పుదీనా పచ్చడి రెసిపీ తయారీ విధానం : పుదీనా చట్నీ
భారతీయ వంటకాలు

పుదీనా పచ్చడి రెసిపీ తయారీ విధానం : పుదీనా చట్నీ

రోజూ పొద్దున్న బ్రేక్ ఫాస్ట్ తో ఒకే రకమైన పచ్చడి తిని విసుగుపుడుతోందా..! అయితే ఖచ్చితంగా ఈ రెసిపీ మీ కోసమే. అదిరిపోయే పుదీనా చట్నీ ఎలా తయారుచేయాలో ఈ ఆర్టికల్ యందు తెలుసుకోండి. అలాగే మీరు కూడా నేర్చుకొని ట్రై చేయండి.

పుదీనా పచ్చడికి కావాల్సిన పదార్ధాలు

  • పుదీనా ఆకులు - నాలుగు కప్పులు
  • చింతపండు - కొద్దిగా
  • టమాటా - ఒకటి
  • బెల్లం - కొద్దిగా
  • పసుపు - 1/4 టీ స్పూన్ఉ
  • ప్పు - రుచికి సరిపడా
  • పోపుదినుసులు:
  • శెనగపప్పు - ఒక స్పూన్
  • మినప్పప్పు - ఒక స్పూన్
  • ఆవాలు - 1/2 స్పూన్
  • ధనియాలు- 1/2 స్పూన్
  • మెంతులు - కొద్దిగా
  • ఎండుమిరపకాయలు - 8
  • ఇంగువ - కొద్దిగా
  • నూనె - ఆరు స్పూన్స్ (సరిపడా)
  • వెల్లుల్లి రెబ్బలు - ఆరు
  • కరివేపాకు - ఒక రెమ్మ

పుదీనా పచ్చడి తయారీ విధానం

ముందుగా పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. చింతపండును కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. తరవాత స్టవ్ వెలుగుంచుకుని పాన్ పెట్టి వేడెక్కాక ఎండుమిర్చి, శెనగపప్పు , మినపప్పు, ధనియాలు, మెంతులు, వేసి రెండు నిముషాలు లో- ఫ్లేమ్ లో వేపుకుని ఒక ప్లేటులోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక పుదీనా ఆకులు , పసుపు, చింతపండు, టమాటో ముక్కలు, బెల్లం కొద్దిగా వేసి బాగా మగ్గనివ్వాలి.

ఇలా మగ్గిన తరవాత పక్కన పెట్టి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా వేపుకున్న పోపు పప్పు మిశ్రమం, పుదీనా మిశ్రమం రెండూ కలిపి మెత్తగా రుబ్బుకోవాలి . ఇలా రుబ్బుకున్న తర్వాత పోపు కోసం ఒక పాత్రలో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ చిటికెడు వేసి తాళింపు చిటపటలాడాక రుబ్బుకున్న పుదీనా పచ్చడి పైన వేసుకొని కలుపుకోవాలి. ఘుమ ఘుమలాడే పుదీనా పచ్చడి రెడీ. దీనిని అన్నంలోకి, ఇడ్లి లోకి దోసెలలోను బాగుంటుంది.

పుదీనా పచ్చడిలో పోషక విలువలు

పుదీనా పచ్చడిలో విటమిన్ A పుష్కలంగా ఉంటుంది. కళ్ళు, చర్మం ఆరోగ్యాంగా ఉంచటంలో ఉపయోగపడతాయి.పుదీనాలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

పుదీనాలో పీచు పదార్ధాలు ఎక్కువుగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు మలబద్దకాన్ని నివారిస్తుంది. పుదీనా పచ్చడిలో ఇంకా పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఇనుము, పాస్పరస్ వంటి ఇతర పోషకాలు కూడా సంవృద్ధిగా లభిస్తున్నాయి.

Post Comment