అటుకుల పోహా తయారీ విధానం : అటుకుల ఉప్మా రెసిపీ
భారతీయ వంటకాలు

అటుకుల పోహా తయారీ విధానం : అటుకుల ఉప్మా రెసిపీ

బ్రేక్ ఫాస్ట్ రెసిపీస్ లలో చాలా రకాల వంటకాలు ఉన్నాయి. అందులో తక్కువ సమయంలో, చాలా సులభంగా తయారు చేసుకునే అటుకుల పోహా రెసిపీ తయారీ గూర్చి, కావాల్సిన పదార్దాలు గూర్చి ఈ ఆర్టికల్ యందు తెలుసుకుందాం.

అటుకుల పోహా తయారీకి కావాల్సిన పదార్దాలు

  • అటుకులు - ఒక కప్పు
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • కొత్తిమీర - రెండు రెమ్మలు
  • నిమ్మరసం -2 టేబుల్ స్పూన్స్
  • ఆవాలు - అర టీ స్పూన్
  • శెనగపప్పు - ఒక టీ స్పూన్
  • జీలకర్ర -1/2 టీస్పూన్
  • వెల్లుల్లి ముక్కలు -1/2 టీస్పూన్
  • పసుపు -1/4 టీస్పూన్
  • పచ్చిమిర్చి - మూడు
  • వేరుశెనగలు -2 టేబుల్ స్పూన్స్
  • పెద్ద ఉల్లిపాయ- ఒకటి
  • అల్లం - చిన్న ముక్క
  • పచ్చి బఠాణి - కొద్దిగా
  • ఉప్పు - తగినంత
  • నూనె - రెండు టేబుల్ స్పూన్స్

అటుకుల పోహా తయారీ విధానం

ముందుగా అటుకులను నీటిలో కడిగి ఆ తర్వాత పూర్తిగా నీరు లేకుండా వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ ఆన్ చేసుకుని కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, వేరుశెనగ పప్పు, శెనగపప్పు, పచ్చిమిర్చి, పసుపు, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు వేసి చిటపటలాడేలా వేయించాలి.

ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉలిపాయ ముక్కలు, పచ్చి బఠాణిలు వేసి కాసేపు వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత, కడిగి పెట్టుకున్న అటుకులను అందులో వేసి మొత్తం కలిసేలా బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత సరిపడా ఉప్పు వేసి, మొత్తం అటుకులలో కలిసిపోయేంతవరకు కలుపుతునే ఉండాలి. అంతే రుచికరమైన పోహా రెడీ అయినట్లే. చివర్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సూపర్ ఉంటుంది.

పోహా మరింత రుచిగా చేయాలనుకుంటే టమోటా మరియు మిక్చర్ వేసుకుంటే కరకరలాడుతూ మరింత టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు నేర్చుకుని ఈ రుచికరమైన పోహాను రెడీ చేసి మీ ఇంట్లోవాళ్ళకి సర్వ్ చేయండి.

అటుకుల పోహాలో లభించే పోషకాలు

అటుకుల పోహా ఆరోగ్యకరమైన మరియు అధిక పోషకాల వంటకం. పోహలో కార్బోహైడ్రేట్ల, ఐరన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు మరియు అవసరమైన విటమిన్ల పుష్కలంగా లభిస్తాయి. పోహా గ్లూటెన్ రహితం . మధుమేహం, చర్మ, గుండె సమస్యలు ఉన్నవారికి ఇది మంచి పోషకాహారం.

పోహా అనేది డైటరీ ఫైబర్ ప్రోటీన్, లుటీన్, ఫాస్పరస్, మెగ్నీషియం, కాపర్ మరియు పాంతోతేనిక్ యాసిడ్ యొక్క మంచి మూలం మరియు విటమిన్ సి, విటమిన్ డి, మాంగనీస్ మరియు విటమిన్ ఇ సంవృద్ధిగా లభిస్తాయి. ఇవి గుండె జబ్బులు, జీర్ణ సమస్యలు, కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు మరియు క్యాన్సర్ నుండి పోహా సహాయపడుతుంది.

Post Comment