ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ తయారు చేసే విధానం : రెస్టారెంట్ స్టైల్
భారతీయ వంటకాలు

ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ తయారు చేసే విధానం : రెస్టారెంట్ స్టైల్

మంచి రుచికరమైన రెసిపీ తయారుచేసి పెడితే పిల్లలు నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఈ ఆర్టికల్ ద్వారా అధిక పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలున్న ఎగ్ ఫ్రైడ్ రైస్ ను వెజిటబుల్స్ కాంబినేషన్లో ఎలా తయారు చేయాలి, కావాల్సిన పదార్ధాలు ఏమిటో తెలుసుకుందాం.

ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్ధాలు

  • రైస్ - ఒక గ్లాస్
  • క్యారెట్ - ఒకటి
  • బీన్స్ - ఒక పది
  • క్యాప్సికమ్ - ఒకటి
  • ఎగ్స్ - మూడు
  • ఉల్లిపాయ - ఒకటి
  • కొత్తిమీర - రెండు రెమ్మలు
  • ధనియాల పొడి - ఒక స్పూన్
  • గరంమసాలా - 1/2 టీ స్పూన్
  • పెప్పర్ పొడి - 1/2 టీ స్పూన్
  • బ్లాక్ సాల్ట్ - చిటికెడు
  • సొయా సాస్ - ఒక టీ స్పూన్
  • పచ్చి మిర్చి - రెండు
  • అల్లవెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్
  • ఉప్పు - సరిపడా
  • నూనె - నాలుగు టేబుల్ స్పూన్స్
  • కారం - సరిపడా
  • వెనిగర్ - 1/4 టీ స్పూన్ ( ఆప్సనల్ )
  • నిమ్మకాయ - ఒకటి

ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం

ముందుగా రైస్ ను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్ళు పోసి అన్నం పలుకుగా ఉండేలా వండుకోవాలి. బియ్యంలో ఒక టీ స్పూన్ నూనె వేస్తే రైస్ అంటుకోకుండా విడివిడిగా ఉడుకుతుంది. అన్నం ఉడికాక చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి,నూనె కాగాక కోడిగుడ్లను పగలకొట్టి వేసి ఫ్రై చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.

తరువాత అదే కళాయిలో నూనె వేసుకుని, కాగాక ఉల్లిపాయ ముక్కలను వేసి మూడు నిమిషాల పాటూ మీడియం ఫ్లేమ్ లో వేయించాలి. ఇప్పుడు అందులో క్యాప్సికం, పచ్చి మిర్చి, క్యారెట్, బీన్స్ వేసి వేయించుకోవాలి. రెండునిమిషాల తరవాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయేవరకు వేగనివ్వాలి.

ఇవి పూర్తిగా వేగిన తరువాత ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్ల మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, కారం,గరం మసాల, మిరియాల పొడి, ధనియాల పొడి వేసి, బ్లాక్ సాల్ట్, వేసుకుని మొత్తం అన్నీ కలిసేలా బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి ముందుగా ఉడికించుకున్న రైస్, సోయా సాస్, వెనిగర్ వేసి 3 నుంచి 4 నిమిషాల పాటు పెద్ద మంటపై నెమ్మదిగా కలుపుతూ వేయించాలి.

4 నిమిషాల తరువాత స్టవ్ ఆప్ చేసుకోవాలి, చివరిగా కొత్తిమీర పైన చల్లి వేడివేడిగా సర్వ్ చేయటమే. అంతే చాలా సింపుల్ గా ఎంతో రుచిగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే రెడీ. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చెయ్యండి.

ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీకి కొన్ని చిట్కాలు

రైస్ ఉడికించేటపుడు టీ స్పూన్ నూనె వేసుకుంటే అన్నం ముద్దలా కాకుండా విడివిడిగా ఉడుకుతుంది. ఫ్రైడ్ రైస్ కోసం అన్నం వేడిగా ఉన్నప్పుడు కాకుండా చల్లారాక కలుపుకోండి. ఎగ్స్ వేయించేటపుడు ముద్దలా కాకుండా, పెద్ద పెద్ద ముక్కలుగా ఫ్రై చేసుకోవాలి.

ఉల్లి, క్యారెట్, క్యాప్సికం, బీన్స్ లేదా ఇతర కూరగాయలను సన్నగా మరియు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. లేదంటే సరిగ్గా వేగవు. వెనిగర్,సోయాసాస్, పెప్పర్, బ్లాక్ సాల్ట్ తక్కువ మోతాదులో వేసుకుంటే రుచికరంగా ఉంటుంది.

ఎగ్ ఫ్రైడ్ రైస్ లో పోషక విలువలు

రైస్ లో అధికంగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. ఎగ్స్, కూరగాయలలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి కణాల పెరుగుదలకు మరియు మరమ్మతుకు సహాయపడతాయి. దీనిలో లభించే ఫైబర్ జీర్ణక్రియను మెరుగు పరచటానికి మరియు రక్తప్రసరణను పెంచటానికి సహాయపడతాయి.

ఎగ్స్, కూరగాయలలో విటమిన్ A, C, B, మరియు విటమిన్ E సంవృద్ధిగా లభిస్తాయి, విటమిన్స్ రోగనిరోధక శక్తిని పెంచటంలో, చర్మ ఆరోగ్యం మెరుగుపరచటానికి, మరియు దృష్టిని మెరుగుపర్చటానికీ సహాయపడతాయి.  ఎగ్ ఫ్రైడ్ రైస్ లో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, పాస్పరస్ వంటి ఖనిజ పోషకపదర్ధాలు కూడా లభిస్తాయి. ఈ ఖనిజాలు రక్త పోటును నియంత్రించటానికి, ఎముకుల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.

Post Comment