రసగుల్లా స్వీట్ తయారీ విధానం : స్వీట్ షాప్ స్టైల్ లో రసగుల్లా
భారతీయ వంటకాలు

రసగుల్లా స్వీట్ తయారీ విధానం : స్వీట్ షాప్ స్టైల్ లో రసగుల్లా

రోజూ సాయంత్రం ఒకే రకమైన స్నాక్స్ లేదా స్వీట్స్ తిని తిని మీ ఇంట్లో వాళ్ళు బోరుకొడుతుంది అంటున్నారా.. అయితే ఈ రెసిపీ ఖచ్చితంగా మీ కోసమే, ఒక్కసారి నేర్చుకుని ట్రై చేయండి.ఈ ఆర్టికల్ యందు అదిరిపోయే రసగుల్లా ఎలా తయారుచేయాలి, తయారీకి కావాల్సిన పదార్దాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

రసగుల్లా తయారీకి కావాల్సిన పదార్దాలు

  • పచ్చిపాలు – లీటరు
  • మిల్క్ పౌడరు – అరకప్పు
  • నీళ్లు – తగినన్ని
  • వెనిగర్ లేదా నిమ్మరసం - ఒక స్పూన్
  • యాలకుల పొడి - ఒక స్పూన్
  • కుంకుమ పువ్వు - కొద్దిగా
  • రోజ్ వాటర్ - కొద్దిగా
  • నెయ్యి - తగినంత

రసగుల్లా తయారీ విధానం

ముందుగా స్టౌ ఆన్ చేసి ఓ గిన్నె పెట్టి, దానిలో పచ్చిపాలు, మిల్క్ పౌడరు రెండు కప్పుల నీళ్లు వేసి కలపాలి. పాలు మరుగుతున్న సమయంలో కొంచెం నిమ్మరసం లేదా ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ వేయాలి. అప్పుడు పాలు విరిగిపోతాయి.ఇప్పుడు ఆ పాలను తీసుకుని ఒక బట్టలో వేసి వడకట్టాలి. అలా మొత్తం వాడకట్టిన మిశ్రమాన్ని గట్టిగా పిండి దానిమీద బరువు పెట్టాలి. పావుగంట తర్వాత ఆ విరుగుని తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు అది స్మూత్ గా అవుతుంది.

తరవాత ఆ మిశ్రమాన్ని బాగా కలిపి స్మూత్ గా వచ్చే వరకూ మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత చేతికి నెయ్యి రాసుకుని ఉండలు చేయాలి. ఈ లోగా పంచదార ఒక కప్పు, అయిదు కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. పాకం మరుగుతున్నప్పుడు, ఈ పాకంలో ఈ ఉండలు వేసి ఓ పదిహేను నిమిషాల పాటు మంట సిమ్ లోనే ఉంచి ఉడికించాలి. పాకంలో యాలకుల పొడి కానీ, కుంకుమ పువ్వు కానీ, రోజ్ వాటర్ కానీ వేసుకోవచ్చును. ఇష్టమైన వారు డ్రైప్రూట్స్ ను చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవచ్చు. అంతే ఎంతో రుచికరమైన రసగుల్లా రెడీ.

రసగుల్లాలో లభించే పోషకాలు, ప్రయోజనాలు

రసగుల్లా అధిక కార్బోహైడ్రేట్ ఆహారం, 100 గ్రాముల రసగుల్లాలో దాదాపు 18 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. రసగుల్లాలోని ప్రధాన కార్బోహైడ్రేట్ సుక్రోజ్, ఇది సాధారణ చక్కెర. రసగుల్లా ప్రోటీన్ యొక్క మంచి మూలం, 100 గ్రాముల రసగుల్లాలో 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కణజాలాలను నిర్మించడానికి మరియు మరమ్మత్తు చేయడానికి ప్రోటీన్ ముఖ్యమైనది మరియు ఇది హార్మోన్లు మరియు ఎంజైమ్‌లను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.

రసగుల్లా తక్కువ కొవ్వు ఆహారం, 100 గ్రాముల రసగుల్లాలో దాదాపు 3 గ్రాముల కొవ్వు ఉంటుంది. రసగుల్లాలో ప్రధానమైన కొవ్వు రకం సంతృప్త కొవ్వు. సంతృప్త కొవ్వును ఆహారంలో పరిమితం చేయాలి, ఎందుకంటే ఇది LDL (చెడు) కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది.

రసగుళ్ళలో విటమిన్ ఎ, విటమిన్ సి మరియు విటమిన్ డితో సహా చిన్న మొత్తంలో విటమిన్లు ఉంటాయి. ఈ విటమిన్లు రోగనిరోధక పనితీరు, దృష్టి మరియు ఎముకల ఆరోగ్యంతో సహా వివిధ శారీరక విధులకు ముఖ్యమైనవి . రసగుల్లాలో కాల్షియం, ఫాస్పరస్ మరియు ఇనుముతో సహా చిన్న మొత్తంలో ఖనిజాలు ఉంటాయి . ఎముక ఆరోగ్యం, కండరాల పనితీరు మరియు రక్త ఆక్సిజన్ రవాణాతో సహా వివిధ శారీరక విధులకు ఈ ఖనిజాలు ముఖ్యమైనవి.

Post Comment