాటాలు చిన్నగా తరిగి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి నిలువుగా, సన్నగా తరిగిపెట్టుకోవాలి. ఇప్పడు స్టవ్ ఆన్ చేసి పాన్‌లో నూనె వేయాలి. నూనె వేడయ్యాక అందులో ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయముక్కలు వేసి రెండు నిముషాలు వేయించాలి.

రెండు నిమిషాల తరవాత పచ్చిమిర్చి వేసి ఒక నిమిషం వేగాక, అందులో టమోటా ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టి మరో రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో మగ్గనివ్వాలి. టమాటా మగ్గినతరవాత రుచికి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు వేసుకుని కలుపుకోవాలి.

ఇప్పుడు ఇందులో తీసుకున్న గుడ్లు పగలగొట్టి వేసుకోవాలి. గుడ్లు వేసినవెంటనే కలపకుండా కాసేపు వేగాక, అంటే గుడ్లు మిశ్రమం కొంచెం గట్టిపడ్డాక కలుపుతూ హై ఫ్లేమ్ లో వేగనివ్వాలి. చివర్లో కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవటమే అంతే. ఈ ఎగ్ బుర్జీ వేడివేడిగా చపాతీ కాంబినేషన్లో చాలా బాగుంటుంది.

ఎగ్ బుర్జీలో లభించే పోషకాలు, ప్రయోజనాలు

గుడ్డు బుర్జిలో చాలా తక్కువ కేలరీలు మరియు ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది, ఇది మీ రోజువారీ ప్రోటీన్ అవసరాలలో ఎక్కువ భాగాన్ని కవర్ చేస్తుంది. ప్రోటీన్‌తో పాటు, గుడ్డు బుర్జిలో పొటాషియం, విటమిన్ D మరియు విటమిన్ B-6 వంటి అనేక సూక్ష్మపోషకాల యొక్క రోజువారీ పరిష్కారాన్ని అందిస్తుంది.

గుడ్డు పచ్చసొనలో అధిక మొత్తంలో విటమిన్ A, D, E, K, B1, B2, B5, B6, B9, మరియు B12 ఉంటాయి , అయితే గుడ్డులోని తెల్లసొనలో అధిక మొత్తంలో విటమిన్లు B2, B3 మరియు B5 ఉంటాయి కానీ గణనీయమైన మొత్తంలో విటమిన్లు B1 కూడా ఉంటాయి. , B6, B8, B9, మరియు B12 రోజుకు రెండు గుడ్లు తినడం వల్ల మానవులకు అవసరమైన విటమిన్లలో 10% నుండి 30% వరకు ఉంటుంది.

గుడ్డు ప్రోటీన్ పోషకాహార లోపాన్ని తగ్గిస్తుంది, కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, సంతృప్తిని పెంచుతుంది మరియు అందువల్ల బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది. ఇది ఇన్ఫెక్షన్ నుండి రక్షణ, రక్తపోటు తగ్గడం, అలాగే క్యాన్సర్ వ్యతిరేక ప్రభావంతో సహా ఇతర అదనపు ప్రయోజనాలను కలిగి ఉంది.

Post Comment