పచ్చి శనగపప్పు చట్నీ తయారీ విధానం : శనగపప్పు చట్నీ రెసిపీ
భారతీయ వంటకాలు

పచ్చి శనగపప్పు చట్నీ తయారీ విధానం : శనగపప్పు చట్నీ రెసిపీ

రోజూ పొద్దున్న చేసుకునే బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీలు ఎంత అవసరం అనేది మన అందరికి తెలుసు. ముఖ్యంగా టిఫిన్స్ ఇడ్లీ, దోస,పూరి మరియు వడ వంటి వాటికి చట్నీలు తప్పని సరిగా ఉండాలి. ఈ ఆర్టికల్ యందు అదిరిపోయే పచ్చి శనగపప్పు చట్నీ ఎలా తయారు చేయాలి, పచ్చడి తయారీకి కావాల్సిన పదార్దాలు ఏమిటో తెలుసుకుందాం.  రెసిపీని మీరు కూడా ట్రై చేయండి.

శనగపప్పు చట్నీ తయారీకి కావాల్సిన పదార్దాలు

  • శ‌న‌గ‌ప‌ప్పు - ఒక క‌ప్పు
  • నూనె - ఒక స్పూన్
  • ధ‌నియాలు - ఒక స్పూన్
  • జీల‌క‌ర్ర - ఒక స్పూన్
  • ఆవాలు - అర స్పూన్
  • మిన‌ప ప‌ప్పు - రెండు స్పూన్స్
  • ప‌చ్చిమిర్చి - రెండు
  • ఎండుమిర్చి - రెండు
  • వెల్లుల్లి రెబ్బ‌లు - ఆరు
  • చింత‌పండు - కొద్దిగా
  • క‌రివేపాకు - రెండు రెమ్మలు
  • ఎండుకొబ్బ‌రి పొడి - ఒక టేబుల్ స్పూన్
  • ఉప్పు - త‌గినంత‌
  • నూనె - రెండు స్పూన్స్
  • శ‌న‌గ‌ప‌ప్పు - ఒక స్పూన్

శనగపప్పు చట్నీ తయారీ విధానం

ముందుగా ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ధ‌నియాల‌ను వేసి దోర‌గా వేయించాలి. ఇవి వేగిన త‌రువాత జీల‌క‌ర్ర‌, మిన‌ప ప‌ప్పు, శ‌న‌గ‌ప‌ప్పు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత చింతపండు, ప‌చ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించుకుని పక్కన బెట్టి చల్లార్చు కోవాలి. ఇవి పూర్తిగా చ‌ల్లారిన త‌రువాత ఒక మిక్సీ జార్ లో తీసుకుని అందులో ఉప్పు, ఎండుకొబ్బ‌రి పొడి, కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా మిక్సీ ప‌ట్టుకోవాలి. మొత్తం రుబ్బుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

త‌రువాత  పోపు కోసం క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఆవాలు, ఎండు మిర్చి , కరివేపాకు ఒక్కొక్క‌టిగా వేసి తాళింపు బాగా వేగనివ్వాలి. తాళింపు వేగిన త‌రువాత దానిని ముందుగా రుబ్బుకున్న చ‌ట్నీలో వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ శ‌న‌గ‌ప‌ప్పు చ‌ట్నీ తయారవుతుంది.

శనగపప్పు చట్నీలో లభించే పోషకాలు, ప్రయోజనాలు

శనగపప్పులో ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. ప్రోటీన్ కణజాలాలను నిర్మించడానికి మరియు మరమ్మత్తు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది మిమ్మల్ని నిండుగా మరియు సంతృప్తిగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. శనగపప్పు చట్నీలో ఫైబర్ సంవృద్ధిగా లభిస్తుంది. ఫైబర్ జీర్ణక్రియను క్రమబద్ధీకరించడానికి మరియు గట్ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలు మరియు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

శనగపప్పు చట్నీ లో ఐరన్ లభిస్తుంది. శరీరంలో ఆక్సిజన్‌ను తీసుకువెళ్లడానికి ఐరన్ అవసరం. ఇది శక్తి ఉత్పత్తికి కూడా ముఖ్యమైనది. శనగపప్పు చట్నీలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది.విటమిన్ సి అనేది యాంటీఆక్సిడెంట్, ఇది కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. రోగనిరోధక పనితీరుకు కూడా ఇది ముఖ్యం. శక్తి ఉత్పత్తి మరియు కండరాల పనితీరుకు విటమిన్ B1 ముఖ్యమైనది. విటమిన్ B2 శక్తి ఉత్పత్తి మరియు కణాల పెరుగుదలకు ముఖ్యమైనది.

Post Comment