టమోటా రసం ఎలా తయారు చేయాలి : ఆంధ్రా స్పెషల్ రెసిపీ
భారతీయ వంటకాలు

టమోటా రసం ఎలా తయారు చేయాలి : ఆంధ్రా స్పెషల్ రెసిపీ

టమాటో లేకుండా వంటగదిలో ఏ మెనూ కూడా సంపూర్ణం కాదని మనకి తెలుసు. ఎందుకంటే టమాటో లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆర్టికల్ ద్వారా రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన టమాటో రసం తయారు చేయటానికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానాన్ని తెలుసుకుందాం.

టమాటో రసం తయారీకి కావాల్సిన పదార్ధాలు

  • టమోటాలు - అరకిలో
  • చింతపండు - ఒక బొట్ట
  • పసుపు - పావు  టీ స్పూన్
  • ఉప్పు - సరిపడా
  • కారం - ఆఫ్ టీ స్పూన్
  • రసం పొడి - పావు టీ స్పూన్
  • ఎండు మిర్చి - మూడు
  • జీలకర్ర - పావు టీ స్పూన్
  • ఆవాలు - పావు టీ స్పూన్
  • శెనగపప్పు - పావు టీ స్పూన్
  • ఇంగువ - చిటికెడు
  • కొత్తిమీర - రెండు రెమ్మలు
  • కరివేపాకు - రెండు రెమ్మలు
  • నూనె - ఒక టేబుల్ స్పూన్
  • నెయ్యి - ఒక టేబుల్ స్పూన్
  • వెల్లుల్లి - ఆరు రెబ్బలు

టమాటో రసం తయారు చేయు విధానం

చింతపండు ముందుగా ఒక కప్పు గోరువెచ్చని నీటిలో పది నిమిషాలు నానబెట్టాలి. తరువాత టమాటాలు ముక్కలుగా తరిగి, అందులో చింతపండు రసంవేసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు టమాటా గుజ్జులో పసుపు, కారం, పచ్చిమిరపకాయలు, రసంపొడి, సరిపడా ఉప్పు వేసి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ లో ఎనిమిది నుంచి పది నిముషాలు మూత పెట్టుకుని మరిగించుకోవాలి.

రసం మరిగాక కళాయిలో నూనె, నెయ్యి వేసి, వేడయ్యాక ఎండుమిర్చి, కొద్దిగా శనగపప్పు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు మెంతులు, వెల్లుల్లి, ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి. పోపు వేగాక అందులో మరిగించుకున్న టమాటో రసం వేసుకుని, రెండు నిముషాలు మరిగించుకుంటే సరిపోతుంది. దించే ముందు పైన తరిగిన కొత్తిమీర వేసుకోవాలి.

టమాటో రసంలో పోషకాలు

టమాటో లో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫైబర్, పొటాషియం,కాల్షియం, విటమిన్ కె మరియు ఫోలేట్ వంటి అనేక విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి.

ఈ పోషకాలు మెదడు ఆరోగ్యాన్ని రక్షించడంలో సహాయపడవచ్చు. మెటబాలిక్ సిండ్రోమ్‌ను ఎదుర్కోవడంలో సహాయపడవచ్చు. అదేవిధంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడవచ్చు. టైప్ 2 డయాబెటిస్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నివారించడంలో సహాయపడవచ్చు అని పరిశోధనలు చెబుతున్నాయి.

టమాటో రసం శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచటానికి సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి ఎక్కువుగా ఉంటుంది, ఇది శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

Post Comment