బీన్స్ పులావ్ రెసిపీ తయారీ విధానం : పోషకాలు, ప్రయోజనాలు
భారతీయ వంటకాలు

బీన్స్ పులావ్ రెసిపీ తయారీ విధానం : పోషకాలు, ప్రయోజనాలు

రైస్ కాంబినేషన్లో చేసే ప్రతీ రెసిపీకి ఒక ప్రత్యేక రుచి కలిగి ఉంటుంది. ఈ ఆర్టికల్ యందు బీన్స్ మరియు రైస్ కాంబినేషన్లో చేసే బీన్స్ పులావ్ రెసిపీ ఎలా తయారు చేయాలి, తయారీకి కావాల్సిన పదార్ధాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. బీన్స్ రైస్ లో పోషకాలు సంవృద్ధిగా లభిస్తాయి మరియు చాలా ఆరోగ్యప్రయోజనాలు కూడా ఉన్నాయి. మీరు కూడా నేర్చుకుని ఒక్కసారి ట్రై చేయండి.

బీన్స్ పులావ్ తయారీకి కావాల్సిన పదార్దాలు

  • బాస్మతి రైస్ - రెండు కప్పులు
  • బీన్స్ - పావుకిలో
  • బఠాణీలు - పావు కప్పు
  • టమాటా - ఒకటి
  • ఉల్లిపాయలు - రెండు
  • పచ్చి మిర్చి - నాలుగు
  • పసుపు - పావు టీ స్పూన్
  • జీలకర్ర - ఆఫ్ టీ స్పూన్
  • దాల్చిన చెక్క - చిన్న ముక్క
  • లవంగాలు - రెండు
  • యాలకులు - రెండు
  • బిర్యానీ ఆకులు - రెండు
  • గరం మసాలా - అర  స్పూన్
  • మిరియాలు పొడి - పావు టీ స్పూన్
  • ఉప్పు - సరిపడా
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్
  • నూనె - రెండు స్పూన్స్
  • నెయ్యి - రెండు స్పూన్స్
  • కొత్తిమీర - రెండు రెమ్మలు
  • నీళ్లు నాలుగు కప్పులు

బీన్స్ పులావ్ తయారీవిధానం

ముందుగా బియ్యంను శుభ్రంగా కడిగి ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఉల్లిపాయలను సన్నగా తరిగి సగం ముక్కలను డెకరేషన్ కోసం వేయించుకుని పక్కనబెట్టుకోవాలి. అలాగే బీన్స్ మీడియం సైజు ముక్కలుగా కట్ చేసికుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మందంగా ఉన్న పాన్ స్టౌమీద పెట్టి, అందులో నూనె వేయాలి. నూనె వేడయ్యాక అందులో జీలకర్ర, బిర్యానీ ఆకు, మిరియాల పొడి, దాల్చిన చెక్క, యాలకులు వేసి ఒక నిమిషం వేయించాలి.

ఇప్పుడు అందులో వేయించగా మిగిలిన ఉల్లిపాయ ముక్కలు వేసి లేత బ్రౌన్ కలర్ వచ్చేలా ఐదు నిముషాలు వేయించాలి. ఐదు నిమిషాల తరవాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేలా మరో రెండు నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. అనంతరం అందులో బీన్స్, పచ్చిబటానీ, పచ్చిమిర్చిలను వేసి ఐదు నిముషాలు ఫ్రై చేసుకోవాలి. ఐదునిమిషాలు తరవాత, అందులో టమోటో ముక్కలు, కొద్దిగా పసుపు, సరిపడ ఉప్పు , గరం మసాలా వేసి మరో ఐదు నిముషాలు మగ్గనివ్వాలి.

ఇలా మగ్గిన తర్వాత అందులో నానబెట్టిన బాస్మతి రైస్ వేసి కలుపుతూ రెండు నిముషాలు వేయించాలి. ఇప్పుడు అందులో సరిపడా నీళ్ళు పోసి బాగా కలిపి, పాన్ పై మూత పెట్టి పది నిముషాల పాటు మీడియం మంట మీద ఉడికించుకోవాలి. నీరు దగ్గరగా అయిన తర్వాత మంట తగ్గించుకుని మరో ఐదు నిముషాలు మగ్గించాలి. చివర్లో స్టవ్ ఆఫ్ చేసుకుని పైన కొత్తిమీర తరుగు, నెయ్యి, ముందుగా వేయించిన ఉల్లి తరుగు, కొత్తిమీర వేసి అలంకరించుకోవాలి. అంతే వేడివేడిగా సర్వ్ చేసుకోవటమే.

బీన్స్ పులావ్ లో లభించే పోషకాలు, ప్రయోజనాలు

బీన్స్ మరియు పచ్చి బఠాణీలో ప్రోటీన్, ఫైబర్, ఫోలేట్, ఐరన్, పొటాషియం మరియు మెగ్నీషియంలను సంవృద్ధిగా అందిస్తాయి , అయితే కొవ్వు, ట్రాన్స్-ఫ్యాట్, సోడియం మరియు కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటాయి. బియ్యం మరియు బీన్స్ పుష్కలంగా తింటే, మీరు సులభంగా లీన్ ప్రోటీన్ పొందవచ్చు . ఎక్కువ ప్రొటీన్‌లు తినడం వల్ల కండర ద్రవ్యరాశిని నిర్మించడంతోపాటు ఆరోగ్యకరమైన బరువును కాపాడుకోవచ్చు .

కేవలం ఒక కప్పు బీన్స్ మరియు అన్నం 12 గ్రాముల పూర్తి ప్రొటీన్, 10 గ్రాముల ఫైబర్ మరియు B-6, విటమిన్ E, ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం మరియు పొటాషియంతో సహా US డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ సిఫార్సు చేసిన అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలను అందిస్తుంది.

తక్కువ కొలెస్ట్రాల్ స్థాయిలు గుండె జబ్బులు మరియు స్ట్రోక్ వంటి సమస్యలను నివారిస్తాయి . బీన్స్ కూడా కరగని ఫైబర్‌తో నిండి ఉంటుంది, ఇది మీ శరీరం జీర్ణించుకోదు. కరగని ఫైబర్ మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో, మీ మలానికి ఎక్కువ భాగం జోడించడంలో సహాయపడుతుంది. మీ జీర్ణవ్యవస్థలోని కొన్ని బ్యాక్టీరియాలు ఈ కరగని ఫైబర్‌ని వినియోగిస్తాయి.

బీన్స్ మరియు చిక్కుళ్ళు ఫైబర్-రిచ్ న్యూట్రియంట్ పవర్‌హౌస్‌లు మరియు ప్రోటీన్ యొక్క అద్భుతమైన మూలం" అని హోప్సెగర్ చెప్పారు. " ఒక సర్వింగ్ (1/2 కప్పు వండిన) బీన్స్ 7 గ్రాముల ప్రోటీన్‌ను అందిస్తుంది , అదే 1 ఔన్స్ మాంసం." బీన్స్ మరియు చిక్కుళ్ళు కూడా మిమ్మల్ని నిండుగా, ఎక్కువసేపు ఉంచుతాయి ఎందుకంటే వాటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

Post Comment