స్ట్రీట్ స్టైల్ టేస్టీ చికెన్ పెప్పర్ ఫ్రై రెసిపీ తయారీ విధానం
భారతీయ వంటకాలు

స్ట్రీట్ స్టైల్ టేస్టీ చికెన్ పెప్పర్ ఫ్రై రెసిపీ తయారీ విధానం

ఈ ఆర్టికల్ యందు నాన్ వెజ్ ప్రియులకి ఎంతో ఇష్టమైన చికెన్ పెప్పర్ ఫ్రై రెసిపీని, ఎంచక్కా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి, తయారీకి కావాల్సిన పదార్దాలు ఏమిటో తెలుసుకుందాం.

చికెన్ పెప్పర్ ఫ్రై కి కావాల్సిన పదార్దాలు

  • చికెన్ - పావుకిలో
  • మిరియాల పొడి - రెండు స్పూన్
  • ఉప్పు - తగినంత
  • కారం - ఒక స్పూన్
  • పసుపు - పావు స్పూన్
  • నూనె - వేయించటానికి సరిపడా
  • కొత్తి మీర - రెండు రెమ్మలు
  • కరివేపాకు - రెండు రెమ్మలు
  • లవంగాలు - రెండు
  • యాలకులు - రెండు
  • దాల్చిన చెక్క -  చిన్న ముక్క
  • జీల కర్ర - ఒక స్పూన్
  • అల్లం - ఒక చిన్న ముక్క
  • వెల్లుల్లి - ఆరు రెబ్బలు

చికెన్ పెప్పర్ ఫ్రై తయారీ విధానం

ముందుగా చికెన్‌ను గంట పాటు మెరినేట్ చేసుకోవాలి. ఇందుకోసం ముందు చికెన్‌ను తగిన సైజులో ముక్కలుగా కట్ చేసి శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పాత్ర తీసుకుని అందులో చికెన్ ముక్కలు వేసి, సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, తగినంత కారం, కొంచెం నూనె, మిరియాల పొడి వేసి బాగా కలుపుకుని మెరినేట్ చేసుకోవాలి. దీన్ని ఓ గంట పాటు ఫ్రిజ్ లో ఉంచితే మసాలా బాగా పట్టి టేస్ట్ బావుంటుంది.

చికెన్ మెరినేట్ అయ్యాక.. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ తీసుకుని అందులో వేయించటానికి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసు కోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక చికెన్ ముక్కలు వేసి వేయించుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.. ఆ తర్వాత మరో కళాయిలో తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి, వేడయ్యాక తరిగిన అల్లం, వెల్లుల్లి తరుగు, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. అంతే చివరిగా చికెన్ దించే ముందు మిరియాల పొడి, కొత్తి మీర కూడా వేసి బాగా కలుపుకుని, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ చికెన్ పెప్పర్ ఫ్రై రెడీ అయినట్లే.

చికెన్ పెప్పర్ ఫ్రై లో పోషకాలు, ప్రయోజనాలు

చికెన్ పెప్పర్ ఫ్రై సాధారణంగా అధిక కేలరీల వంటకం. ఒక సర్వింగ్ సుమారు 480 కేలరీలు కలిగి ఉంటుంది, ఇందులో ముఖ్యమైన భాగం కొవ్వు నుండి వస్తుంది. చికెన్ లో ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది, ప్రోటీన్ కణజాలాలను నిర్మించడానికి మరియు మరమ్మత్తు చేయడానికి అవసరం. చికెన్ పెప్పర్ ఫ్రై యొక్క సర్వింగ్ 30 గ్రాముల ప్రోటీన్‌ను అందిస్తుంది. చికెన్ పెప్పర్ ఫ్రై విటమిన్ ఎ, విటమిన్ బి12, విటమిన్ డి, విటమిన్ కె మరియు నియాసిన్ వంటి అనేక విటమిన్లకు మంచి మూలం . చికెన్ పెప్పర్ ఫ్రై ఐరన్, జింక్, సెలీనియం, ఫాస్పరస్ మరియు పొటాషియం వంటి అనేక ఖనిజాలకు మంచి మూలం.

చికెన్ పెప్పర్ ఫ్రైలో కొవ్వు అధికంగా ఉంటుంది, ముఖ్యంగా సంతృప్త మరియు మోనోశాచురేటెడ్ కొవ్వులు. ఒక సర్వింగ్‌లో 19 గ్రాముల కొవ్వు ఉంటుంది. చికెన్ పెప్పర్ ఫ్రైలో సాధారణంగా కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి, డిష్‌లో ఉపయోగించే కూరగాయలు మరియు సుగంధ ద్రవ్యాల నుండి చాలా పిండి పదార్థాలు వస్తాయి. ఒక సర్వింగ్‌లో దాదాపు 10 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి.

నల్ల మిరియాలు యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. వెల్లుల్లి విటమిన్ సి మరియు బి6, అలాగే మాంగనీస్ యొక్క మంచి మూలం . ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీబయాటిక్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. అల్లం విటమిన్ సి, బి6 మరియు పొటాషియం యొక్క మంచి మూలం . ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు జీర్ణక్రియ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది.

Post Comment