మష్రూమ్ దమ్ బిర్యానీ తయారీ విధానం : పుట్టగొడుగుల బిర్యానీ రెసిపీ
భారతీయ వంటకాలు

మష్రూమ్ దమ్ బిర్యానీ తయారీ విధానం : పుట్టగొడుగుల బిర్యానీ రెసిపీ

మీరు కూడా బిర్యానీ లవర్ అయితే మీ దినచర్యను ఈ మష్రూమ్ బిర్యానీతో స్టార్ట్ చేసేయండి. ఆలస్యం చేయకుండా ఈ ఆర్టికల్ ద్వారా చక్కని మష్రూమ్ బిర్యానీని ఎలా చేయాలో, దానికి ఏమేమి కావాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎంచక్కా మీరు నేర్చుకుని, ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వండి.

మష్రూమ్ బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్దాలు

  • బాస్మతి బియ్యం – రెండు కప్పులు
  • పుట్టగొడుగులు – పావుకేజి
  • నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు
  • నూనె – 3 టేబుల్‌స్పూన్లు
  • నెయ్యి - ఒక టేబుల్ స్పూన్
  • ఉల్లిపాయలు - రెండు
  • పచ్చిమిర్చి – రెండు
  • టమాట – ఒకటి
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్
  • బిర్యానీ మసాలా – ఒక టేబుల్ స్పూన్
  • పెరుగు – పావుకప్పు
  • బిర్యానీ ఆకులు - రెండు
  • లవంగాలు - రెండు
  • యాలకులు - రెండు
  • జీరా - అర టీ స్పూన్
  • దాల్చిన చెక్క - చిన్న ముక్క
  • జీడిపప్పు -తగినన్ని
  • కొత్తిమీర, పుదీనా – రెండు రెమ్మలు
  • ఉప్పు – తగినంత
  • నీరు – నాలుగున్నర కప్పులు

మష్రూమ్ బిర్యానీ తయారీ విధానం

ముందుగా మష్రూమ్స్ శుభ్రంగా కడిగి ముక్కలుగా చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు సన్నగా తరిగి సగంముక్కలు బ్రౌన్ కలర్ లో వేయించి పక్కనబెట్టుకోవాలి. రైస్ ఇరవై నిముషాలు నానబెట్టుకోవాలి. జీడీ పప్పు దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బిర్యానీఆకులు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, జీరా వేసి దోరగా వేయించాలి.

తర్వాత మిగిలిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి.వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు దీంట్లో మసాలా, పెరుగు, పుట్టగొడుగులు, టమాటో పేస్ట్ వేసి అయిదు నిమిషాలు మగ్గనివ్వాలి. ఆలా మిశ్రమం మగ్గిన తరవాత తగినన్ని నీళ్లు పోసి సరిపడా ఉప్పు వేయాలి. అలాగే కొత్తిమీ,ర పుదీనా కూడా వేయాలి.

నీళ్లు బాగా తెర్లేటప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసి బాగా కలిపి మూతపెట్టి మీడియం ఫ్లేమ్ లో ఉడికించాలి. అన్నం ఉడుకుతున్నప్పుడు చిన్న మంటపై ఉంచాలి.పూర్తిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇక అంతే ఘుమఘుమలాడే పుట్టగొడుగుల బిర్యాని రెడీ. చివర్లో కొత్తిమీర, ముందుగా వేయించిన ఉల్లిపాయ ముక్కలు జీడిపప్పు పైన అలకరించుకుంటే సరిపోతుంది.దీన్ని కుర్మాతో తింటే టేస్ట్ అదిరిపోతుంది.

మష్రూమ్ బిర్యానీ తయారీకి కొన్ని చిట్కాలు

వండడానికి ముందు బియ్యం 30 నిమిషాలు నానబెట్టండి. తాజా పుట్టగొడుగులు తీసుకోండి. పుట్టగొడుగులను బాగా కడగాలి మరియు వాటిని కాగితపు టవల్‌తో పొడిగా తుడుచుకోవాలి. పుట్టగొడుగులను సన్నగా ముక్కలు చేయడం వల్ల అవి సమానంగా ఉడకడానికి సహాయపడతాయి. పుట్టగొడుగులు దోరగా వేయించుకోవాలి. నెయ్యి లేదా వెన్న బిర్యానీకి గొప్ప రుచిని జోడిస్తుంది. అన్నం 80 శాతం ఉడికిన తరవాత పుట్టగొడుగులు వేయాలి.

మష్రూమ్ బిర్యానీలో లభించే పోషకాలు

మష్రూమ్ బిర్యానీలో అధికంగా ప్రోటీన్ కంటెంట్ మరియు ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, సోడియం మరియు విటమిన్ సి వంటి కొన్ని విటమిన్లు మరియు ఖనిజాలు సంవృద్ధిగా లభిస్తాయి లభిస్తాయి. పుట్టగొడుగులు ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇచ్చే మాక్రోన్యూట్రియెంట్లను కలిగి ఉంటాయి. ఇందులో లభించే సెలీనియం సెల్ డ్యామేజ్‌ను నిరోధించడానికి మీ శరీరం యాంటీఆక్సిడెంట్ ఎంజైమ్‌లను తయారు చేయడంలో సహాయపడుతుంది.

పుట్టగొడుగులలో ప్రొటీన్లు మరియు డైటరీ ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి కానీ వాటిలో కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి మరియు కొవ్వు లేదా కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటాయి . బీటా-గ్లూకాన్స్ మరియు చిటిన్ అనేవి పుట్టగొడుగులో ఉండే రెండు రకాల డైటరీ ఫైబర్‌లు మరియు అవి సంతృప్తిని పెంచడానికి మరియు ఆకలిని తగ్గించడంలో కూడా సహాయపడతాయి.

జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. బిర్యానీలో అల్లం, వెల్లుల్లి మరియు జీలకర్ర వంటి సుగంధ ద్రవ్యాలు ఉంటాయి, ఈ మసాలాలు జీర్ణక్రియకు సహాయపడతాయి మరియు గుండెలో మంటను తగ్గిస్తాయి. అంతేకాకుండా, కొన్ని బిర్యానీ వంటకాలలో పెరుగు, ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియాను పెంపొందించే ప్రోబయోటిక్స్‌తో శరీరాన్ని సన్నద్ధం చేస్తుంది.

Post Comment