మొక్కజొన్న పులావ్ రెసిపీ తయారీ విధానం : స్వీట్ కార్న్ పులావ్
భారతీయ వంటకాలు

మొక్కజొన్న పులావ్ రెసిపీ తయారీ విధానం : స్వీట్ కార్న్ పులావ్

స్వీట్ కార్న్ తో చేసే వంటకాలలో..! స్వీట్ కార్న్ పులావ్ రెసిపీ ఎంత పాపులర్ రెసిపీనో మనకు తెలిసిందే. ఈ రెసిపీను చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. ఈ రోజు ఈ ఆర్టికల్ ద్వారా స్వీట్ కార్న్ పులావ్ రెసిపీ తయారీకి కావాల్సిన పదార్ధాలు, ఎలా తయారు చేసుకోవాలి అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మొక్కజొన్న పులావ్ తయారికి కావాల్సిన పదార్ధాలు

  • బాస్మతి రైస్ - మూడు కప్పులు
  • స్వీట్ కార్న్ - ఒక కప్పు
  • ఉల్లిపాయలు - రెండు
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్
  • పుదీనా, కొత్తిమీర - అరకప్పు
  • కొత్తిమీర - పావు కప్పు
  • పచ్చి మిర్చి - నాలుగు
  • లవంగాలు - మూడు
  • దాల్చినచెక్క - చిన్న ముక్క
  • బిర్యానీ ఆకులు - రెండు
  • యాలకులు - మూడు
  • జీలకర్ర - 1/4 స్పూన్
  • ధనియాల పొడి - 1/4 స్పూన్
  • గరంమసాలా - 1/2 స్పూన్
  • పసుపు - 1/4 స్పూన్
  • మిరియాలపొడి - 1/4 స్పూన్
  • ఉప్పు - సరిపడా
  • కారం - సరిపడా
  • నెయ్యి - రెండు టేబుల్ స్పూన్స్
  • నూనె - రెండు టేబుల్ స్పూన్స్
  • టొమాటో - ఒకటి.

మొక్కజొన్న పులావ్ తయారు చేసే విధానం

ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి ముప్పై నిమిషాలపాటు నానబెట్టుకోవాలి. తరవాత స్టవ్ ఆన్ చేసి ఒక లోతైన పాన్‌లో రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక లవంగాలు, యాలకులు, జీలకర్ర, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు వేసి రెండు నిముషాలు వేయించాలి.

రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అందులో వేసి ఐదు నిముషాలు మీడియం మంటపై వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తరవాత మొక్కజొన్న గింజలు వేసి మరో రెండు నిముషాలు వేయించాలి. ఇలా వేగుతున్న మిశ్రమంలో అల్లంవెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, టమాటో గుజ్జు వేసి పచ్చివాసన పోయేలా వేయించాలి.

ఇప్పుడు అందులో ధనియాలపొడి, మిరియాలపొడి, గరంమసాలా, సరిపడా కారం, పసుపు, సరిపడా ఉప్పు వేసి లో- ఫ్లేమ్ మీద రెండు నిముషాలు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తరువాత అన్నం ఉడికించుకోటానికి సరిపడా నీళ్లు పోసి (ఆరు కప్పలు), పైన కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఐదు నిముషాలు మరిగించాలి.

అలా మరుగుతున్న మిశ్రమంలో ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసి మూతపెట్టి మీడియం మంటపై ఉడికించుకోవాలి. నీరు దగ్గరగా అయ్యాక లో- ఫ్లేమ్ లో ఓ ఐదు నిముషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చివరిగా పైన పుదీనా,కొత్తిమీర, కొద్దిగా నెయ్యి వేసుకుంటే ఘుమ ఘుమలాడే మొక్కజొన్న పులావ్ రెడీ అయినట్లే.

మొక్కజొన్న పులావ్ తయారీకి కొన్ని చిట్కాలు

పులావ్‌లో క్యారెట్, బఠానీలు లేదా బంగాళాదుంపలు వంటి ఇతర కూరగాయలను కూడా జోడించవచ్చు . మీకు రిచ్ ఫ్లేవర్ కావాలంటే, వడ్డించే ముందు పులావ్‌లో వెన్న లేదా నెయ్యి జోడించవచ్చు, ఇది పులావ్ కి మరింత రుచిని అందిస్తుంది.

స్పైసియర్ పులావ్ కోసం, మీరు కారం పొడి లేదా కారపు మిరియాలు జోడించవచ్చు. వండడానికి ముందు బియ్యాన్ని కనీసం 30 నిమిషాలు నానబెట్టండి. అలా చేయటం వలన బియ్యం సమానంగా ఉడికి, అన్నం మెత్తగా మారకుండా చేస్తుంది. కార్న్ ను ఎక్కువసేపు వేయించకూడదు. ఎక్కువసేపు వేయిస్తే కార్న్ గింజలు గట్టిగా మారుతాయి.

మొక్కజొన్న పులావ్‌లో లభించే పోషకాలు

మొక్కజొన్న పులావ్ లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో కార్బోరేట్లు, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు మరియు మాంసకృత్తులు అధికంగా ఉంటాయి.

బియ్యంలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడతాయి. మొక్కజొన్నలో ప్రోటీన్ ఉండి, ఇది కండరాల పెరుగుదల మరియు పునరుద్ధరణకు దారితీస్తుంది. మొక్కజొన్నలో కొద్ది మొత్తంలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి, ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి.

మొక్కజొన్నలో విటమిన్ ఎ, సి మరియు కె పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి మరియు ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి. మొక్కజొన్నలో పొటాషియం, మెగ్నీషియం మరియు కాల్షియం వంటి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాల పనితీరును మరియు రక్తపోటును నియంత్రించడానికి ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.

Post Comment