మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ తయారు చేసే విధానం : రెస్టారెంట్ స్టైల్
భారతీయ వంటకాలు

మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ తయారు చేసే విధానం : రెస్టారెంట్ స్టైల్

మంచి రుచికరమైన రెసిపీ తయారుచేసి పెడితే పిల్లలు నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఈ ఆర్టికల్ ద్వారా అధిక పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలున్న మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ను వెజిటబుల్స్, ఎగ్స్ కాంబినేషన్లో ఎలా తయారు చేయాలి, కావాల్సిన పదార్ధాలు ఏమిటో తెలుసుకుందాం. పోషక విలువలు అధికంగా ఉండే మష్రుమ్, కోడిగుడ్డుతో  ఫ్రైడ్ రైస్ రెసిపీ నేర్చుకుని మీరు ట్రై చేయండి.

మష్రూమ్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావలిసిన పదార్ధాలు

  • బాస్మతి రైస్ - నాలుగు కప్పులు
  • మష్రూమ్ - 200 గ్రా.
  • ఎగ్స్ - రెండు
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - రెండు టీ స్పూన్స్
  • కాప్సికమ్ - రెండు
  • ఉల్లిపాయలు - రెండు
  • గ్రీన్ పీస్ - పిడికెడు
  • మిరియాల పొడి - ఒక టీ స్పూన్
  • కారం - సరిపడా
  • సొయా సాస్ - ఒక టీ స్పూన్
  • నూనె - నాలుగు టేబుల్ స్పూన్
  • ఉప్పు - సరిపడా
  • నెయ్యి - ఒక టేబుల్ స్పూన్
  • జీలకర్ర - ఒక టీ స్పూన్
  • కొత్తిమీర - అర కప్పు
  • చిల్లి సాస్ - ఒక టీ స్పూన్

మష్రూమ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం

ముందుగా రైస్ శుభ్రంగా కడిగి పలుకుగా వండుకోవాలి. అన్నం ఉడికిన తర్వాత పక్కనపెట్టి చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి పాన్ తీసుకుని టేబుల్ స్పూన్ నూనె వేయాలి. నూనె వేడయ్యాక గుడ్లు పగలగొట్టి ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. తరవాత అదే పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి మష్రూమ్ ముక్కలు వేసుకుని, మష్రూమ్ లో నీరు ఆవిరి అయ్యేంత వరకు వేయించి తీసి పక్కనబెట్టుకోవాలి.

ఇప్పుడు అదే పాన్‌లో మిగిలిన ఆయిల్ వేసి కాగాక  జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నిముషాలు వేయించాలి. తర్వాత గ్రీన్ పీస్, సన్నగా తరిగిన కాప్సికం ముక్కలు వేసి మెత్తబడే వరకు మరో ఐదునిమిషాలు వేయించాలి.

ఐదు నిమిషాలు వేగిన తర్వాత అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయేవరకు రెండు నుంచి మూడు నిమిషాలపాటు వేయించాలి. ఇప్పుడు అందులో సోయాసాస్, చిల్లీసాస్, మిరియాలపొడి, కారం, రుచికి తగినంత ఉప్పు వేసి ఓ నిమిషాలపాటు వేయించుకోవాలి.

చివరిగా ఇందులో ముందుగా వేయించిన ఎగ్ ఫ్రై మిశ్రమాన్ని కూడా వేసి, తర్వాత అన్నం కలిపి మీడియం మంటపై మొత్తంగా కలిసేలా కలుపుకోవాలి. చివరిగా పైన నెయ్యి, కొత్తిమీర తరుగు వేసి మరోసారి బాగా కలిపి వేడి వేడిగా సర్వ్ చేసుకోవటమే.

మష్రూమ్ ఫ్రైడ్ రైస్ తయారీకి కొన్ని చిట్కాలు

ఫ్రైడ్ రైస్ కోసం బాస్మతి లేదా సన్న బియ్యాన్ని తీసుకోవాలి. అన్నం వండుకునే ముందు ఇరవై నిమిషాలపాటూ నానబెట్టుకోవాలి. అన్నం పలుకుగా ఉడికించుకోవాలి, అన్నం మెత్తగా ఉడికిస్తే ఫ్రైడ్ రైస్ కలపటానికి బాగోదు.

ఫ్రైడ్ రైస్ రుచిగా కావాలనుకుంటే మష్రూమ్ తోపాటు నచ్చిన కూరగాయలను జోడించుకోవాలి, బీట్రూట్, క్యాబేజి. క్యారెట్ మొదలైనవి. ఫ్రైడ్ రైస్ రంగు, రుచి కోసం పెప్పర్, వెనిగర్, సొయా సాస్, చిల్లీసాస్ వంటివి కలుపుకోవాలి.

మష్రూమ్ ఫ్రైడ్ రైస్‌లో పోషక విలువలు

మష్రూమ్ లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర నిర్మాణానికి మరియు మరమ్మతుకు అవసరమైన  పోషకంగా ఉపయోగపడతాయి, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది. పుట్టగొడుగులు కడుపులో యాసిడ్ ఉత్పత్తిని తగ్గించడంలో సహాయపడతాయని సూచిస్తున్నాయి, ఇది యాసిడ్ రిఫ్లక్స్ మరియు సంబంధిత లక్షణాల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది.

మష్రూమ్ ఫ్రైడ్ రైస్ లో ఫైబర్ సంవృద్ధిగా లభిస్తుంది. ఇది జీరక్రియను ఆరోగ్యాంగా ఉంచటంలో సహాయపడుతుంది, అదేవిధంగా మలబద్దకం నివారించటానికి సహాయపడుతుంది. ఫైబర్ కొలస్ట్రాల్ ను తగ్గిస్తుంది మరియు రక్తంలో చక్కర స్థాయిలను నిర్వహించటానికి కూడా సహాయపడుతుంది.

మష్రూమ్ ఫ్రైడ్ రైస్ లో విటమిన్ సి లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచటంలో సహాయపడే పోషకం. ఇందులో క్యాలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ,  నాణ్యమైన కొవ్వులు ఉంటాయి మరియు కొలెస్ట్రాల్ ఉండదు. మష్రూమ్ లో ఒమేగా-3 సంవృద్ధిగా ఉంటుంది.

పుట్టగొడుగులలో B విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి , అవి: రిబోఫ్లావిన్ లేదా B-2. ఫోలేట్, లేదా B-9. థయామిన్, లేదా B-1. మష్రూమ్ లో ఖనిజాలు మరియు విటమిన్లు ఉంటాయి, వీటిలో రాగి, పొటాషియం, మెగ్నీషియం, జింక్ మరియు ఫోలేట్ వంటి అనేక B విటమిన్లు ఉంటాయి.

Post Comment