ప్రాన్స్ బిర్యానీ రెసిపీ తయారీ విధానం : రొయ్యల బిర్యానీ
భారతీయ వంటకాలు

ప్రాన్స్ బిర్యానీ రెసిపీ తయారీ విధానం : రొయ్యల బిర్యానీ

మీరు కూడా బిర్యానీ లవర్ అయితే, ఈ సండే మీ దినచర్యను ఈ రొయ్యల బిర్యానీతో స్టార్ట్ చేసేయండి. ఆలస్యం చేయకుండా ఈ ఆర్టికల్ ద్వారా చక్కని రొయ్యల బిర్యానీ ఎలా చేయాలో, దానికి ఏమేమి కావాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎంచక్కా మీరు నేర్చుకుని, ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వండి.

రొయ్యల బిర్యానీ తయారీకి కావలసిన పదార్దాలు

  • రొయ్యలు - అరకేజీ
  • బాస్మతి బియ్యం- మూడు కప్పులు
  • పెరుగు- రెండు టేబుల్ స్పూన్స్
  • కారంపొడి- ఒక టీ స్పూన్
  • పసుపు - అర టీ స్పూన్
  • ధనియాలపొడి - అర టీ స్పూన్
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్
  • ఉప్పు- రుచికి సరపడినంత
  • గరంమసాలా - ఒక టీ స్పూన్
  • ఉల్లిపాయలు - రెండు
  • టమాటో - ఒకటి
  • జీడిపప్పు – కొద్దిగా
  • కొత్తిమీర పుదీనా - నాలుగు రెమ్మలు
  • బిర్యానీ ఆకులు - రెండు
  • యాలకులు - రెండు
  • దాల్చిన చెక్క - చిన్న ముక్క
  • లవంగాలు - రెండు
  • జీరా - అర టీ స్పూన్
  • నెయ్యి - రెండు టేబుల్ స్పూన్స్
  • నూనె - రెండు టేబుల్ స్పూన్స్

రొయ్యల బిర్యానీ తయారీ విధానం

ముందుగా రొయ్యలను శుభ్రంచేసుకోవాలి. బియ్యం ఉడికించటానికి ముందు అరగంట పాటు నానబెట్టుకోవాలి, ఉల్లిపాయ ముక్కలను బ్రౌన్ కలర్ లో వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. జీడీ పప్పును దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో రొయ్యలు వేసి వాటిలో నిమ్మరసం, అల్లంవెల్లుల్లి పేస్ట్, గరంమసాలా, వేగించిన ఉల్లి ముక్కలు, పెరుగు, కొత్తిమీర, పుదీనా తరుగు, ధనియాల పొడి, నూనె వేసి, రొయ్యలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని గంట పాటు అలాగే ఉంచాలి..

ఇప్పుడు ఒక గిన్నెలో అన్నం ఉడికించటానికి సరిపడా నీళ్లు పోసి, అందులో గరం మసాలా, బిర్యానీ ఆకులు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేయాలి. నీళ్లు మరిగాక ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని అందులో వేయాలి. బియ్యం సగం ఉడికాక నీళ్లు వంపేయాలి. తర్వాత అడుగు దళసరిగా ఉన్న ఒక గిన్నె తీసుకుని లోపల నెయ్యి పూయాలి. ఇప్పుడు అందులో ముందుగా మెరినేట్ చేసుకున్న రొయ్యల్ని ఒక పొరలా వేయాలి. వాటిపైన సగం ఉడికించిన బిర్యానీ రైస్‌ను, వేగించిన ఉల్లి ముక్కలను ఒక పొరలా వేసుకోవాలి.

పైన కొంచెం నెయ్యి కూడా వేయాలి. ఇలా లేయర్స్‌గా ఒకదాని తరవాత ఒకటి వేసి, పైన ఒక బరువైన మూత పెట్టి, ఆ గిన్నెను స్టౌపై ఉంచి తక్కువ మంటపై పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి. పదిహేను నిమిషాల తరవాత మూత తీసి కొత్తిమీర, పుదీనాల తరుగు, జీడిపప్పు, వేగించిన ఉల్లిపాయ ముక్కలతో అలంకరించాలి. అంతే రుచికరమైన నోరూరించే రొయ్యల ధమ్ బిర్యాని రెడీ. ఈ రొయ్యల బిర్యానిని ఏమీ కలుపుకోకుండా అలానే తిన్నా రుచిగా ఉంటుంది. పెరుగు చట్నీ తో తిన్నా బాగుంటుంది.

రొయ్యల బిర్యానీలో లభించే పోషకాలు

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌లో పుష్కలంగా ఉన్న రొయ్యలు గుండె ఆరోగ్యానికి మరియు మీ శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో గొప్పగా పనిచేస్తాయి. రొయ్యల బిర్యానీ విటమిన్ B5, ఫాస్పరస్, మాంగనీస్, విటమిన్ E సంవృద్ధిగా లభిస్తాయి మరియు ప్రోటీన్, విటమిన్ B6, కాపర్, సెలీనియం, బీటా కెరోటిన్ మరియు లుటీన్ యొక్క అద్భుతమైన మూలం. ఇది కండరాలను బలోపేతం చేయడానికి మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

రొయ్యలు B12 మరియు ఫోలేట్‌తో సహా B సమూహ విటమిన్‌లకు ఉపయోగకరమైన మూలం . ఈ విటమిన్లు శక్తి ఉత్పత్తిలో మరియు ఎర్ర రక్త కణాలను తిరిగి నింపడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

దుష్ప్రభావాలు:- రొయ్యలను తినడం వల్ల షెల్ఫిష్ అలెర్జీ ఉన్నవారిలో అలెర్జీ ప్రతిచర్యను ప్రేరేపించవచ్చు . సంకేతాలలో దద్దుర్లు, దురద, వాపు, వికారం లేదా అనాఫిలాక్సిస్ ఉన్నాయి. మీకు తెలిసిన షెల్ఫిష్ అలెర్జీ ఉన్నట్లయితే రొయ్యలను నివారించండి. రొయ్యలు రొయ్యల మాదిరిగానే షెల్ఫిష్, మరియు మితంగా ఉంటే అవి ఖచ్చితంగా ఆరోగ్యకరమైన ఆహారంలో భాగం కావచ్చు.

Post Comment