వెజిటబుల్ ఖిచిడీ తయారుచేయు విధానం : దాల్ ఖిచిడీ రెసిపీ
భారతీయ వంటకాలు

వెజిటబుల్ ఖిచిడీ తయారుచేయు విధానం : దాల్ ఖిచిడీ రెసిపీ

రోజూ పొద్దున్న ఒకే రకమైన టిఫిన్స్ తిని తిని మీ ఇంట్లో వాళ్ళు బోరుకొడుతుంది అంటున్నారా.. అయితే ఈ రెసిపీ ఖచ్చితంగా మీ కోసమే, నేర్చుకుని ట్రై చేయండి.ఈ ఆర్టికల్ యందు అదిరిపోయే వెజ్ కిచిడీ ఎలా తయారుచేయాలో, కావాల్సిన పదార్దాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

వెజిటబుల్ ఖిచిడీ తయారీకి కావాల్సిన పదార్దాలు

  • బియ్యం - రెండు కప్పలు
  • పెసర పప్పు - ముప్పావు కప్పు
  • ఇంగువ - చిటికెడు
  • ఎండుమిర్చి - రెండు
  • పచ్చి మిర్చి - రెండు
  • పచ్చి మిర్చి - రెండు లేదా మూడు
  • ఆవాలు - పావు టీ స్పూన్
  • శెనగపప్పు - అర  టీ స్పూన్
  • పసుపు - పావు టీ స్పూన్
  • వంకాయలు - ఒకటి
  • బంగాళ దుంప - ఒకటి
  • బీన్స్ - కొద్దిగా
  • క్యారెట్స్ - ఒకటి
  • పచ్చి బఠానీ - కొద్దిగా
  • ఉప్పు - సరిపడా
  • కరివేపాకు - రెండు రెమ్మలు
  • నెయ్యి - మూడు టేబుల్ స్పూన్స్
  • నీళ్లు - ఐదు నుంచి ఆరు కప్పులు

వెజిటబుల్ ఖిచిడీ తయారుచేసే విధానం

ముందుగా బియ్యం, పెసర పప్పు శుభ్రంగా కడిగి ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్‌లో నెయ్యి వేసి, కాగాక ఆవాలు, శెనగపప్పు, ఇంగువ, ఎండుమిర్చి, పచ్చి మిర్చి, కరివేపాకు, పసుపు వేసి రెండు నిముషాలు వేగనివ్వాలి. రెండు నిమిషాల తరవాత చిన్నగా తరిగిన కూరగాయ ముక్కలు, పచ్చి బాటని, బీన్స్ వేసి ఐదు నిముషాలు వేయించుకోవాలి.

కూరగాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత, అందులో సరిపడా నీళ్లు పోసి మరిగిన తరవాత ముందుగా నానబెట్టుకున్న బియ్యం, పెసరపప్పు, అలాగే సరిపడా ఉప్పు కూడా వేసి మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. అంతే రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన వెజిటబుల్ కిచిడీ రెడీ అయినట్లే. వేడిగా వేడిగా సర్వ్ చేసుకోవటమే.

వెజిటబుల్ ఖిచిడీలో లభించే పోషక విలువలు

వెజ్ కిచిడీ మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అవసరమైన అన్ని పోషకాలు పుషకాలంగా కలిగి ఉంటుంది. వెజ్ కిచిడీ బియ్యం, పప్పు మరియు నెయ్యి కలయికలో మీకు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, డైటరీ ఫైబర్, విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ మరియు పొటాషియంలను అందిస్తుంది.

కూరగాయలు మరియు పండ్లతో కూడిన ఆహారం రక్తపోటును తగ్గిస్తుంది, గుండె జబ్బులు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది, కొన్ని రకాల క్యాన్సర్లను నివారిస్తుంది, కంటి మరియు జీర్ణ సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బియ్యం మరియు పప్పులు కార్బోహైడ్రేట్లు మరియు ప్రోటీన్లను కలిగి ఉంటాయి. “ఈ కలయిక శరీరానికి 10 ముఖ్యమైన అమైనో ఆమ్లాలను అందిస్తుంది, ఇది పూర్తి ప్రోటీన్‌గా మారుతుంది.

పెసర పప్పులో ఫోలేట్, విటమిన్ B9 లేదా ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది, ఇది మీ శరీరం కొత్త కణాలను ఉత్పత్తి చేయడానికి మరియు నిర్వహించడానికి సహాయపడుతుంది, ముఖ్యంగా ఎర్ర రక్త కణాలను.

Post Comment