చేపల కూర తయారీ విధానం : ఆంధ్రా స్టైల్ ఫిష్ కర్రీ రెసిపీ
భారతీయ వంటకాలు

చేపల కూర తయారీ విధానం : ఆంధ్రా స్టైల్ ఫిష్ కర్రీ రెసిపీ

చేపల్లోని రకాన్ని బట్టి, ఇగురు చేప, పులుసు, ఫ్రై, పచ్చడి ఇలా రకరకాలుగా చేపలతో వంటలు తయారు చేసుకోవచ్చు. చేపల కూర మంచి పోషకాలును కలిగి ఉంటుంది. ఇది ప్రొటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్స్ మరియు ఇతర పోషకాలకు మంచి మూలం.ఈ ఆర్టికల్ యందు ఈజీగా చేపల కూర తయారీ విధానం గూర్చి తెలుసుకుందాం.

ఫిష్ కర్రీకి కావాల్సిన పదార్ధాలు

  • చేపలు - అరకిలో
  • నూనె - అయిదు టేబుల్ స్పూన్స్
  • ఉల్లిపాయలు - రెండు
  • మిరియాల పొడి - 1/2 టీ స్పూన్
  • లవంగాలు - నాలుగు
  • మొక్కజొన్న పిండి - ఒక టీ స్పూన్
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - రెండు టీ స్పూన్స్
  • కారం - రెండు టీ స్పూన్స్
  • పచ్చి మిర్చి - 2
  • పసుపు - 1/2 టీ స్పూన్స్
  • ధనియాలు - ఒక టీ స్పూన్
  • ఉప్పు - తగినంత
  • కొత్తిమీర ఆకులు - రెండు రెమ్మలు
  • నిమ్మరసం - ఒక టీ స్పూన్
  • టమాటో - రెండు
  • కరివేపాకు - రెండు రెమ్మలు

ఫిష్ కర్రీ తయారీ విధానం

చేపలు శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత చేపముక్కలకు నిమ్మరసం, మొక్కజొన్నపిండి, ఉప్పు కలిపి అరగంటపాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయిలో నూనె వేయాలి. నూనె వేడయ్యాక అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చికమిర్చి, కరివేపాకు ,లవంగాలు, మిరియాల పొడి వేసి బాగా వేయించాలి.

ఉల్లిపాయ ముక్కలు గోధుమ రంగులో వేగిన తరువాత అల్లంవెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. తర్వాత దీంట్లో టమోటా గుజ్జు వేసి ఐదు నిముషాలు పాటు తక్కువ మంటపై ఉడికించాలి.

ఐదు నిమిషాల తర్వాత ఈ మిశ్రమంలో చేపలు కూడా వేసి, కొద్దిగా పసుపు, కారం, ధనియాల పొడి అలాగే గ్రేవీ కోసం సరిపడా నీళ్లు వేసి పదిహేను  నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి దించేయటమే. దించే ముందు చివరిగా కొత్తిమీర చల్లుకొని వేడి వేడిగా అన్నంతో సర్వ్ చేసుకోవటమే.

ఫిష్ కర్రీ తయారీకి కొన్ని చిట్కాలు

తాజా చేపలను తీసుకోండి. చేప ముక్కలను అరగంట పాటూ మెరినెట్ చేసుకోవాలి, ఇలా చేయటంవలన చేపలుకు మసాలా బాగా పట్టి కూర మంచి రుచిని కలిగిఉంటుంది. చేప ముక్కలను చిన్న మంటపై ఉడికించాలి అప్పుడే చేపలు బాగా ఉడుకుతాయి.

ఫిష్ కర్రీలో లభించే పోషకాలు

చేపలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాంగా ఉండటంలో ఉపయోగపడతాయి. చేపలలో ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాల పెరుగుదల మరియు పునరుద్ధణకు సహాయపడుతుంది. చేపలలో విటమిన్ D అధికంగా ఉండి ఎముకలు ఆరోగ్యాంగా ఉండటంలో తోడ్పడతాయి.

Post Comment