బీరకాయ పచ్చడి తయారీ విధానం : రిడ్జ్ గోర్డ్ పచ్చడి రెసిపీ
భారతీయ వంటకాలు

బీరకాయ పచ్చడి తయారీ విధానం : రిడ్జ్ గోర్డ్ పచ్చడి రెసిపీ

రోజూ పొద్దున్న చేసుకునే బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీలు ఎంత అవసరం అనేది మన అందరికి తెలుసు. ముఖ్యంగా టిఫిన్స్ ఇడ్లీ, దోస,పూరి మరియు వడ వంటి వాటికి చట్నీలు తప్పని సరిగా ఉండాలి. ఈ ఆర్టికల్ యందు అదిరిపోయే బీరకాయ పచ్చడి ఎలా తయారు చేయాలి, పచ్చడి తయారీకి కావాల్సిన పదార్దాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ కొత్త రెసిపీని మీరు కూడా ట్రై చేయండి.

బీరకాయ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్దాలు

  • బీర‌కాయ‌లు - నాలుగు
  • ప‌చ్చిమిర్చి - మూడు
  • ప‌ల్లీలు - పిడికెడు
  • శ‌న‌గ‌ప‌ప్పు – ఒక స్పూన్
  • మినపగుళ్ళు - అర స్పూన్
  • త‌రిగిన ట‌మాట - ఒకటి
  • జీల‌క‌ర్ర - ఒక స్పూన్
  • ప‌సుపు - అర స్పూన్
  • వెల్లుల్లి రెబ్బ‌లు - ఆరు
  • ఉప్పు - త‌గినంత‌
  • చింత‌పండు - కొద్దిగా
  • కొత్తిమీర - కొద్దిగా
  • నూనె - రెండు టేబుల్ స్పూన్స్
  • ఆవాలు - అర స్పూన్
  • జీల‌క‌ర్ర - అర స్పూన్
  • ఎండుమిర్చి - రెండు
  • క‌రివేపాకు - ఒక రెమ్మ‌

బీరకాయపచ్చడి తయారీ విధానం

ముందుగా బీర‌కాయల పై తొక్కను తీసి శుభ్రంగా క‌డిగి ముక్క‌లుగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక క‌ళాయిలో నూనె వేసి. నూనె కాగిన త‌రువాత జీలకర్ర , ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ప‌చ్చిమిర్చి కొద్దిగా వేగిన త‌రువాత  అందులో ప‌ల్లీలు, శ‌న‌గ‌ప‌ప్పు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ఒక ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో బీరకాయ ముక్క‌లు, ట‌మాట ముక్క‌లు వేసి మెత్తగా అయ్యేంతవరకు మగ్గించాలి.

బీరకాయ టమాటా ముక్కలు బాగా మగ్గినతరవాత కొద్దిగా ప‌సుపు, సరిపడా ఉప్పు, కొంచెం చింత‌పండు, కొత్తిమీర వేసి ఓ ఐదు నిముషాలు కలుపుతూ బీర‌కాయ ముక్క‌ల్లో ఉన్న నీరంతా పోయే వ‌ర‌కు క‌లుపుతూ వేయించాలి. ఇలా వేయించిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్ల‌గా అయ్యే వ‌ర‌కు పక్కన పెట్టుకోవాలి.

ఈ మిశ్రమం చల్లారిన తరవాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ముందుగా వేయించిన బీరకాయ మిశ్రమం మరియు ప‌చ్చిమిర్చి పల్లీల మిశ్రమం, అలాగే వెల్లుల్లి రెబ్బ‌లు, రుచికి త‌గినంత ఉప్పును కూడా వేసి మ‌రీ మెత్త‌గా కాకుండా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి.

ఇప్పుడు పోపు కోసం క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఆవాలు, ఎండుమిర్చి, మినపగుళ్ళు, కరివేపాకు ఒక్కొక్కటిగా వేసి పోపు వేయించాలి. తాలింపు వేగిన త‌రువాత దీనిని ముందుగా త‌యారు చేసిన ప‌చ్చ‌డిలో వేసి మొత్తం కలిసేలా క‌లుపుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల టేస్టీ టేస్టీ బీర‌కాయ ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. దీనిని వేడి వేడి అన్నంలో, నెయ్యితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.

బీరకాయ పచ్చడిలో లభించే పోషకాలు, ప్రయోజనాలు

బీరకాయలో డైటరీ ఫైబర్స్, వాటర్ కంటెంట్, విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం మరియు విటమిన్ బి6 వంటి అవసరమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.

బీరకాయలో విటమిన్ సి, విటమిన్ ఎ మరియు విటమిన్ బి1 లకు మంచి మూలం. రోగనిరోధక పనితీరు మరియు కొల్లాజెన్ ఉత్పత్తికి విటమిన్ సి ముఖ్యమైనది. విటమిన్ ఎ దృష్టి మరియు చర్మ ఆరోగ్యానికి ముఖ్యమైనది. విటమిన్ B1 శక్తి ఉత్పత్తి మరియు నరాల పనితీరుకు ముఖ్యమైనది.

బీరకాయలో పొటాషియం, ఐరన్ మరియు మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. కండరాల పనితీరు మరియు రక్తపోటు నియంత్రణకు పొటాషియం ముఖ్యమైనది. ఆక్సిజన్ రవాణా మరియు శక్తి ఉత్పత్తికి ఐరన్ ముఖ్యమైనది. మెగ్నీషియం కండరాలు మరియు నరాల పనితీరుకు ముఖ్యమైనది.

బీరకాయ ఫైబర్ యొక్క మంచి మూలం, ఇది జీర్ణ ఆరోగ్యానికి మరియు రక్తంలో చక్కెర నియంత్రణకు ముఖ్యమైనది. పొట్లకాయలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి క్యాన్సర్‌కు దారితీసే నష్టం నుండి కణాలను రక్షించడంలో సహాయపడుతుంది.

Post Comment