క్యారెట్ హల్వా తయారీ విధానం : గజర్ హల్వా రెసిపీ
భారతీయ వంటకాలు

క్యారెట్ హల్వా తయారీ విధానం : గజర్ హల్వా రెసిపీ

క్యారెట్ల లో అన్ని పోషకాల లోకెల్లా విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది . విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది మరియు చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. విటమిన్ ఎ లోపము వల్ల వచ్చే వ్యాదులని నివారిస్తుంది. ఈ ఆర్టికల్ యందు ఎంచక్కా ఇంట్లోనే క్యారెట్ హల్వా ఈజీగా తయారు చేసుకొనే విధానం, కావలసిన పదార్దాలు గూర్చి తెలుసుకుందాం.

క్యారెట్ హల్వా తయారీకి కావలసిన పదార్దాలు

  • క్యారెట్ - అర కేజీ
  • పాలు - ఒక లీటరు
  • ఏలకులు - ఐదు
  • నెయ్యి - రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్
  • పంచదార- పావుకేజి (సరిపడా)
  • ఎండు ద్రాక్షలు - గుప్పెడు
  • బాదం - గుప్పెడు
  • జీడిపప్పు - గుప్పెడు

క్యారెట్ హల్వా తయారీ విధానం

ముందుగా క్యారెట్లను శుభ్రం చేసుకుని గుండగా తురుముకోవాలి. తరవాత ఒక పాన్ తీసుకుని కొద్దిగా నెయ్యి వేసి బాదం పప్పు, జీడీ పప్పు, కిస్మిస్ దోరగా వేయించి తీసి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పాలు తీసుకుని మీడియం ఫ్లేమ్ లో బాగా మరింగించాలి. మద్యమద్యలో స్పూన్ తో కలియబెడుతుండాలి. లేదంటే ప్రాత అడుగున అంటుకొంటుంది. కాబట్టి మద్యమద్యలో కలియబెడుతూ ముప్పై నిముషాల పాటు బాగా మరిగించాలి.

పాలు చిక్కగా, క్రీమీగా మారుతున్న సమయంలో అందులో క్యారెట్ తురుమును వేసి క్యారెట్ ను బాగా మెత్తగా ఉడికించుకోవాలి. క్యారెట్ మెత్తగా ఉడికిన తర్వాత అందులో యాలకులను పొడి చేసి వేయాలి. క్యారెట్ బాగా మెత్తబడుతూ పాలు పూర్తిగా ఇమిరిపోయే వరకూ ఉడికించాలంటే కనీసం ముప్పై నుంచి నలభై నిముషాల సమయం పడుతుంది.

పాలు మొత్తం క్యారెట్ తో ఇంకిపోయి చిక్కగా ముద్దలా అయిన తర్వాత, నెయ్యి, పంచదార, వేయించిన ఎండు ద్రాక్షలు, బాదంపప్పుల పలుకులు వేసి, పంచదార పూర్తిగా కరిగే వరకు లో- ఫ్లేమ్ లో కలుపుతూ ఉడికించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి. అంతే క్యారెట్ హల్వా రెడీ. వేడివేడిగా కాకుండా కొద్దిగా చల్లారాక సర్వ్ చేయండి ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టి మంచి రుచి హల్వా వస్తుంది.

క్యారెట్ హల్వాలో లభించే పోషక విలువలు

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, క్యారెట్ హల్వా కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది . క్యారెట్‌లో విటమిన్ ఎ, మరియు సి మరియు ఫైబర్‌లు పుష్కలంగా ఉన్నాయి, ఇవి దృష్టికి, మంచి చర్మానికి, రోగనిరోధక వ్యవస్థకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్ల పుష్కలంగా ఉండి క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది.

హల్వాలో డ్రైఫ్రూట్స్ మరియు నెయ్యి జోడించడం వల్ల దాని రోగనిరోధక శక్తిని పెంచుతుంది. డ్రై ఫ్రూట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు మరియు ప్రొటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. క్యారెట్ హల్వాలో బీటాకెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. బీటా కెరోటిన్ అనేది శరీరం ద్వారా విటమిన్ A గా మార్చబడిన ఒక సమ్మేళనం . విటమిన్ ఎ శరీరంలో అనేక ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది.

Post Comment