చింతపండు పులిహోర తయారు చేసే విధానం : పోషకాలు
భారతీయ వంటకాలు

చింతపండు పులిహోర తయారు చేసే విధానం : పోషకాలు

రోజూ ఒకే రకమైన వంట తిని విసుగుపుడుతోందా..! అయితే ఖచ్చితంగా ఈ రెసిపీ మీ కోసమే. చాలా తక్కువ సమయంలో అదిరిపోయే చింతపండు పులిహోర ఎలా తయారుచేయాలి, ఎలా కలుపుకోవాలి, తయారీకి కావాల్సిన పదార్ధాలు ఏమిటో ఈ ఆర్టికల్ యందు తెలుసుకుందాం.

పులిహోర తయారీకి కావాల్సిన పదార్ధాలు

  • రైస్ - నాలుగు కప్పులు
  • చింతపండు - పిడికెడు
  • ఎండు మిర్చి - మూడు
  • పచ్చి మిర్చి - మూడు
  • ఆవాలు -  స్పూన్
  • మినపప్పు - రెండు స్పూన్స్
  • శెనగపప్పు - రెండు స్పూన్స్
  • పల్లీలు - పిడికెడు
  • కరివేపాకు - రెండు రెమ్మలు
  • నూనె - రెండు టేబుల్ సూన్స్
  • నెయ్యి - రెండు టేబుల్ స్పూన్స్
  • ఉప్పు  - సరిపడా

పులిహోర తయారు చేయు విధానం

ముందుగా రైస్ శుభ్రంగా కడిగి ఇరవై నిమిషాలపాటు నానబెట్టుకోవాలి. చింతపండుని ఓ కప్పులో తీసుకుని గోరువెచ్చని నీళ్లలో నానబెట్టి గుజ్జులా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాత్రలో రైస్ వేసి పలుకుగా ఉడికించుకోవాలి, రైస్ ఉడుకుతుండగా అందులో కొద్దిగా నెయ్యి, పసుపు వేసుకోవాలి.

అన్నం వండుకున్నాక చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం పాన్‌లో నూనె, నెయ్యి వేసి, నూనె వేడయ్యాక ఆవాలు, ఎండుమిర్చి, మినపప్పు, శెనగపప్పు, పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు , కొద్దిగా ఇంగువ వేసి తాళింపు వేయించాలి.

తాళింపు వేగుతుండగా, మరోపక్క కళాయిలో చింతపండు గుజ్జును, రుచికి సరిపడా ఉప్పు వేసి, చింతపండు గుజ్జు దగ్గరగా మందంగా అయ్యేంతవరకు మరిగించాలి. ఇలా తయారు చేసుకున్న చింతపండు గుజ్జు, తాళింపు మిశ్రమం కలిపి, ముందుగా వండుకున్న అన్నంలో వేసి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి.

పులిహోర తయారీకి కొన్ని చిట్కాలు

పులిహోర కోసం సన్న బియ్యాన్ని తీసుకోండి, అన్నం ముద్దలా కాకుండా, కొంచెం పలుకుగా ఉడికించాలి. అన్నం ఉడికించేటపుడు పసుపు వేసుకంటే, పసుపు మొత్తం ఒకేలా పడుతుంది.

చింత పండుని వేడి నీళ్లలో నానబెడితే రసం ఈజీగా వస్తుంది. పులిహోర రుచికి చింతపండు ప్రధమం కాబట్టి తగినంతగా వేసుకోవాలి. పులిహోర మంచి రుచిగా రావాలంటే పోపు సరిగ్గా వేయించాలి. ఇంగువ నెయ్యిలో వేయించి కలుపుకుంటే పులిహోర మంచి రుచిని కలిగి ఉంటుంది.

పులిహోరలో లభించే పోషకాలు

పులిహోరలో ప్రధాన పోషకం కార్బోహైడ్రేట్లు. కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తిని అందిస్తాయి. పులిహోరలో ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి, ప్రొటీన్లు శరీర నిర్మాణం మరియు పనితీరుకు ఉపయోగపడతాయి. పులిహోరలో విటమిన్లు మరియు ఖనిజాలు సంవృద్ధిగా లభిస్తాయి. బియ్యం కొన్ని విటమిన్లు మరియు ఖనిజాలను కూడా అందిస్తుంది, వీటిలో ఫైబర్, థయామిన్, నియాసిన్, ఫోలెట్, మరియు పొటాషియం వంటి పోషకాలు లభిస్తాయి.

పులిహోరలో కొవ్వులు కూడా ఉంటాయి. కొవ్వులు శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి మరియు కొన్ని విటమిన్లను కరిగించడంలో సహాయపడతాయి. పులిహోరలో ఉపయోగించే ఇతర మసాలాలు, వీటిలో మిరియాలు, జీలకర్ర, మరియు ధనియాలు ఉన్నాయి, అవి కూడా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి.

Post Comment