పన్నీర్ ఎగ్ మసాలా కర్రీ తయారీ విధానం : చిట్కాలు, పోషకాలు
భారతీయ వంటకాలు

పన్నీర్ ఎగ్ మసాలా కర్రీ తయారీ విధానం : చిట్కాలు, పోషకాలు

ఎగ్స్‌ను

ఎగ్స్‌ను ఫ్రై చేసుకోవచ్చు, ఆమ్లెట్ వేసుకోవచ్చు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ కోసం బాయిల్డ్ ఎగ్ టోస్ట్ చేసుకోవచ్చు, అలాగే మధ్యాహ్నం లంచ్ కోసం కర్రీ వండుకోవచ్చు, సాయంత్రం రాగానే భుర్జీ చేసేసుకొని తినొచ్చు. ఇలా అన్ని వేళలా అందరికీ అందుబాటులో ఉండే ఉత్తమమైన ప్రోటీన్ ఆహారం ఎగ్. ఇన్ని ఆరోగ్యప్రయోజనాలున్న  ఎగ్స్‌ను, పన్నీర్ కాంబినేషన్లో వండే పన్నీర్ ఎగ్ కర్రీ రెసిపీ గూర్చి ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

పన్నీర్ ఎగ్ మసాలా కర్రీకి కావాల్సిన పదార్ధాలు

  • గుడ్లు - 4
  • నూనె - 4 టేబుల్ స్పూన్స్
  • ఉల్లిపాయ - ఒకటి
  • గరంమసాలా - 1/2 టీ స్పూన్
  • ధనియాలపొడి - 1/2 టీ స్పూన్
  • పచ్చి మిర్చి - నాలుగు
  • పసుపు - 1/2 టీ స్పూన్
  • అల్లం - చిన్న ముక్క
  • వెల్లుల్లి - నాలుగు రెబ్బలు
  • ఉప్పు - తగినంత
  • టమాటో - మూడు
  • పన్నీర్ - పావుకిలో
  • కొత్తిమీర తురుము - రెండు స్పూన్స్
  • కారం - సరిపడా
  • పెరుగు - రెండు టీ  స్పూన్స్
  • జీలకర్ర - 1/2 టీ  స్పూన్
  • ఆవాలు - 1/2 టి స్పూన్

పన్నీర్ ఎగ్ మసాలా కర్రీ తయారీ విధానం

ముందుగా కోడిగుడ్లను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ ను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టౌ ఆన్ చేసి కళాయిలో నూనె వేసి, నూనె వేడయ్యాక పన్నీర్ ముక్కలను లలేత గోధుమరంగులోకి మారేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.

తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, అల్లం, పచ్చి మిర్చి అన్ని కలిపి మిక్సీలో మెత్తగా పేస్టులాగా రుబ్బుకోవాలి. అదేవిధంగా టమోటాలను కూడా పేస్టులాగా చేసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు కళాయిలో నూనె వేసి, వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర కరివేపాకు వేసి చిటపటలాడేవరకూ వేయించాలి. అనంతరం అందులో ముందుగా రుబ్బుకున్న ఉల్లి మసాలా పేస్టును వేసి గోధుమ రంగులోకి మారేవరకు లో-ఫ్లేమ్ లో వేయించుకోవాలి.

తర్వాత దాంట్లో రుచికి సరిపడా ఉప్పు, పసుపు, ధనియాల పొడి, పెరుగు, గరంమసాలా వేసి ఓ రెండు నిమిషాల పాటూ వేయించాలి. ఇప్పుడు టమాటా గుజ్జు కూడా వేసి నూనె తేలేవరకూ వేయించాలి. తర్వాత అందులో పన్నీర్ ముక్కలు, ఉడికించిన కోడిగుడ్లు వేసి కలపాలి. కలిపిన తర్వాత ఓ రెండుకప్పులు నీళ్లు పోసి ఓ పది నిమిషాలపాటు మూత పెట్టి తక్కువ మంటపై ఉడికించుకోవాలి. చివరిగా దించేముందు కొత్తిమీర తురుము చల్లుకుంటే సరిపోతుంది.

పన్నీర్ ఎగ్ మసాలా కర్రీ తయారీకి కొన్ని చిట్కాలు

పన్నీర్ ను ముందుగా నెయ్యిలో లేదా నూనె లో దోరగా వేయించి తీసుకోవడం వలన రెసిపికి మరింత రుచి చేకూరుతుంది. కోడిగుడ్లు ఉడకబెట్టేటపుడు అందులో కొద్దిగా గడ్డ ఉప్పు వేస్తె కోడిగుడ్లు మిగలకుండా ఉడుకుతాయి. కోడిగుడ్లు ఉడకబెట్టిన తరువాత పైన చిన్న చిన్న గాట్లు పెట్టి వండితే. మసాలా పూర్తిగా పడుతుంది.

కోడిగుడ్లును ఎక్కువ సేపు ఉడకబెట్టకూడదు, అలా ఎక్కువ సేపు ఉడకబెడితే గుడ్లు గట్టిబడతాయి. ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, టమాటోలను పేస్టులా చేసి  వేసుకుంటే గ్రేవీ మంచి రుచికరంగా వస్తుంది.

పన్నీర్ ఎగ్ మసాలా కర్రీ పోషక విలువలు

పన్నర్‌లో కాల్షియం, ప్రోటీన్ మరియు పాస్పరస్ వంటి పోషకాలు సంవృద్ధిగా లభిస్తాయి. కోడిగుడ్లలో ప్రొటీన్, విటమిన్ B13, విటమిన్ A మరియు లూటీన్లు  పుష్కలంగా ఉంటాయి.

ఇవి కండరాల పెరుగుదలకు, నాడీ వ్యవస్థ ఆరోగ్యానికి, కంటి చూపు, చర్మ ఆరోగ్యానికి మరియు రోగనిరోధక శక్తికి చాలా ముఖ్యమైనది. ఎగ్ పన్నీర్ కర్రీలో ఉపయోగించే మసాలాలు యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి.

మరి తయారీ విధానం తెలుసుకొని మీరు ప్రయత్నించండి. ఇది వేడి వేడిగా అన్నం, రొట్టి, పరోటా, చపాతీలతో చాలా బాగుంటుంది.

Post Comment