కాప్సికమ్ పచ్చడి తయారీ విధానం : పోషకాలు, ప్రయోజనాలు
భారతీయ వంటకాలు

కాప్సికమ్ పచ్చడి తయారీ విధానం : పోషకాలు, ప్రయోజనాలు

రోజూ పొద్దున్న చేసుకునే బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీలు ఎంత అవసరం అనేది మన అందరికి తెలుసు. ముఖ్యంగా టిఫిన్స్ ఇడ్లీ, దోస,పూరి మరియు వడ వంటి వాటికి చట్నీలు తప్పని సరిగా ఉండాలి. ఈ ఆర్టికల్ యందు అదిరిపోయే క్యాప్సికమ్ పచ్చడి ఎలా తయారు చేయాలి, పచ్చడి తయారీకి కావాల్సిన పదార్దాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి.

క్యాప్సికమ్ టమాటా పచ్చడికి కావాల్సిన పదార్దాలు

  • క్యాప్సికం – మూడు
  • ఉల్లి పాయ - ఒకటి
  • ప‌ల్లీలు – మూడు స్పూన్స్
  • ధ‌నియాలు – ఒక స్పూన్
  • ప‌చ్చిమిర్చి – నాలుగు
  • ప‌సుపు – అర స్పూన్
  • ట‌మాటాలు – రెండు
  • చింత‌పండు – ఒక బొట్ట
  • ఉప్పు – త‌గినంత‌
  • వెల్లుల్లి రెబ్బలు – 5
  • ఆవాలు - అర స్పూన్
  • శెనగపప్పు - ఒక స్పూన్
  • మినపగుళ్ళు - ఒక స్పూన్
  • ఎండు మిర్చి - రెండు
  • జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్
  • కరివేపాకు - రెండు రెమ్మలు
  • నూనె – ఒక టేబుల్ స్పూన్

క్యాప్సికమ్ పచ్చడి తయారీ విధానం

ముందుగా క్యాప్సికం కడిగి చిన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి  ఒక క‌ళాయిలో ప‌ల్లీలు వేసి వేయించాలి. ప‌ల్లీలు వేగిన త‌రువాత ధ‌నియాలు వేసి వేయించాలి. త‌రువాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి ఐదు నిమిషాల పాటు వేయించాలి.

త‌రువాత ట‌మాట ముక్క‌లు, క్యాప్సికం ముక్కలు, సరిపడా ఉప్పు, చింత‌పండు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి ట‌మాట, క్యాప్సికం ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు జార్ లో వేయించిన ప‌ల్లీల‌ను తీసుకుని మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఇందులోనే వేయించిన క్యాప్సికం, ట‌మాట ముక్క‌లు, జీల‌క‌ర్ర‌, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ ప‌ట్టుకోవాలి.

ఇప్పుడు పోపు కోసం క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఆవాలు, ఎండుమిర్చి, శనగపప్పు, మినపగుళ్ళు, కరివేపాకు ఒక్కొక్క‌టిగా వేసి తాళింపు బాగా వేయించాలి. తాళింపు చ‌క్క‌గా వేగిన త‌రువాత దీనిని ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న ప‌చ్చ‌డిలో వేసి క‌ల‌పాలి. అంతే టేస్టీ టేస్టీ క్యాప్సికం  పచ్చడి రెడీ అయినట్లే.

క్యాప్సికం టమాటా పచ్చడిలో పోషకాలు, ప్రయోజనాలు

క్యాప్సికమ్‌లో ఎక్కువగా కనిపించే కొన్ని పోషకాలు విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి6 మరియు ఫోలేట్ . రెడ్ క్యాప్సికమ్ ప్రపంచంలో అత్యంత విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలలో ఒకటి. కేవలం 100గ్రా మీ రోజువారీ సిఫార్సు చేసిన తీసుకోవడంలో 213% ఇస్తుంది.

క్యాప్సికమ్ లేదా బెల్ పెప్పర్స్‌లో 94% నీరు, 5% కార్బోహైడ్రేట్లు, చాలా తక్కువ మొత్తంలో ప్రోటీన్ మరియు కొవ్వు ఉంటాయి అలాగే నియాసిన్ మరియు రైబోఫ్లేవిన్ కూడా పుష్కలంగా ఉంటాయి. క్యాప్సికమ్ లో విటమిన్ సి అధికంగా లభిస్తుంది. ఇది కొల్లాజెన్‌ను నిర్మించడంలో సహాయపడుతుంది . కొల్లాజెన్ చర్మం యొక్క దృఢత్వాన్ని కాపాడుతుంది మరియు కణాలకు ఎలాంటి హాని జరగకుండా కాపాడుతుంది. ఇది ఆక్సీకరణ నష్టం నుండి రక్షించుకునే చర్మ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.

పచ్చి మిరియాలలో ఐరన్ ఎక్కువగా ఉండటమే కాకుండా, విటమిన్ సి కూడా సమృద్ధిగా ఉంటుంది, ఇది మీ శరీరం ఇనుమును మరింత సమర్థవంతంగా గ్రహించడంలో సహాయపడుతుంది. ఇనుము లోపం ఉన్న రక్తహీనతను నివారించడానికి మరియు చికిత్స చేయడానికి ఈ కలయిక పచ్చి మిరియాలను సూపర్‌ఫుడ్‌గా ఉపయోగపడుతుంది.

ఆకుపచ్చ క్యాప్సికమ్‌లు నాలుగు రంగులలో అత్యంత చేదుగా ఉంటాయి, పసుపు రెండవ స్థానంలో ఉంటుంది , రెండూ స్టైర్-ఫ్రైస్ లేదా ఇలాంటి రుచికరమైన వంటకాల్లో ఉత్తమంగా ఉపయోగించబడతాయి. నారింజ మరియు ఎరుపు క్యాప్సికమ్‌లు సలాడ్‌ల వంటి “సమ్మరీ” వంటకాలకు మరింత సముచితమైనవి, ఎరుపు క్యాప్సికమ్‌లు అన్ని రంగులలోని అత్యంత విటమిన్‌లను కలిగి ఉంటాయి.

Post Comment