బెల్లంతో మినప సున్నుండలు తయారీ విధానం : పోషకాలు
భారతీయ వంటకాలు

బెల్లంతో మినప సున్నుండలు తయారీ విధానం : పోషకాలు

రోజూ సాయంత్రం ఒకే రకమైన స్నాక్స్ లేదా స్వీట్స్ తిని తిని మీ ఇంట్లో వాళ్ళు బోరుకొడుతుంది అంటున్నారా.. అయితే ఈ రెసిపీ ఖచ్చితంగా మీ కోసమే, ఒక్కసారి నేర్చుకుని ట్రై చేయండి.ఈ ఆర్టికల్ యందు అదిరిపోయే బెల్లం మినప సున్నుండలు ఎలా తయారుచేయాలి, తయారీకి కావాల్సిన పదార్దాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం

బెల్లం సున్నుండలు తయారీకి కావాల్సిన పదార్దాలు

  • మిన‌ప‌గుళ్లు - మూడు కప్పులు
  • పొట్టు మిన‌ప గుళ్లు – ఒక కప్పు
  • బెల్లం తురుము – మూడు లేదా నాలుగు
  • నెయ్యి –  ఒక కప్పు (త‌గినంత‌)
  • యాలకుల పొడి - రెండు స్పూన్స్

బెల్లం సున్నండలు తయారీ విధానం

ముందుగా మిన‌ప‌గుళ్ల‌ను తీసుకుని ఒక క‌ళాయిలో వేసి చిన్న మంట‌పై రంగు మారే వ‌ర‌కు వేయించుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అదే క‌ళాయిలో పొట్టు మిన‌ప‌గుళ్ల‌ను కూడా వేసి చిన్న మంట‌పై రంగు మారే వ‌ర‌కు వేయించుకుని మిన‌ప‌గుళ్ల‌ను ఉంచిన ప్లేట్ లోకి తీసుకుని రెండింటిని క‌ల‌పాలి. త‌రువాత వీటిని కొద్దిగా కొద్దిగా ఒక జార్ లోకి తీసుకుంటూ మ‌రీ మెత్త‌గా కాకుండా కొద్దిగా బ‌ర‌క‌గా ఉండేలా మిక్సీ ప‌ట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

ఇలా మిన‌ప‌గుళ్ల‌న‌న్నింటిని మిక్సీ ప‌ట్టుకున్న త‌రువాత ఆ పొడిలో బెల్లం తురుమును, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బెల్లంతురుమును వేసి క‌లిపిన మిశ్ర‌మాన్ని మ‌ర‌లా మిక్సీజార్ లో వేసుకుంటూ మిక్సీ ప‌ట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్ర‌మంలో మూడు నుండి నాలుగు టీ స్పూన్ల నెయ్యిని వేసుకుంటూ కొద్ది కొద్దిగా క‌లుపుకుంటూ కావ‌ల్సిన సైజులో ఉండ‌లుగా చుట్టుకోవాలి. అంతే రుచిగా ఉండే బెల్లం సున్నుండ‌లు త‌యార‌వుతాయి. వీటిని త‌డి లేని డ‌బ్బాలో నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల నెల రోజుల పాటు తాజాగా ఉంటాయి.

బెల్లం సున్నండలులో లభించే పోషకాలు,ప్రయోజనాలు

మెగ్నీషియం, ఫైబర్ మరియు పొటాషియం ఉండటం వల్ల గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సున్నూండలు సహాయపడుతుంది . డైటరీ ఫైబర్ మీ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి మరియు ఏదైనా వ్యాధులను నివారించడానికి ఉపయోగపడతాయి, అయితే మెగ్నీషియం రక్త ప్రసరణలో సహాయపడుతుంది మరియు పొటాషియం రక్త నాళాలు మరియు ధమనులలో ఒత్తిడిని తగ్గిస్తుంది.

ఉరద్ పప్పు యొక్క ఆకట్టుకునే కాల్షియం మరియు ఫాస్పరస్ కంటెంట్ బలమైన మరియు ఆరోగ్యకరమైన ఎముకలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సున్నుండలు యొక్క రెగ్యులర్ వినియోగం మెరుగైన ఎముక సాంద్రతకు దోహదపడుతుంది మరియు ఎముక సంబంధిత వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.

బెల్లం మొక్కల ఉత్పత్తికి ఇనుము యొక్క అద్భుతమైన మూలం . ఒక్క సర్వింగ్‌లో రోజుకు మీరు తీసుకునే ఐరన్‌లో దాదాపు పది శాతం ఉండవచ్చు. ఆరోగ్యకరమైన రక్త కణాలకు మద్దతు ఇవ్వడానికి ఐరన్ కీలకం. మీ ఆహారంలో తగినంత ఇనుము పొందడం వలన మీరు తక్కువ అలసట అనుభూతి మరియు కండరాల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

Post Comment