ఆంధ్ర స్పెషల్ గోంగూర పులిహోర తయారీ విధానం : పోషకాలు
భారతీయ వంటకాలు

ఆంధ్ర స్పెషల్ గోంగూర పులిహోర తయారీ విధానం : పోషకాలు

రైస్ కాంబినేషన్లో చేసే ప్రతీ రెసిపీకి ఒక ప్రత్యేక రుచి కలిగి ఉంటుంది. ఈ ఆర్టికల్ యందు గోంగూర మరియు రైస్ కాంబినేషన్లో చేసే గోంగూర పులిహోర రెసిపీ ఎలా తయారు చేయాలి, తయారీకి కావాల్సిన పదార్ధాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. గోంగూర పులిహోరలో పోషకాలు సంవృద్ధిగా లభిస్తాయి మరియు చాలా ఆరోగ్యప్రయోజనాలు కూడా ఉన్నాయి. మీరు కూడా నేర్చుకుని ఒక్కసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్లకు రుచి చూపించండి.

గోంగూర పులిహోరకి కావాల్సిన పదార్దాలు

  • రైస్ - రెండు కప్పులు
  • గోంగూర - ఒక కట్ట
  • వేరుశనగ గుళ్లు - పిడికెడు
  • జీడిపప్పు - కొద్దిగా
  • పచ్చి శనగ పప్పు - రెండు స్పూన్స్
  • సాయ మినపప్పు - రెండు స్పూన్స్
  • ఎండు మిర్చి - రెండు
  • పచ్చి మిర్చి - రెండు
  • ఆవాలు - ఒక స్పూన్
  • జీరా - అర స్పూన్
  • కరివేపాకు - రెండు రెమ్మలు
  • పసుపు అర స్పూన్
  • ఇంగువ - కొద్దిగా
  • చింత పండు గుజ్జు - రెండు స్పూన్స్
  • ఉప్పు - తగినంత
  • నువ్వుల నూనె - రెండు స్పూన్
  • నెయ్యి - ఒక స్పూన్
  • కొత్తిమీర - రెండు రెమ్మలు

గోంగూర పులిహోర తయారీ విధానం

ముందుగా అన్నం కొంచెం పలుకుగా వండుకోవాలి. అన్నం ఉడికాక పైన కొంచెం నెయ్యి వేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత పాన్‌లో కొద్దిగా నూనె, గోంగూర ఆకులు వేసుకుని, మెత్తబడి వరకు వేయించి, చల్లారాక పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరొక పాన్‌లో కొంచెం నూనె, నెయ్యి వేసుకుని వేడిచేయాలి. నూనె వేడయ్యాక వేరు శనగ గుళ్ళు వేసి వేయించాలి.

పలుకులు వేగాక అందులో జీడిపప్పు, శనగపప్పు, మినప పప్పు, ఆవాలు ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించాలి. ఇవి వేగిన తర్వాత నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండు మిర్చి, కొద్దిగా ఇంగువ వేసి వేయించుకోవాలి. తర్వాత పసుపు, తగినంత ఉప్పు వేసుకుని వేయించాలి. ఇప్పుడు వేగుతున్న పోపులో ముందుగా మిక్సీ పట్టిన గోంగూర పేస్ట్ వేసుకోవాలి.

పోపు కమ్మటి వాసన వచ్చిన తర్వాత కొంచెం చింత పండు గుజ్జు వేసుకుని తక్కువ మంటపై ఉడికించాలి. పోపు, గోంగూర మిశ్రమం బాగా వేగిన తర్వాత  ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నంలో వేసి కలుపుకోవాలి. చివరిగా ఉప్పు చూసుకుని కొంచెం నెయ్యి వేయాలి.అంతే యమ్మీ యమ్మీ గోంగూర పులిహోర రెడీ.

గోంగూర పులిహోరలో పోషకాలు, ప్రయోజనాలు

గోంగూర పులిహోరలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా లభిస్తాయి, ఒక్కో సర్వింగ్‌కు దాదాపు 32.1 గ్రాములు కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి. కార్బోహైడ్రేట్లు శరీరం యొక్క ప్రధాన శక్తి వనరు. గోంగూర పులిహోరలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ప్రతి సర్వింగ్‌లో సుమారు 1.8 గ్రాములు ఫైబర్ ఉంటుంది. ఫైబర్ జీర్ణ ఆరోగ్యానికి ముఖ్యమైనది మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.

గోంగూర పులిహోర విటమిన్ సి, విటమిన్ ఎ మరియు ఫోలేట్‌తో సహా విటమిన్‌లకు మంచి మూలం. రోగనిరోధక శక్తీ పెంచటానికి విటమిన్ సి ముఖ్యం, దృష్టికి విటమిన్ ఎ ముఖ్యమైనది మరియు గర్భిణీ స్త్రీలకు ఫోలేట్ ముఖ్యమైనది. గోంగూర పులిహోర ఐరన్, కాల్షియం మరియు పొటాషియంతో సహా ఖనిజాలకు మంచి మూలం. రక్త ఆరోగ్యానికి ఐరన్ ముఖ్యమైనది, ఎముకల ఆరోగ్యానికి కాల్షియం మరియు గుండె ఆరోగ్యానికి పొటాషియం ముఖ్యమైనవి. గోంగూర ఆకులు యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం, ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే హాని నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది . ఫ్రీ రాడికల్స్ అస్థిర అణువులు, ఇవి కణాలను దెబ్బతీస్తాయి మరియు దీర్ఘకాలిక వ్యాధుల అభివృద్ధికి దోహదం చేస్తాయి.

Post Comment