ఉల్లి మసాలా గుత్తి వంకాయ కూర తయారీ విధానం : ఆంధ్ర స్పెషల్
భారతీయ వంటకాలు

ఉల్లి మసాలా గుత్తి వంకాయ కూర తయారీ విధానం : ఆంధ్ర స్పెషల్

వంకాయతో చేసే వంటకాలలో గుత్తి వంకాయ కూరకు ఎంత క్రేజ్ వుందో మనకు తెలిసిందే. ఈ ఆర్టికల్ యందు టేస్టీ టేస్టీగా ఆంధ్ర స్పెషల్ టేస్టీ టేస్టీ ఉల్లి మసాలా గుత్తి వంకాయ కూర రెసిపీ తయారీ విధానం, కావాల్సిన పదర్ధాలు గూర్చి తెలుసుకుందాం.

గుత్తి వంకాయ కూరకి కావాల్సిన పదార్ధాలు

  • లేత వంకాయలు - పావుకిలో
  • కారం - సరిపడా
  • టమాటా - రెండు
  • ఉల్లిపాయలు - నాలుగు
  • దాల్చిన చెక్క - చిన్న ముక్క
  • ధనియాలు  - ఒక టీ స్పూన్ స్పూన్
  • జీలకర్ర - ఒక టీ స్పూన్
  • లవంగాలు - నాలుగు
  • యాలకులు - నాలుగు
  • ఆవాలు - 1/2 టీ స్పూన్
  • అల్లం - చిన్న ముక్క
  • వెల్లుల్లి - ఎనిమిది రెబ్బలు
  • గరమసాల పొడి - ఒక టీ స్పూన్
  • కరివేపాకు - రెండు రెమ్మలు
  • పచ్చిమిర్చి -  మూడు
  • కొత్తిమీర - రెండు రెమ్మలు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పసుపు - ఒక టీ స్పూన్
  • నూనె - సరిపడా

గుత్తి వంకాయ కూర తయారు చేసే విధానం

వంకాయలు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ముందుగా దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, అల్లం, వెల్లుల్లి, తరిగిన ఉల్లిపాయ ముక్కలు అన్నీ మిక్సీలో వేసి నీళ్లు వేయకుండా పొడి చేసుకోవాలి.

అనంతం ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుని దానిలో కొంచెంకారం, గరంమసాలా పొడి వేసుకుని కలిపాలి. ముందుగా కడిగి పెట్టుకున్న వంకాయలను తీసుకుని, వాటిని మధ్యలో ప్లస్ లాగ కోసి  అందులో ఈ మసాలా కూరాలి.

అనంతరం స్టవ్ ఆన్ చేసి ఒక బాణలి పెట్టి నూనె వేడి చేసుకోవాలి. నూనె కాగాక అందులో కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి వేసి రెండు నిముషాలు వేయించాలి . తరవాత అందులో మసాలా పెట్టుకున్న వంకాయలను వేసి మూత పెట్టుకోవాలి. వంకాయలు నూనెలో బాగా మగ్గిన తర్వాత, టమాటా గుజ్జు వేసుకొని మరో ఐదు నిముషాలు మగ్గనివ్వాలి.

ఇప్పుడు వంకాయలలో స్టఫ్ చేయగా మిగిలిన మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి మూత పెట్టీ లో- ఫ్లేమ్ లో ఐదు నిముషాలు ఉడికించాలి. ఐదు నిమిషాల తరవాత కొద్దిగా నీళ్ళు పొసి ఆవిరి అయ్యేవరకు ఉడికించాలి. అంతే వేడి వేడి టేస్టీ ఉల్లి మసాలా గుత్తి వంకాయ కూర రెడీ అయినట్లే.

అయితే కూర కలిపే సమయంలో గుత్తి వంకాయలు విరగకుండా చూసుకోవాలి. చివరలో ఉప్పు కారం చూసి కొత్తిమీర వేసి దింపాలి. ఈ ఉల్లి మసాలా గుత్తి వంకాయ కూర వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.

గుత్తి వంకాయ కూర తయారీ చిట్కాలు

గుత్తి వంకాయ కర్రీ కోసం తాజా మరియు లేత చిన్న వంకాయలను తీసుకోవాలి. వంకాయలను వేయించేటపుడు ఎక్కువుగా కలపకుండా వేయించాలి. లేదంటే కట్ చేసిన వంకాయలు ముక్కలుగా విడిపోతాయి. వంకాయలు మెత్తగా అయ్యేలా నూనెలో వేయించాలి.

కూరలో మసాలాలు సరిపడా వేయండి. మసాలాలు తగినంతగా వేయటం వలన కూరకు మంచి రుచి వస్తుంది. గుత్తి వంకాయ కూర మరింత రుచి కావాలనుకుంటే మసాలా స్టాఫ్ లో నువ్వులు పొడి లేదా కొబ్బరి పొడి కూడా జోడించవచ్చు.

గుత్తి వంకాయ కర్రీలో పోషకాలు

గుత్తి వంకాయ కూరలో అనేక పోషక విలువలు కలిగి వుంటుంది. ఈ కూరలో కేలరీలు తక్కువుగా ఉండి, ఫైబర్, విటమిన్స్ మరియు ఖనిజాలు ఎక్కువుగా ఉంటాయి.గుత్తివంకాయ కూరలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచటానికి మరియు చర్మం ఆరోగ్యాంగా ఉండటంలో సహాయపడుతుంది.

గుత్తివంకాయ కూరలో విటమిన్ కె కూడా ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టడానికి మరియు ఎముకులు ఆరోగ్యాన్ని కాపాడడానికి తోడాడుతుంది.ఇందులో పొటాషియం ఎక్కువుగా లభిస్తుంది, ఇది రక్తపోటును, మరియు  కండరాల పనితీరు మెరుగుపరచటానికి ఉపయోగపడుతుంది. ఈ కూరలో ఫైబర్ సంవృద్ధిగా లభిస్తుంది. ఇది జీర్ణ క్రియను మెరుగుపర్చటమే కాకుండా మలబద్దకంను నివారిస్తుంది.

Post Comment