నువ్వుల లడ్డు తయారీ విధానం : నువ్వుల చెక్కి, పోషకాలు
భారతీయ వంటకాలు

నువ్వుల లడ్డు తయారీ విధానం : నువ్వుల చెక్కి, పోషకాలు

రోజూ సాయంత్రం ఒకే రకమైన స్నాక్స్ లేదా స్వీట్స్ తిని తిని మీ ఇంట్లో వాళ్ళు బోరుకొడుతుంది అంటున్నారా.. అయితే ఈ రెసిపీ ఖచ్చితంగా మీ కోసమే, ఒక్కసారి నేర్చుకుని ట్రై చేయండి.ఈ ఆర్టికల్ యందు అదిరిపోయే నువ్వుల లడ్డు లేదా చెక్కి ఎలా తయారుచేయాలి, తయారీకి కావాల్సిన పదార్దాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

నువ్వుల లడ్డు తయారీకి కావాల్సిన పదార్దాలు

  • నువ్వులు - రెండు క‌ప్పులు
  • బెల్లం తురుము - అర క‌ప్పు
  • నీళ్లు - పావు క‌ప్పు,
  • యాల‌కుల పొడి - చిటికెడు
  • నెయ్యి - ఒక స్పూన్
  • వేరుశెనగ పలుకులు - కొద్దిగా

నువ్వుల లడ్డు తయారీ విధానం

ముందుగా క‌ళాయిలో నువ్వుల‌ను వేసి చిన్న మంట‌పై దోర‌గా పదినిమిషాలు పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న త‌రువాత ఈ నువ్వుల‌ను ఒక ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌న‌ పెట్టుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో బెల్లం తురుము,కొద్దిగా నీళ్ల‌ను పోసి బెల్లం క‌రిగే వ‌ర‌కు కలుపుతూ ఉండాలి. బెల్లం క‌రిగిన త‌రువాత మిశ్ర‌మాన్ని చిన్న మంట‌పై ముదురు పాకం వ‌చ్చే వ‌ర‌కు ఉడికించాలి.

పాకం అయిందా లేదా చూడడానికి నీటిలో వేసి చూసిన‌ప్పుడు బెల్లం మిశ్ర‌మం కొద్దిగా గ‌ట్టిగా మారిన‌ప్పుడు పాకం సిద్ధ‌మైందిగా భావించి యాల‌కుల పొడి వేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. బెల్లం మిశ్ర‌మం గ‌ట్టిప‌డ‌క‌పోతే మ‌రి కొద్ది సేపు ఉడికించి పాకం వ‌చ్చిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

త‌రువాత వెంట‌నే వేయించిన నువ్వుల‌ను వేసి నువ్వులు, బెల్లం మిశ్ర‌మం మొత్తం బాగా క‌లిసేలా కలుపుకోవాలి. ఈ మిశ్ర‌మం గోరు వెచ్చ‌గా అయిన త‌రువాత చేతికి నెయ్యిని రాసుకుంటూ త‌గినంత మిశ్ర‌మాన్ని తీసుకుంటూ ల‌డ్డూల‌లాగా చుట్టుకోవచ్చు లేదా ఈ మిశ్ర‌మాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లో వేసి పై భాగం స‌మానంగా వ‌చ్చేలా చేసుకుని క‌త్తితో కావ‌ల్సిన ఆకారంలో కట్ చేసుకోవాలి. ఈ మిశ్ర‌మం పూర్తిగా చ‌ల్లారిన త‌రువాత ప్లేట్ నుండి వేరు ముక్క‌లుగా చేసుకోవాలి. అంతే నువ్వుల లడ్డు రెడీ అయినట్లే.

ఇలా త‌యారు చేసుకున్న నువ్వుల ల‌డ్డూల‌ను గాలి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకుంటే 10 నుండి 15 రోజుల పాటు తాజాగా ఉంటాయి. నువ్వుల ల‌డ్డూల‌ను రోజుకు ఒక‌టి లేదా రెండు చొప్పున తిన‌డం వ‌ల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మంచి పోషకాలు కూడా లభిస్తాయి.

నువ్వుల లడ్డులో లభించే పోషకాలు

నువ్వులు ఆరోగ్యకరమైన అసంతృప్త కొవ్వులతో కూడిన పోషకాహారంలో పుష్కలంగా ఉంటాయి, ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నువ్వులులోని మెగ్నీషియం మరియు కాల్షియం కంటెంట్ ఎముకల ఆరోగ్యాన్ని మరియు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, ఇది శక్తిని ఇస్తుంది మరియు అలసట మరియు రక్తహీనత వంటి సమస్యలకు సహాయపడుతుంది.

నువ్వులు మొక్కల ఆధారిత ప్రోటీన్ యొక్క మంచి మూలం, ప్రతి ఔన్సుకు సుమారు 5 గ్రాముల ప్రోటీన్‌ను అందిస్తాయి. కణజాలాలను నిర్మించడానికి మరియు మరమ్మత్తు చేయడానికి, కండర ద్రవ్యరాశిని నిర్వహించడానికి మరియు వివిధ శారీరక విధులకు మద్దతు ఇవ్వడానికి ప్రోటీన్ అవసరం.

యాంటీఆక్సిడెంట్లు: నువ్వులు లిగ్నాన్స్ మరియు సెసామిన్‌లతో సహా యాంటీఆక్సిడెంట్ల యొక్క గొప్ప మూలం , ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షించడంలో సహాయపడతాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు మంట తగ్గడానికి మరియు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి దోహదం చేస్తాయి

నువ్వలులలో కాల్షియం సంవృద్ధిగా లభిస్తుంది. కాల్షియం ఎముకల ఆరోగ్యం, కండరాల పనితీరు మరియు నరాల సిగ్నలింగ్‌కు కీలకం . మెగ్నీషియం కండరాలు మరియు నరాల పనితీరు, రక్తంలో చక్కెర నియంత్రణ మరియు రక్తపోటు నియంత్రణలో పాత్ర పోషిస్తుంది . ఇనుము ఆక్సిజన్ రవాణా మరియు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరం. జింక్ రోగనిరోధక పనితీరు, గాయం నయం మరియు కణాల పెరుగుదలకు మద్దతు ఇస్తుంది. విటమిన్ B6 శక్తి జీవక్రియ, మెదడు పనితీరు మరియు ఎర్ర రక్త కణాల నిర్మాణానికి ముఖ్యమైనది.

Post Comment