బీన్స్ కర్రీ తయారీ విధానం : బీన్స్ కర్రీలో పోషకాలు, ప్రయోజనాలు
భారతీయ వంటకాలు

బీన్స్ కర్రీ తయారీ విధానం : బీన్స్ కర్రీలో పోషకాలు, ప్రయోజనాలు

ఈ ఆర్టికల్ యందు అనేక పోషకాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న బీన్స్ కర్రీ రెసిపీ తయారీ విధానం, కావాల్సిన పదర్ధాలు గూర్చి తెలుసుకుందాం. మీరు కూడా నేర్చుకుని ట్రై చేసి రుచి చూడండి.

బీన్స్ కర్రీ తయారీకి కావల్సిన పదార్దాలు

  • బీన్స్ – పావు కిలో
  • ఉల్లిపాయ – ఒకటి
  • ప‌చ్చిమిర్చి – రెండు
  • ట‌మాటాలు – రెండు
  • ఎండుకొబ్బరి పొడి - ఒక స్పూన్(ఆప్షనల్)
  • ధ‌నియాల పొడి – ఒక టేబుల్ స్పూన్
  • జీల‌క‌ర్ర – అర టీ స్పూన్
  • ఆవాలు - అర టీ స్పూన్
  • కారం పొడి – ఒక స్పూన్
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక స్పూన్
  • ఉప్పు – త‌గినంత‌
  • ప‌సుపు – పావు టీ స్పూన్
  • గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్
  • నూనె – 2 టేబుల్ స్పూన్స్
  • క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు
  • కొత్తిమీర – కొద్దిగా

బీన్స్ కర్రీ తయారీ విధానం

ముందుగా బీన్స్ ను శుభ్రంగా క‌డిగిపెట్టుకోవాలి. అలాగే టమాటాలు, పచ్చి మిర్చి తరిగి మిక్సీలో పేస్ట్ చేసి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయిలో నూనె వేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. త‌రువాత క‌రివేపాకు, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు చ‌క్క‌గా వేగిన త‌రువాత బీన్స్ వేసి ఐదు నిముషాలు మీడియం ఫ్లేమ్ లో మగ్గనివ్వాలి.

త‌రువాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించుకోవాలి. త‌రువాత ప‌సుపు, ఉప్పు, కారం, గ‌రం మ‌సాలా, ధ‌నియాల పొడి, కొబ్బ‌రి పొడి వేసి క‌ల‌పాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి క‌లిపి మూత‌ను ఉంచి ట‌మాట ముక్క‌లు మెత్త‌బ‌డే వ‌ర‌కు ఐదు నిముషాలు వేయించుకోవాలి.

ట‌మాట ముక్క‌లు మెత్త‌బ‌డిన త‌రువాత నీళ్లు, కొత్తిమీర వేసి క‌ల‌పుకొని పది నిముషాలు ఉడికించుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ బీన్స్ కర్రీ రెడీ అయినట్లే. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. బీన్స్ ను ఇష్ట‌ప‌డ‌ని వారు కూడా ఈ కూర‌ను ఇష్టంగా తింటారు.

బీన్స్ కర్రీలో లభించే పోషకాలు, ప్రయోజనాలు

బీన్స్ మొక్కల ఆధారిత ప్రోటీన్ యొక్క అద్భుతమైన మూలం, ఇది కణజాలాలను నిర్మించడానికి మరియు మరమ్మత్తు చేయడానికి, ఎంజైమ్‌లను తయారు చేయడానికి మరియు శరీరం అంతటా పోషకాలను రవాణా చేయడానికి అవసరం. బీన్స్ కర్రీలో ఫైబర్ సంవృద్ధిగా లభిస్తుంది, ఫైబర్ జీర్ణక్రియను నియంత్రించడంలో, గట్ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

బీన్స్‌లో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. శరీరం అంతటా ఆక్సిజన్‌ను తీసుకువెళ్లడానికి మరియు శక్తిని ఉత్పత్తి చేయడానికి ఐరన్ ముఖ్యమైనది. బీన్స్ పొటాషియం యొక్క మంచి మూలం. పొటాషియం రక్తపోటు మరియు కండరాల పనితీరును నియంత్రించడంలో సహాయపడే ఒక ఖనిజం.

బీన్స్ ఫోలిక్ యాసిడ్ యొక్క మంచి మూలం. ఫోలిక్ యాసిడ్ అనేది బి విటమిన్, ఇది గర్భిణీ స్త్రీలకు మరియు శిశువులలో న్యూరల్ ట్యూబ్ లోపాలను నివారించడానికి ముఖ్యమైనది. బీన్స్‌లో విటమిన్ సి, విటమిన్ కె, మెగ్నీషియం మరియు ఫాస్పరస్ వంటి ఇతర విటమిన్లు మరియు ఖనిజాలు కూడా సంవృద్ధిగా లభిస్తాయి.

Post Comment