తలకాయ కూర తయారీ విధానం : Goat Head Curry Recipe
భారతీయ వంటకాలు

తలకాయ కూర తయారీ విధానం : Goat Head Curry Recipe

ఈ ఆర్టికల్ యందు నాన్ వెజ్ ప్రియులకు ఎంతో ఇష్టమైన తలకాయ కూర సులభంగా, టేస్టీగా ఎలా తయారుచేసుకోవాలి, తయారీకి కావాల్సిన పదార్దాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

తలకాయ కూర తయారీకి కావాల్సిన పదార్దాలు

  • త‌ల‌కాయ మాంసం – అర కిలో
  • ఉల్లిపాయ‌లు – రెండు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక‌టిన్న‌ర టీ స్పూన్స్
  • ప‌సుపు – ఒక టీ స్పూన్
  • ప‌చ్చి మిర్చి – నాలుగు
  • క‌రివేపాకు – రెమ్మలు
  • ట‌మాట – ఒకటి
  • కొత్తిమీర – రెండు రెమ్మలు
  • నూనె – మూడు టేబుల్ స్పూన్స్
  • కారం – రెండు టీ స్పూన్స్
  • ఉప్పు – రుచికి స‌రిప‌డా
  • నీళ్లు – త‌గిన‌న్ని
  •  దాల్చిన చెక్క - చిన్న ముక్క
  • లవంగాలు - నాలుగు
  • ధనియాలు - అర టీ స్పూన్
  • గరంమసాలా - అర టీ స్పూన్
  • ఎండు కొబ్బరి - రెండు స్పూన్స్

తలకాయ కూర తయారీ విధానం

ముందుగా ఒక క‌ళాయిలో దాల్చిన చెక్క‌, ధ‌నియాలు, ఎండు కొబ్బ‌రి, వెల్లుల్లి రెబ్బలు వేసి దోరగా వేయించి పూర్తిగా చ‌ల్లారే వ‌ర‌కు ఉంచి మిక్సీలో వేసి మెత్త‌ని పొడిలా చేసుకోవాలి. త‌రువాత త‌ల‌కాయ మాంసాన్ని 2 నుండి 3 సార్లు శుభ్రంగా క‌డిగి నీళ్లు లేకుండా చేసుకోవాలి. త‌రువాత అందులో ప‌సుపు, ఉప్పు, కారం వేసి ముక్క‌లకు ప‌ట్టేలా బాగా క‌లుపుకోవాలి. ఇలా క‌లిపిన త‌రువాత మూత పెట్టి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి.

తరువాత ఒక పాన్‌లో నూనె వేసి కాగాక త‌రిగిన ఉల్లిపాయ‌ ముక్కలు, ప‌చ్చి మిర్చి, క‌రివేపాకు, కొద్దిగా త‌రిగిన కొత్తిమీర‌ను వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత క‌లిపి పెట్టుకున్న త‌ల‌కాయ మాంసాన్ని, గరంమసాలా వేసి క‌లిపి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.

త‌రువాత మూత తీసి త‌రిగిన ట‌మాటా ముక్క‌ల‌ను వేసి క‌లుపుకోవాలి. ట‌మాటా ముక్క‌లు ఉడికిన త‌రువాత, త‌గినన్ని నీళ్లు పోసి క‌లిపి మూత పెట్టి పది నిమిషాలపాటు ఉడికించుకోవాలి. త‌రువాత ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలా మిశ్ర‌మాన్ని వేసి క‌లిపి మ‌ర‌లా మూత పెట్టి మాంసాన్ని పూర్తిగా ఉడికించాలి. చివ‌ర‌గా త‌రిగిన కొత్తిమీరను వేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే యమ్మీ యమ్మీ తలకాయ కూర రెడీ అయినట్లే. వేడి వేడిగా రోటి, చపాతీ, అన్నం లోకి బాగుంటుంది.

తలకాయ కూరలో లభించే పోషకాలు

తలకాయ కూర డైటరీ ఫైబర్ యొక్క మంచి మూలం, ఫైబర్ జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది మరియు బరువు నిర్వహణలో సహాయపడుతుంది. ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. తలకాయ కూరలో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది, విటమిన్ ఎ దృష్టి మెరుగుపరచటానికి, రోగనిరోధక పనితీరు మరియు కణాల పెరుగుదలకు అవసరమైన కొవ్వులో కరిగే విటమిన్.

తలకాయ కూరలో విటమిన్ సి సంవృద్ధిగా లభిస్తుంది. విటమిన్ సి శరీరం యొక్క రోగనిరోధక పనితీరు మెరుగు పర్చటంలో, కొల్లాజెన్ ఉత్పత్తి మరియు ఐరన్ శోషణలో సహాయపడుతుంది. బలమైన ఎముకలు మరియు దంతాలకు కాల్షియం కీలకం.

తలకాయ కూర కాల్షియం యొక్క మంచి మూలం, ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. తలకాయ కూరలో ఐరన్ సంవృద్ధిగా ఉంటుంది, ఇది శరీరమంతా ఆక్సిజన్‌ను తీసుకువెళ్లడానికి మరియు రక్తహీనతను నివారించడానికి ఇది అవసరం. పొటాషియం అనేది ద్రవ సంతులనం, నరాల పనితీరు మరియు కండరాల సంకోచాన్ని నిర్వహించడంలో కీలకమైన ఖనిజం . తలకాయ కూర మంచి మొత్తంలో పొటాషియంను అందిస్తుంది.

Post Comment