కొబ్బరి అన్నం తయారు చేయు విధానం : స్పైసీ కోకోనట్ రైస్
భారతీయ వంటకాలు

కొబ్బరి అన్నం తయారు చేయు విధానం : స్పైసీ కోకోనట్ రైస్

మంచి రుచికరమైన రెసిపీ తయారుచేసి పెడితే పిల్లలు నుంచి పెద్దల వరకూ అందరూ ఇష్టంగా తింటారు. ఈ ఆర్టికల్ ద్వారా అధిక పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలున్న కోకోనట్ రైస్ ను ఎలా తయారు చేయాలి, కావాల్సిన పదార్ధాలు ఏమిటో తెలుసుకుందాం.

కొబ్బరి అన్నం తయారీకి కావాల్సిన పదార్ధాలు

  • రైస్ - నాలుగు కప్పులు
  • కొబ్బరికోరు - ఒకటిన్నర కప్పు
  • ఎండుమిర్చి - నాలుగు
  • పచ్చి మిర్చి - నాలుగు
  • జీడిపప్పు - తగినన్ని
  • ఆవాలు - 1/2 స్పూన్
  • జీలకర్ర - ఒక స్పూన్
  • శెనగపప్పు - ఒక స్పూన్
  • మినపప్పు - ఒక స్పూన్
  • పల్లీలు - రెండు టేబుల్ స్పూన్
  • ఉప్పు - సరిపడా
  • నూనె - రెండు టేబుల్ స్పూన్స్
  • నెయ్యి - రెండు టేబుల్ స్పూన్స్
  • కరివేపాకు - రెండు రెమ్మలు
  • కొత్తిమీర - రెండు రెమ్మలు

కొబ్బరి అన్నం తయారు చేయు విధానం

ముందుగా రైస్ శుభ్రంగా కడిగి ఇరవై నిమిషాలపాటు నానబెట్టుకోవాలి. అలాగే కొబ్బరిని తురుముకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత రైస్ ఉడికించి పక్కనబెట్టి చల్లార్చుకోవాలి,  ఇప్పుడు పాన్ తీసుకుని నూనె, నెయ్యి వేసి, వేడయ్యాక అందులో జీడిపప్పు వేసి లేత గోధుమరంగు వచ్చేలా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు అదే పాన్‌లో ఆవాలు, జీలకర్ర, పల్లీలు, శెనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, పచ్చి మిర్చి, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా వేయించాలి. పోపు వేగిన తరవాత అందులో ముందుగా తురుముకున్న కొబ్బరి వేసి, తగినంత ఉప్పు కూడా వేసి లో- ఫ్లేమ్ లో ఐదు నిమిషాలపాటు వేగనివ్వాలి.

ఐదునిమిషాలు తరవాత ఈ పోపు మిశ్రమంలో ముందుగా ఉడికించుకున్న రైస్ వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర, వేయించిన జీడిపప్పు వేసి అలంకరించుకుంటే సరిపోతుంది. యమ్మీ యమ్మీ కోకోనట్ రైస్ రెడీ అయినట్లే.

కొబ్బరి అన్నం తయారీకి కొన్ని చిట్కాలు

కొబ్బరి అన్నం కోసం బాస్మతి రైస్ తీసుకోండి. రైస్ ఉడికించేటపుడు అందులో కొద్దిగా నూనె వేస్తే అన్నం విడివిడిగా ఉడుకుతుంది. కొబ్బరి మరీ లేత, మరీ ముదరగా కాకుండా తీసుకోండి. ముదరిది తీసుకుంటే కొబ్బరి నూనె వాసన  వస్తుంది. కొబ్బరిని ఎక్కువుగా వేయించకండి. కొబ్బరి అన్నం మరింత టేస్టు కావాలనుకుంటే అందులో కాప్సికమ్, క్యారెట్ లాంటివి చేర్చుకోవచ్చు.

కొబ్బరి అన్నంలో పోషకాలు

కొబ్బరిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి మరియు మెరుగైన బ్లడ్ షుగర్ నియంత్రణకు తోడ్పడతాయి . అయినప్పటికీ, కొబ్బరిలో కొవ్వు మరియు కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి, కాబట్టి మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నప్పుడు లేదా తక్కువ కొవ్వు ఆహారాన్ని అనుసరించాల్సిన అవసరం ఉన్నట్లయితే ఇది తక్కువుగా తీసుకోవటం మంచిది.

కొబ్బరి అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి, ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. కొబ్బరి అన్నంలో ప్రొటీన్లు సంవృద్ధిగా ఉంటాయి, ఇవి కండరాల పెరుగుదల మరియు పునఃప్రారంభానికి సహాయపడతాయి. కొబ్బరి అన్నంలో కొవ్వులు కూడా ఉంటాయి, ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి మరియు హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడతాయి.

కొబ్బరి అన్నంలో విటమిన్లు A, C మరియు E పుష్కలంగా ఉంటాయి. ఈ విటమిన్లు శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి మరియు కణాలను దెబ్బతినకుండా రక్షించడానికి సహాయపడతాయి. కొబ్బరి అన్నంలో కాల్షియం, ఇనుము మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ ఖనిజాలు ఎములు, రక్తం మరియు కండరాల ఆరోగ్యానికి అవసరం.

Post Comment