బెండకాయ గ్రేవీ కర్రీ తయారీ విధానం : బెండకాయ కూర రెసిపీ, పోషకాలు
భారతీయ వంటకాలు

బెండకాయ గ్రేవీ కర్రీ తయారీ విధానం : బెండకాయ కూర రెసిపీ, పోషకాలు

బెండకాయలతో చేసే వంటకాలలో బెండకాయ ఫ్రై, బెండకాయ కర్రీ, బెండకాయ ఇగురు కూర, బెండకాయ పులుసు మొదలైన రెసిపీలు మనకు తెలిసిందే. ఈ ఆర్టికల్ యందు టేస్టీ టేస్టీగా ఆంధ్ర స్పెషల్ బెండకాయ ఇగురు కూర రెసిపీ తయారీ విధానం, కావాల్సిన పదర్ధాలు గూర్చి తెలుసుకుందాం. మీరు నేర్చుకుని ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది.

బెండకాయ కూర తయారీకి కావాల్సిన పదార్ధాలు

  • బెండకాయలు - పావుకిలో
  • పెరుగు - రెండు టేబుల్ స్పూన్స్
  • ఉల్లిపాయలు - రెండు
  • టమాటాలు - రెండు
  • పచ్చి మిర్చి - రెండు
  • జీలకర్ర- అర టీస్పూన్
  • ఆవాలు - అర టీస్పూన్
  • కొత్తిమీర -కొద్దిగా
  • కరివేపాకు కొద్దిగా
  • పసుపు - అర టీ స్పూన్
  • ఉప్పు - తగినంత
  • ధనియాల పొడి - అర టీస్పూను
  • జీలకర్ర పొడి- అర టీస్పూను
  • గరం మసాలా - టీస్పూన్
  • కారం - ఒక టీ స్పూన్
  • నూనె -రెండు టేబుల్ స్పూన్లు.
  • నెయ్యి - ఒక టీ స్పూన్
  • నీళ్లు - ఒక కప్పు

బెండకాయ కూర తయారీ విధానం

ముందుగా బెండకాయల్ని శుభ్రంగా కడిగి తడిపోయేంత వరకు ఆరనివ్వాలి లేదా పొడి గుడ్డతో తుడుచుకోవాలి. బెండకాయలు పొడిబారక మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అడుగు మందగా ఉన్న పాన్ తీసుకుని నూనె, నెయ్యి వేసుకుని వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసి ఒక నిమిషం పాటూ వేయించాలి.

ఇప్పుడు సన్నగా తరుగుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని రంగు మారేంత వరకు వేగనివ్వాలి. తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసుకొని మెల్లగా కలుపుతూ ఉండాలి. బెండకాయలు మెత్తపడి ఉడికిపోయాక, అందులో టమాటో గుజ్జు, పసుపు వేసి మరో రెండు నిముషాలు ఉడికించాలి. ఇప్పుడు చిన్న గిన్నెలో పెరుగు తీసుకుని, సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా కలిపి పెట్టుకోవాలి.

ఇప్పుడు ఈ పెరుగు మిశ్రమాన్ని వేగుతున్న బెండకాయల్లో వేసుకోవాలి. పెరుగు మిశ్రమం వేసుకోగానే కలుపుతూ ఉండాలి. కాసేపటికి నూనె పైకి తేలుతుంది. ఇప్పుడు గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి, కొత్తిమీర కూడా వేసుకుని కూర బాగా కలుపుకుని మూత పెట్టుకోవాలి. మూతపెట్టాక ఐదు నిమిషాలు ఉడకనిచ్చి దింపేస్తే చాలు. బెండకాయ గ్రేవీ కర్రీ రెడీ అయినట్లే. వేడివేడిగా అన్నంతో సర్వ్ చేసుకోవటమే.

బెండకాయ కూరలో లభించే పోషకాలు

బెండకాయలో మెగ్నీషియం, ఫోలేట్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్లు సి, కె1 మరియు ఎ పుష్కలంగా ఉన్నాయి . ఇది ఆరోగ్యకరమైన గర్భం, గుండె ఆరోగ్యం, రక్తంలో చక్కెరను అందించడంలో సహాయపడవచ్చు. ఇది క్యాన్సర్ నిరోధక లక్షణాలను కూడా కలిగి ఉండవచ్చు.

బెండకాయలలో విటమిన్ సి యొక్క మంచి మూలం, ఇది రోగనిరోధక పనితీరు మరియు కొల్లాజెన్ ఉత్పత్తికి ముఖ్యమైనది.విటమిన్ సి చర్మం యొక్క వర్ణద్రవ్యం, శరీరం యొక్క కణజాలాలను మరమ్మత్తు చేయడం మరియు సోరియాసిస్, మొటిమలు మరియు ఇతర చర్మ వ్యాధుల నిర్వహణలో సహాయపడుతుంది.

బెండకాయలా ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఫైబర్ ఆకలిని తగ్గిస్తుంది మరియు బరువు నిర్వహణలో సహాయపడుతుంది. బెండకాయలలో విటమిన్ కె ఉంటుంది, ఇది రక్తం గడ్డకట్టడానికి మరియు ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.

Post Comment