కాలిఫ్లవర్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం : గోబీ ఫ్రైడ్ రైస్ రెసిపీ
భారతీయ వంటకాలు

కాలిఫ్లవర్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం : గోబీ ఫ్రైడ్ రైస్ రెసిపీ

రైస్ కాంబినేషన్లో చేసే ప్రతీ రెసిపీకి ఒక ప్రత్యేక రుచి కలిగి ఉంటుంది. ఈ ఆర్టికల్ యందు కాలిఫ్లవర్ మరియు రైస్ కాంబినేషన్లో చేసే కాలిఫ్లవర్  ఫ్రైడ్ రైస్ రెసిపీ ఎలా తయారు చేయాలి, ఫ్రైడ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్ధాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. మీరు కూడా నేర్చుకుని ఒక్కసారి ట్రై చేయండి.

కాలిఫ్లవర్ ఫ్రైడ్ రైస్‌కి కావల్సిన పదార్దాలు

  • కాలిఫ్లవర్ - ఒకటి
  • బాస్మతీ రైస్ - రెండు కప్పులు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూన్
  • ఉప్పు - తగినంత
  • మిరియాల పొడి - అర స్పూన్
  • కారం - అర స్పూన్
  • నూనె - నాలుగు స్పూన్స్
  • పచ్చిమిర్చి - రెండు లేదా నాలుగు
  • ఉల్లిపాయ- రెండు
  • పచ్చి బఠాణీ - అర  కప్పు
  • మైదా పిండి - ఒక స్పూన్
  • కార్న్ ఫ్లోర్ - ఒక స్పూన్
  • వెల్లుల్లి రెబ్బలు - ఆరు
  • వెనిగర్ - ఒక స్పూన్
  • గ్రీన్ చిల్లీ సాస్ - ఒక స్పూన్
  • సోయా సాస్ - పీక స్పూన్
  • కొత్తిమీర - నాలుగు రెమ్మలు

కాలిఫ్లవర్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం

ముందుగా రైస్ కడిగి అరగంట సేపు నాన బెట్టి, కొంచెం పలుకుగా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కాలిఫ్లవర్ కడిగి చిన్న చిన్న ముక్కలుగా విడదీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో క్యాలీ ఫ్లవర్ ముక్కలు తీసుకుని అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కారం, ఉప్పు, మైదా పిండి, కార్న్ ఫ్లోర్, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా నీటిని వేసుకుని మొత్తం ముక్కలన్నింటికీ పట్టేలా మిక్స్ చేసుకోవాలి.

ఇలా కలిపిన కాలిఫ్లవర్ ముక్కలను నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని ఒక ప్లేట్ లోకి తీసుకుని పెట్టుకోవాలి. ఆ తర్వాత మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టి  వెడల్పుగా ఉన్న పాన్ తీసుకుని సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక వెల్లుల్లి తరుగు,సన్నగా తరిగిన ఉల్లి పాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి.

ఇవి వేగాక అందులో పచ్చి బఠాణి వేసి కొద్ది సేపు వేయించుకోవాలి.తరవాత కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు, కారం, వెనిగర్, సోయా సాస్, చిల్లీ సాస్ వేసి బాగా వేయించాలి. తర్వాత అందులో వేయించిన కాలిఫ్లవర్ ముక్కలు, ముందుగా ఉడికించిన అన్నాన్ని కూడా వేసి హై ఫ్లేమ్ మీద బాగా వేయించాలి. చివరిగా  కొత్తి మీర వేసి ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే ధాబా స్టైల్ క్లాలీ ఫ్లవర్ రైస్ రెడీ. ఇంకెందుకు లేట్ మీరూ ఓ సారి ట్రై చేయండి.

కాలిఫ్లవర్ ఫ్రైడ్ రైస్‌లో లభించే పోషకాలు, ప్రయోజనాలు

పోషకాహారం విషయానికి వస్తే, కాలీఫ్లవర్ సూపర్ స్టార్. ఇది విటమిన్లు C మరియు K లలో అధికంగా ఉంటుంది మరియు ఫోలేట్ యొక్క మంచి మూలం, ఇది కణాల పెరుగుదలకు మద్దతు ఇస్తుంది మరియు గర్భధారణ సమయంలో అవసరం. కాలీఫ్లవర్ కొవ్వు రహిత మరియు కొలెస్ట్రాల్ లేనిది. మరియు ఇందులో సోడియం తక్కువగా ఉంటుంది.

ఇది విటమిన్లు C మరియు K లలో అధికంగా ఉంటుంది మరియు ఫోలేట్ యొక్క మంచి మూలం, ఇది కణాల పెరుగుదలకు మద్దతు ఇస్తుంది మరియు గర్భధారణ సమయంలో అవసరం. కాలీఫ్లవర్ కొవ్వు రహిత మరియు కొలెస్ట్రాల్ లేనిది. మరియు ఇందులో సోడియం తక్కువగా ఉంటుంది. ఒక కప్పు సర్వింగ్‌లో 25 కేలరీలు, 5 గ్రాముల కార్బోహైడ్రేట్లు మరియు 2 గ్రాముల డైటరీ ఫైబర్ మాత్రమే ఉంటాయి.

పచ్చి బఠానీలు అత్యధిక ప్రొటీన్లతో కూడిన కూరగాయల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఒక కప్పు పచ్చి బఠానీలో 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.కాలీఫ్లవర్‌లో విటమిన్ B-6 కూడా ఉంది, ఇది మెదడు అభివృద్ధికి మరియు మన నాడీ మరియు రోగనిరోధక వ్యవస్థల సరైన పనితీరుకు ముఖ్యమైనది . కూరగాయలలోని విటమిన్ సి చర్మం, స్నాయువులు మరియు రక్త నాళాలను తయారు చేయడానికి శరీరానికి ప్రోటీన్‌ను ఏర్పరుస్తుంది.

Post Comment