జీరా రైస్ రెసిపీ తయారుచేసుకోవడం ఎలా : లభించే పోషకాలు
భారతీయ వంటకాలు

జీరా రైస్ రెసిపీ తయారుచేసుకోవడం ఎలా : లభించే పోషకాలు

రైస్ కాంబినేషన్లో చేసే ఏ వంటకం అయినా రుచికి అద్భుతంగా ఉంటాయి. ఈ ఆర్టికల్ యందు జీరా మరియు రైస్ కాంబినేషన్లో జీరారైస్ రెసిపీ ఎలా తయారు చేయాలి, కావాల్సిన పదార్ధాలు ఇక్కడ తెలుసుకుందాం.

జీరా రైస్ తయారీకి కావాల్సిన పదర్ధాలు

  • రైస్ - రెండు కప్పులు
  • ఉల్లిపాయలు - రెండు
  • నూనె - రెండు టేబుల్ స్పూన్స్
  • నెయ్యి - రెండు టీ స్పూన్స్
  • ఉప్పు - తగినంత
  • జీరా - రెండు టీ స్పూన్స్
  • లవంగాలు - ఒకటి
  • దాల్చిన చెక్క - చిన్న ముక్క
  • యాలకులు - ఒకటి
  • మిరియాలు - నాలుగు
  • పచ్చిమిర్చి - నాలుగు
  • కొత్తిమీర - రెండు రెమ్మలు
  • జీడీ పప్పు - తగినన్ని
  • నీళ్లు - నాలుగు కప్పులు

జీరా రైస్ తయారు చేయు విధానం

ముందుగా రైస్ శుభ్రంగా కడిగి ఓ ఇరవై నిముషాలు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకుని అందులో నూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి బంగారు రంగు వచ్చేలా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే తరువాత అదే పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి జీడీ పప్పు దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.

అనంతరం అదే పాన్‌లో మిగిలిన నూనె వేసి, వేడి అయిన తర్వాత జీలకర్ర, లవంగాలు,మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి వేయించాలి. ఇవి చిటపటలాడుతుండగా. అందులో పచ్చిమిర్చి వేసి వేయించండి. ఇప్పుడు ఆ పోపు మిశ్రమంలో కడిగిన బియ్యం వేసి, అన్ని పదార్థాలు కలిసే వరకూ ఓ నిమిషం పాటు వేయించండి. .

బియ్యం ఒక నిమిషం వేగాక. అందులో సరిపడా ఉప్పు వేసి కలిపి. అన్నం ఉడికించుకోటానికి సరిపడా నీరు వేసి పాన్ మీద మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. నీరు దగ్గరగా అయ్యాక మంట తగ్గించి లో- ఫ్లేమ్ లో ఒక ఐదు నిముషాలు మగ్గించాలి. ఇప్పుడు స్టౌ ఆపేసి కాసేపు ఆవిరిపై అలానే ఉంచండి.

చివరిగా పైన కొత్తిమీర, ముందుగా వేయించిన ఉల్లి తరుగు, ముందుగా వేయించిన జీడీ పప్పు అలంకరించుకుంటే సరిపోతుంది. అంతే యమ్మీ యమ్మీ జీరా రైస్ రెడీ.

జీరా రైస్‌లో లభించే పోషకాలు

జీలకర్ర శరీరంలోని ఆక్సిడైజ్డ్ ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే కాకుండా, ఎలివేటెడ్ ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి మరియు అసమతుల్య రక్తపోటును అదుపులో ఉంచడానికి మరియు గుండె జబ్బులను దూరం చేయడానికి సహాయపడుతుంది.

అన్నం మరియు జీరా నీరు రెండూ అజీర్ణం, కడుపులో గ్యాస్, కడుపు మంట, ఉబ్బరం, యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట మరియు మరిన్నింటిని నయం చేయడానికి ఉపయోగపడతాయి. జీలకర్రలో మంచి మొత్తంలో ఐరన్ ఉంటుంది. ఆక్సిజన్ రవాణాకు అవసరమైన రక్తంలో హిమోగ్లోబిన్ ఏర్పడటానికి ఇనుము ఒక ముఖ్యమైన అంశం.

జీరాలో ఫైబర్ మరియు మినరల్స్ సంవృద్ధిగా ఉండటం వల్ల శరీరంలో జీర్ణక్రియ మరియు ప్రేగు కదలికను మెరుగుపరుస్తుంది, అలాగే కడుపులో గ్యాస్ నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. జీరా జీర్ణ ఎంజైమ్స్ ను స్రవిస్తుంది, ఉబ్బరం తగ్గిస్తుంది మరియు శరీరంలో నీరు అనవసరంగా నిలుపుదలని నివారిస్తుంది.

Post Comment