పచ్చి బఠాణి పన్నీర్ కర్రీ తయారీ విధానం : మటర్ పన్నీర్ కర్రీ
భారతీయ వంటకాలు

పచ్చి బఠాణి పన్నీర్ కర్రీ తయారీ విధానం : మటర్ పన్నీర్ కర్రీ

ఈ ఆర్టికల్ యందు టేస్టీ టేస్టీగా బఠాణి మరియు పన్నీర్ కాంబినేషన్లో చేసే బఠాణి పన్నీర్ కర్రీ రెసిపీ తయారీ విధానం,  ఈ కర్రీ తయారీకి కావాల్సిన పదర్ధాలు గూర్చి తెలుసుకుందాం. మీరు నేర్చుకుని ట్రై చేసి రుచి చూడండి.

బఠాణి పన్నీర్ కర్రీకి కావాల్సిన పదార్దాలు

  • ప‌న్నీర్ – 200 గ్రా
  • ప‌చ్చి బ‌ఠాణీ – ఒక క‌ప్పు
  • ట‌మాటాలు –  నాలుగు
  • ఉల్లిపాయలు – రెండు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక స్పూన్
  • కారం – ఒక స్పూన్
  • గ‌రం మ‌సాలా – ఒక స్పూన
  • ధ‌నియాల పొడి – ఒక స్పూన్
  • కొత్తిమీర – కొద్దిగా
  • నూనె – 3 టేబుల్ స్పూన్స్
  • ఉప్పు – త‌గినంత‌
  • ప‌సుపు – అర టీ స్పూన్
  • జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్
  • ప‌చ్చిమిర్చి – రెండు
  • బ‌ట‌ర్ – ఒక టేబుల్ స్పూన్
  • జీడిపప్పు – తగినన్ని
  • యాల‌కులు – రెండు
  • దాల్చిన చెక్క – ఒక చిన్న ముక్క‌
  • ల‌వంగాలు – రెండు

బఠాణి పన్నీర్ కర్రీ తయారీ విధానం

ముందుగా పన్నీర్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక పన్నీర్ దోరగా వేయించి ఒక కప్పులో తీసి పెట్టుకోవాలి. తరవాత అదే కళాయిలో త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు, మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు స‌గం వేగిన త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి టమాటా మెత్తగా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి.

త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లార‌నివ్వాలి. చల్లారిన తరవాత ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ లోకి తీసుకుని మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, బ‌ఠాణీ వేసి వేయించాలి. బ‌ఠాణీ వేగిన త‌రువాత అల్లం పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలా పేస్ట్, సరిపడా ఉప్పు, ప‌సుపు, కారం, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా వేసి నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి.

ఇలా ఉడికించిన త‌రువాత ముందుగా వేయించిన ప‌న్నీర్ ముక్కలు, ఒక గ్లాస్ నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత ఒక టేబుల్ స్పూన్ బ‌ట‌ర్ వేసి మ‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి, పైన కొత్తిమీర చల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ బఠాణి పన్నీర్ కర్రీ రెడీ అయినట్లే . దీనిని చ‌పాతీ, రోటీ, పుల్కా, నాన్, బ‌ట‌ర్ నాన్ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.

బఠాణి పన్నీర్ కర్రీలో లభించే పోషకాలు, ప్రయోజనాలు

పనీర్‌లో అవసరమైన అమైనో ఆమ్లాలను అందించే అధిక-నాణ్యత ప్రోటీన్ ఉంటుంది. పనీర్‌లో కాల్షియం, జింక్ మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇందులో విటమిన్ బి12, విటమిన్ డి, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి మరియు విటమిన్ ఎ వంటి విటమిన్లు కూడా ఉన్నాయి.

పచ్చి బఠానీలలో సంతృప్త కొవ్వు, కొలెస్ట్రాల్ మరియు ఉప్పు తక్కువగా ఉంటాయి. అవి విటమిన్ A, విటమిన్ B6, ఫోలేట్ మరియు మెగ్నీషియంతో సహా ప్రోటీన్, విటమిన్లు మరియు ఖనిజాలకు మంచి మూలం . అవి ఫైబర్, విటమిన్ సి, విటమిన్ కె, థయామిన్ మరియు మాంగనీస్ యొక్క అద్భుతమైన మూలం.

బఠానీలు మెగ్నీషియం, పొటాషియం మరియు కాల్షియంతో సహా గుండె-స్నేహపూర్వక ఖనిజాలను కలిగి ఉంటాయి మరియు విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్ పోషకాలలో కూడా పుష్కలంగా ఉంటాయి, అలాగే గుండె రక్షణ మరియు హృదయనాళ పనితీరుకు మద్దతు ఇచ్చే కెరోటినాయిడ్స్ మరియు ఫ్లేవనాల్స్‌తో సహా ఫైటోన్యూట్రియెంట్‌లు కూడా పుష్కలంగా ఉన్నాయి.

పన్నీర్ లో కాల్షియం, జింక్ మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇందులో విటమిన్ బి12, విటమిన్ డి, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి మరియు విటమిన్ ఎ వంటి విటమిన్లు కూడా ఉన్నాయి . ఎముకల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది: పనీర్‌లో ఉండే విటమిన్ డి మరియు కాల్షియం ఎముకలను దృఢంగా చేస్తుంది మరియు బోలు ఎముకల వ్యాధిని నివారిస్తుంది.

Post Comment