ఫిష్ బిర్యానీని త‌యారీ విధానం : ఫిష్ దమ్ బిర్యాని రెసిపీ
భారతీయ వంటకాలు

ఫిష్ బిర్యానీని త‌యారీ విధానం : ఫిష్ దమ్ బిర్యాని రెసిపీ

చాలా చేపలలో ఒమేగా-3 వంటి గుండె-ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి మరియు కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, జింక్, అయోడిన్ మరియు మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ ఆర్టికల్ యందు 'రైస్- ఫిష్' కాంబినేషన్ లో చేసుకునే ఫిష్ బిర్యానీ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలి, కావలిసిన పదార్దాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫిష్ బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్దాలు

  • బియ్యం - మూడు కప్పులు
  • చేప ముక్కలు - 10
  • ఉల్లిపాయలు - నాలుగు
  • టమోటా - రెండు
  • పచ్చిమిర్చి - ఆరు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టేబుల్ స్పూన్
  • నిమ్మకాయలు - ఒకటి
  • కొత్తిమీర - రెండు రెమ్మలు
  • పెరుగు - రెండు టేబుల్ స్పూన్స్
  • ఉప్పు - తగినంత
  • నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు
  • నూనె - నాలుగు టేబుల్ స్పూన్స్
  • పసుపు - 1 టీస్పూన్
  • కాజు - 8
  • నీళ్లు - 6 గ్లాసులు
  • యాలకులు - 3
  • లవంగాలు - 3
  • దాల్చిన చెక్క - చిన్న ముక్క
  • బిర్యానీ ఆకులూ - రెండు
  • జీరా - అర టీ స్పూన్
  • గరం మసాలా - అర టీ స్పూన్

ఫిష్ బిర్యానీ తయారీ విధానం

ముందుగా చేప ముక్కలలో కొద్దిగా గడ్డ ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయలను సన్నగా, నిలువుగా తరగాలి. ఇప్పుడు పాన్‌లో 1టి స్పూన్ నూనె వేసి, కట్ చేసిన వాటిలో సగం ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బ్రౌన్ కలర్ లో వేయిచి పక్కన పెట్టుకోవాలి. తరవాత అదే పాన్‌లో నెయ్యి వేసి. జీడిపప్పు దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్‌లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి, వేడయ్యాక చేప ముక్కలు వేసి తేలికగా వేయించి పక్కన పెట్టుకోండి. బియ్యం ఉడికించటానికి ముందు ఇరవై నిముషాలు నానబెట్టుకోవాలి.

ఇప్పుడు పాన్‌లో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి, కాగాక మిగిలిన ఉల్లిపాయ తురుము, పచ్చిమిర్చి వేసి 3-4 నిమిషాలు బాగా వేయించండి. వేగాక దానిలో, అల్లంవెల్లుల్లి పేస్ట్ టొమాటోలు, పెరుగు, సరిపడా ఉప్పు, గరం మసాలా, కారం, పసుపు వేసి బాగా కలపండి. నీరు ఆవిరైపోయే వరకు మరో ఐదు నిముషాలు ఉడికించాలి. ఇప్పుడు దానిలో వేయించిన చేప ముక్కలు, కొత్తిమీర, నిమ్మకాయ రసం వేసి, దించి పక్కన పెట్టుకోండి.

ఇప్పుడు ఒక పాత్రలో నూనె, నెయ్యి వేసి, వేడయ్యాక ఏలకులు, దాల్చినచెక్క, లవంగాలు, జీరా, బిర్యానీ ఆకులు వేసి రెండు నిముషాలు వేయించండి. తరవాత అందులో కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసి, దానిలో సరిపడా నీరు, ఉప్పు వేసి అధిక మంటపై 10 నిమిషాలు మూతపెట్టి ఉడకనివ్వండి. అన్నం 80 శాతం ఉడికిన తరవాత నీరు వడకట్టుకోవాలి.

ఇప్పుడు అడుగు దళసరిగా ఉన్న పాత్ర తీసుకుని లోపల నెయ్యి పూసి అడుగున ఉడికిన అన్నం లేయర్ గా పరిచి దానిపైన వేయించిన చేప మిశ్రమం, వేయించిన ఉల్లిపాయలు, కొద్దిగా నెయ్యి వేసి, దానిపైన మళ్లి ఉడికించిన రైస్ వేసి, దానిపైన వేయించిన చేపల మిశ్రమం లేయర్లుగా వేసుకోవాలి. పైన కొత్తిమీర, జీడిపప్పు, నెయ్యి వేసి బరువైన మూత పెట్టి 15 నిముషాలు పాటు తక్కువ మంటపై మగ్గయించండి. అంతే ఘుమఘుమలాడే చేపల బిర్యానీ రెడీ అయినట్లే.

ఫిష్ బిర్యానీ తయారీకి కొన్ని చిట్కాలు

ఫిష్ బిర్యానీ తయారీకి మంచి ముక్క చేపలు తీసుకోండి. చేపలను అరగంట పాటు మెరినేట్ చేసుకోవాలి, ఇలా చేయటం వలన చేప ముక్కలకు మసాలా బాగా పడుతుంది. అన్నం, చేపలు విడిగా ఉడికించుకోవాలి. చేపలను దోరగా వేయించుకోవాలి. అన్నం 80 శాతం ఉడికిన తరవాత చేప ముక్కలు వేసుకోవాలి. లేదంటే చేపలు మెత్తబడి ముక్క విడిపోతుంది. అన్నం, చేపల మిశ్రమం పొరలు పొరలుగా వేయాలి.

ఫిష్ బిర్యానీలో లభించే పోషక విలువలు

చాలా చేపలలో ఒమేగా-3 వంటి గుండె-ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి మరియు కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, జింక్, అయోడిన్ మరియు మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి.

ఫిష్ బిర్యానీ ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు మరియు మినరల్స్‌తో కూడిన రుచికరమైన మరియు పోషకాహారమైన వంటకం.చేపలలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది, మీ శరీరానికి అవసరమైన అన్ని అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. కణజాలాలను నిర్మించడానికి మరియు మరమ్మత్తు చేయడానికి ప్రోటీన్ అవసరం, మరియు ఇది మిమ్మల్ని పూర్తిగా మరియు సంతృప్తిగా ఉంచడంలో సహాయపడుతుంది.

చేపలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సంవృద్ధిగా లభిస్తాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, మెదడు ఆరోగ్యానికి మరియు మంటను తగ్గించడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. చేపలు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలకు మంచి మూలం, ముఖ్యంగా సాల్మన్, ట్యూనా మరియు మాకేరెల్. విటమిన్లు మరియు ఖనిజాల మంచి మూలం:చేపలు విటమిన్ ఎ యొక్క మంచి మూలం,D,మరియు B12,అలాగే కాల్షియం వంటి ఖనిజాలు,ఇనుము,మరియు జింక్.ఈ పోషకాలు అనేక ముఖ్యమైన శారీరక విధులకు అవసరం.

Post Comment