పుదీనా రైస్ రెసిపీ చేయడం ఎలా : పుదీనా రైస్ పులావ్
భారతీయ వంటకాలు

పుదీనా రైస్ రెసిపీ చేయడం ఎలా : పుదీనా రైస్ పులావ్

రైస్ కాంబినేషన్లో చేసే ఏ వంటకం అయినా ఒక ప్రత్యేక రుచిని కలిగి ఉంటుంది. ఈ ఆర్టికల్ యందు పుదీనా మరియు రైస్ కాంబినేషన్లో చేసే పుదీనా రైస్ రెసిపీ ఎలా తయారు చేయాలి, కావాల్సిన పదార్ధాలు ఇక్కడ తెలుసుకుందాం.

పుదీనా రైస్ తయారీకి కావాల్సిన పదార్ధాలు

  • రైస్ - నాలుగు కప్పులు
  • పుదీనా - ఒక కప్పు
  • అల్లం తురుము - ఒక టీ స్పూన్
  • వెల్లుల్లి - నాలుగు
  • పచ్చిమిర్చి - నాలుగు
  • కొత్తిమీర -  అర కప్పు
  • ఉల్లిపాయలు - రెండు
  • కొబ్బరి తురుము - రెండు స్పూన్స్
  • జీడీ పప్పు - తగినన్ని
  • పసుపు - చిటికెడు
  • ఆవాలు - అర టీ స్పూన్
  • ఎండు మిర్చి - నాలుగు
  • జీరా - అర స్పూన్
  • కరివేపాకు - రెండు రెమ్మలు
  • నూనె - నాలుగు స్పూన్స్

పుదీనా రైస్ తయారు చేయు విధానం

ముందుగా బియ్యం కడిగి ఇరవై నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను సగం వేసుకుని బంగారు రంగులో వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. తరవాత అదే పాన్‌లో జీడీ పప్పు కూడా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.

తరవాత మిక్సీలో పుదీనా ఆకులు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, మిగిలిన ఉల్లిపాయలు, కొబ్బరి వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్‌లో నూనె వేసి, కాగాక ఇందులో కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర వేసి రెండు నిముషాలు వేయించుకోవాలి. రెండు నిమిషాల తరవాత ఇందులో ముందుగా మిక్సీ పట్టిన పుదీనా పేస్ట్ కూడా వేసి, మరో రెండు నిముషాలు పచ్చి వాసన పోయేలా వేయించాలి.

ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న బియ్యం వేసి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. అనంతరం బియ్యం ఉడికించేందుకు సరిపడే నీరు పోసి, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పువేసి మూతపెట్టి మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. నీరు దగ్గరగా అయ్యాక మంట తగ్గించి ముందుగా వేయించిన ఉల్లి, జీడిపప్పు మిశ్రమం, కొద్దిగా నెయ్యి వేసి మగ్గనివ్వాలి.  అంతే ఘుమ ఘుమలాడే పుదీనా అన్నం రెడీ అయినట్లే.

పుదీనా రైస్‌లో లభించే పోషకాలు

పుదీనా ఆకులు విటమిన్లు మరియు మినరల్స్ యొక్క మంచి మూలంగా పరిగణించబడతాయి. పుదీనా జీర్ణక్రియ మెరుగుపర్చటంలో సహాయపడుతుంది, యాంటిస్పాస్మోడిక్ ఆస్తి కారణంగా బరువు నిర్వహణలో సహాయపడుతుంది. పుదీనా ఆకులను నమలడం వల్ల కడుపు ఉబ్బరం మరియు గ్యాస్ నుండి ఉపశమనం లభిస్తుంది.

పుదీనా అన్నంలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది జీర్ణక్రియను నియంత్రించటంలో మరియు మలబద్దకంను నివారించటంలో సహాయపడుతుంది. పుదీనాలో యాంటీఇన్ఫలమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది శరీరం అంతటా మంటను తగ్గించటంలో సహాయపడుతుంది.

పుదీనాలో విటమిన్ సి సంవృద్ధిగా లభిస్తుంది. విటమిన్ సి ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు తొడపడుతుంది. విటమిన్ సి కణాల నష్టం నుండి రక్షించటంలో సహాయపడుతుంది. గుండెజబ్బులు, కేన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాలను తగ్గించటంలో సహాయపడుతుంది.

Post Comment