చికెన్ మంచూరియా రెసిపీ తయారీ విధానం : లభించే పోషకాలు
భారతీయ వంటకాలు

చికెన్ మంచూరియా రెసిపీ తయారీ విధానం : లభించే పోషకాలు

మంసాహార ప్రియులు అతిగా ఇష్టపడే 'చికెన్ మంచూరియా' వంటకాన్ని తక్కువ సయమంలో ఇంట్లోనే హాట్ హాట్ గా, స్పైసి స్పైసీగా ఎలా తయారుచేసుకోవచ్చు అలాగే తయారీకి కావాల్సిన పదార్దాలు ఏమిటో ఈ ఆర్టికల్ యందు తెలుసుకుందాం. మీరు నేర్చుకుని ట్రై చేయండి.

చికెన్ మంచూరియా తయారీకి కావలసిన పదార్దాలు

  • బోన్ లెస్ చికెన్ - అరకేజీ
  • ఉల్లిపాయలు - రెండు
  • అల్లం, వెల్లుల్లి పేస్ట్ – రెండు టేబుల్ స్పూన్లు
  • మిరియాల పొడి – అర టీ స్పూన్
  • కోడిగుడ్డు - ఒకటి
  • సోయాసాస్ - ఒక టీ స్పూన్
  • చిల్లీ సాస్ - ఒక టీ స్పూన్
  • వెనిగర్ - ఒక టీ స్పూన్
  • కార్న్ ఫ్లోర్ - ఒక టేబుల్ స్పూన్
  • టమోటా సాస్ - ఒక టేబుల్ స్పూన్
  • ఉప్పు - తగినంత
  • నూనె - వేయించటానికి సరిపడా
  • కొత్తిమీర - రెండు రెమ్మలు
  • కరివేపాకు - రెండు రెమ్మలు

చికెన్ మంచూరియా తయారీ విధానం

ముందుగా చికెన్‌ తీసుకుని అందులో మిరియాల పొడి, కోడిగుడ్డు, ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, పచ్చి మిర్చి తురుము వేసి మొత్తం చికెన్ కు పట్టేలా బాగా కలపాలి, తర్వాత అందులో కార్న్ ఫ్లోర్‌లను తగినంత నీటితో కలిపి అరగంట పాటు పక్కనబెట్టుకోవాలి. అరగంట తర్వాత పాన్‌లో నూనె వేసి చికెన్‌ను దోరగా వేయించి ఓ ప్లేటులోకి తీసుకోవాలి.

తర్వాత మరో పాన్‌లో నూనె వేసి, వేడయ్యాక ఉల్లిపాయ తరుగు, అల్లం, వెల్లుల్లి, మిర్చి పేస్ట్‌ను, కొద్దిగా కారం, కరివేపాకు వేసి బాగా వేయించాలి. వేగిన తర్వాత ఇందులో సోయాసాస్, టమోటా సాస్, చిల్లీ సాస్, వెనిగర్ నీరు చేర్చి కాసేపు వేయించుకోవాలి.

అనంతరం ఈ మిశ్రమంలో ముందుగా వేయించిన చికెన్ పీస్‌లను చేర్చి ఓ నాలుగు నిమిషాల పాటు వేయించాలి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, కార్న్ ఫ్లోర్ చేరిస్తే సరి. అంతే ఎంతో టేస్టీ టేస్టీగా చికెన్ మంచురియా రెడీ. దీనిని ఫ్రైడ్రైస్, చపాతీ, రోటీలకు సైడిష్‌గా సర్వ్ చేసుకోవచ్చు.

చికెన్ మంచూరియాలో లభించే పోషకవిలువలు

చికెన్ ప్రోటీన్ యొక్క మంచి మూలం, ప్రోటీన్స్ కండరాల పెరుగుదల మరియు మరమ్మత్తు చేయటానికి ఉపయోగపడతాయి. ఇది మిమ్మల్ని నిండుగా మరియు సంతృప్తిగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. చికెన్ మంచూరియన్‌లోని కూరగాయలు ఫైబర్ యొక్క మంచి మూలం, ఇది జీర్ణ ఆరోగ్యానికి ముఖ్యమైనది. ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.

చికెన్ మంచూరియన్ విటమిన్లు ఎ, సి మరియు ఇ లు సంవృద్ధిగా లభిస్తాయి. విటమిన్స్ రోగనిరోధకశక్తీ పెంచటానికి, చర్మ ఆరోగ్యం మరియు ఇన్ఫెక్షన్‌తో పోరాడటం, గాయాలను నయం చేయడం, మన ఎముకలను దృఢంగా మార్చడం మరియు హార్మోన్‌లను నియంత్రించడం వంటి శారీరక విధులకు విటమిన్లు చాలా అవసరం. చికెన్ మంచూరియన్‌లో ఉండే అల్లం మరియు వెల్లుల్లి వంటి మసాలాలు యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం. యాంటీఆక్సిడెంట్లు మీ కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడతాయి మరియు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడవచ్చు.

Post Comment