ఆంధ్ర స్టైల్ బొబ్బట్లు రెసిపీ తయారీ విధానం : పురాణం పోలి రెసిపీ
భారతీయ వంటకాలు

ఆంధ్ర స్టైల్ బొబ్బట్లు రెసిపీ తయారీ విధానం : పురాణం పోలి రెసిపీ

రోజూ సాయంత్రం పూట బయట దొరికే ఒకే రకమైన స్నాక్స్ తిని విసుగుపుడుతోందా.. అయితే ఖచ్చితంగా ఈ రెసిపీ మీ కోసమే, ఎంచక్కా ఇంట్లోనే అదిరిపోయే నేతి బొబ్బట్లు ఎలా తయారుచేయాలి, తయారీకి కావలసిన పదార్దాలు ఏమిటో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.

నేతి బొబ్బట్లు తయారీకి కావాల్సిన పదార్దాలు

  • గోధుమ పిండి - రెండు కప్పులు
  • శెనగ పప్పు - అర కప్పు
  • నెయ్యి - అర కప్పు
  • బెల్లం తురుము - ముప్పావు కప్పు
  • యాలకుల పొడి - పావు టీ స్పూను
  • ఉప్పు - పావు టీస్పూను
  • నీళ్లు - సరిపడినన్ని

నేతి బొబ్బట్లు తయారీ విధానం

ఒక గిన్నెలో శెనగపప్పు తీసుకుని కొద్దిగా నీళ్లుపోసి అరగంట పాటూ నానబెట్టుకోవాలి. ఇప్పుడు గోధుమపిండిని తీసుకుని సరిపడా ఉప్పు, నీళ్లు వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండి కలిపేటప్పుడు అందులోనే సరిపడా నెయ్యి కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.చాలా మంది మైదా పిండిని వాడతారు. కానీ మైదాపిండి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకే నేను ఇక్కడ గోధుమ పిండిని వాడమని చెబుతున్నా. దీనివల్ల రుచిలో ఏమీ తేడా రాదు.

ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న శెనగపప్పును కుక్కర్లో వేసి కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. పప్పు ఉడికాకనీళ్లు వడకట్టేసి శెనగపప్పును మిక్సీజార్లో వేసి, బెల్లం తురుము కూడా వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయిలో సరిపడా నెయ్యి వేయాలి. నెయ్యి కాగాక అందులో మిక్సీలో రుబ్బుకున్న శనగ పప్పు, బెల్లం మిశ్రమాన్ని వేసి చిన్న మంట మీద కలుపుతూ ఉండాలి. అడుగు మాడకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు అందులో యాలకుల పొడి కూడా వేసి కలపాలి.

ఇప్పుడు మిశ్రమాన్ని పక్కన బెట్టి చల్లారనివ్వాలి. తరవాత చేతికి నెయ్యి రాసుకుని చపాతీ ముద్దని తీసుకుని పూరీలా ఒత్తాలి. ఒత్తాక మధ్యలో కాస్త శెనగపప్పు ముద్ద పెట్టి అన్ని వైపుల నుంచి మూసివేసి మళ్లీ ముద్దగా చుట్టుకోవాలి. ఇప్పుడు పాలిథీన్ కవర్ పై కాస్త నెయ్యి రాసి ఆ ముద్దను పూరీలా చిన్న సైజులో గుండ్రంగా ఒత్తుకోవాలి. మరో వైపు స్టవ్ మీద పెనం పెట్టి నెయ్యి రాయాలి. నెయ్యి వేడెక్కాక బొబ్బట్టును వేసి రెండు వైపులా సరిపడా కాల్చుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ నేతి బొబ్బట్లు రెడీ అయినట్లే.

నేతి బొబ్బట్లు తయారీకి కొన్ని చిట్కాలు

నేతి బొబ్బట్లు తయారీకి నాణ్యమైన గోధుమ పిండి లేదా మైదా పిండిని ఉపయోగించవచ్చు. తాజా నెయ్యిని ఉపయోగించండి. సాధ్యమైతే ఇంట్లో నెయ్యిని ఉపయోగించండి. శెనగపిండి అరగంట నుంచి గంటపాటు నానబెట్టుకోవాలి. నాణ్యమైన బెల్లంను ఉపయోగించండి. నేతి బొబ్బట్లు రెండువైపులా సరిగ్గా వేయించాలి.

నేతి బొబ్బట్లులో లభించే పోషకాలు

నేతి బొబ్బట్లు ఆరోగ్యకరమైన వంటకం. నేతి బొబ్బట్లులో ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది, ప్రోటీన్ కండరాల కణజాలాన్ని నిర్మించడానికి మరియు మరమ్మత్తు చేయడానికి అవసరం. నేతి బొబ్బట్లలో ఫైబర్ సంవృద్ధిగా లభిస్తుంది, ఇది జీర్ణక్రియను నియంత్రించడంలో మరియు గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. అదనంగా, నేతి బొబ్బట్లు కార్బోహైడ్రేట్లకు మంచి మూలం, కార్బోహైడ్రేట్స్ శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి.

నేతి బొబ్బట్లులోని ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నేతి బొబ్బట్లులోని ఫైబర్ రక్తప్రవాహంలోకి చక్కెర శోషణను నెమ్మదిస్తుంది, ఇది రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నేతి బొబ్బట్లులోని ఫైబర్ క్రమం తప్పకుండా ప్రేగు కదలికలను ప్రోత్సహించడం ద్వారా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

నేతి బొబ్బట్లులో విటమిన్ ఎ దృష్టి, రోగనిరోధక ఆరోగ్యం మరియు కణాల పెరుగుదలకు ముఖ్యమైనది. విటమిన్ సి: విటమిన్ సి అనేది యాంటీఆక్సిడెంట్, ఇది కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. ఐరన్: శరీరమంతా ఆక్సిజన్‌ను తీసుకువెళ్లడానికి ఐరన్ అవసరం. కాల్షియం: బలమైన ఎముకలు మరియు దంతాలకు కాల్షియం ముఖ్యం.

Post Comment