అల్లం రసం తయారీ విధానం : ఆరోగ్య ప్రయోజనాలు, చిట్కాలు
భారతీయ వంటకాలు

అల్లం రసం తయారీ విధానం : ఆరోగ్య ప్రయోజనాలు, చిట్కాలు

అల్లం లేకుండా వంటగదిలో ఏ మెనూ కూడా సంపూర్ణం కాదని మనకి తెలుసు. ఎందుకంటే అల్లంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆర్టికల్ ద్వారా రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన అల్లం రసం తయారు చేయటానికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానాన్ని తెలుసుకుందాం.

అల్లం రసం తయారీకి కావలిసిన పదార్ధాలు

  • టమాటాలు - ఒకటి
  • పచ్చిమిర్చి - ఒకటి
  • అల్లం - ఒక అంగుళం
  • చింతపండు - కొద్దిగా
  • కొత్తిమీర - రెండు రెమ్మలు
  • రసం పొడి - ఒక టీ స్పూన్
  • పసుపు - 1/4 టీ స్పూన్
  • ఉప్పు - తగినంత
  • నీళ్లు - నాలుగు కప్పులు
  • కరివేపాకు - రెండు రెమ్మలు
  • ఎండుమిర్చి - ఒకటి
  • జీలకర్ర - 1/4 టీ స్పూన్
  • ఆవాలు - 1/4 టీ స్పూన్
  • ఇంగువ - చిటికెడు
  • నూనె - రెండు టేబుల్ స్పూన్స్
  • వెల్లుల్లి - నాలుగు రెబ్బలు

అల్లం రసం తయారీ విధానం

ముందుగా ఒక గిన్నెలో టమాటా, పచ్చి మిర్చి, అల్లం తురుము, కొత్తిమీర, రసం పొడి, పసుపు, పచ్చి మిర్చి, ఉప్పు మరియు చింతపండు వేసి చేతితో మెత్తగా చేసుకోవాలి, లేదంటే మిక్సీ పట్టి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ఆ మిశ్రమంలో నీళ్ళుపోసి, స్టవ్ ఆన్ చేసి లో-ఫ్లేమ్ లో ఓ ఇరవై నిముషాలపాటు మరిగించుకోవాలి.

తరవాత తాళింపు కోసం కళాయిలో నూనె వేసి, వేడయ్యాక కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఇంగువ మరియు దంచిన వెల్లుల్లిని వేసి వేయించుకోవాలి. తాళింపు వేగిన తరవాత మరిగించుకున్న రసంలో వేసి ఓ రెండు నిముషాలు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. అంతే వేడి వేడిగా అన్నం తో అల్లం రసం చాలా బాగుంటుంది.

అల్లం రసం తయారీకి కొన్ని చిట్కాలు

అల్లం రసం తయారీకి తాజాగ ఉన్న పచ్చి అల్లం తీసుకోవాలి. పాత అల్లం అంత రుచిగా ఉండదు. అల్లం రసంలో నీళ్లు ఎక్కువ పోయకండి, రసంలో నీళ్లు ఎక్కువ పోస్తే పల్చగా అవుతుంది. అల్లం రసం తక్కువ మంటపై మరగనివ్వాలి. ఎక్కువుగా మరిగిస్తే రుచి అంతగా రాదు. అల్లం రసంలో చిటికెడు ఇంగువ వేస్తే రసం రుచిని పెంచుతుంది. రసం పులుపు ఎక్కువగా కావాలనుకుంటే చివర్లో నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది. అల్లం కారంగా ఉంటుంది కాబట్టి స్పైసీ తగ్గించుకోవటం మంచిది.

అల్లం రసంలో పోషకాలు

అల్లం రసం యందు యాంటీఇన్ఫలమేటరీ, యాంటీబాక్టీరియా గుణాలు ఉన్నాయి. అల్లం రసం జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయటానికి సహాయపడుతుంది. ఇంగువలో జీర్ణక్రియను మెరుగుపర్చే గుణాలు ఉన్నాయి. అల్లం రసం త్రాగటం వాళ్ళ దగ్గు, జలుబు మరియు గొంతు నొప్పి వంటి సాధారణ అనారోగ్యాలను నివారిస్తుంది. శరీరంలో అధికంగా చేరే నీటిని తొలగిస్తుంది. పరగడుపునే అల్లం రసం తాగితే ఒంట్లో అధికంగా ఉన్న నీరు బయటికి వెళ్లిపోతుంది. అలసట, నీరసం తొలగిపోతాయి.

Post Comment