నువ్వుల లడ్డు తయారీ విధానం : పోషకాలు, ప్రయోజనాలు
భారతీయ వంటకాలు

నువ్వుల లడ్డు తయారీ విధానం : పోషకాలు, ప్రయోజనాలు

రోజూ సాయంత్రం ఒకే రకమైన స్నాక్స్ లేదా స్వీట్స్ తిని తిని మీ ఇంట్లో వాళ్ళు బోరుకొడుతుంది అంటున్నారా.. అయితే ఈ రెసిపీ ఖచ్చితంగా మీ కోసమే, ఒక్కసారి నేర్చుకుని ట్రై చేయండి.ఈ ఆర్టికల్ యందు పల్లీల కాంబినేషన్ లో అదిరిపోయే నువ్వుల లడ్డు ఎలా తయారుచేయాలి, తయారీకి కావాల్సిన పదార్దాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

నువ్వుల లడ్డు తయారీకి కావాల్సిన పదార్దాలు

  • ప‌ల్లీలు – అర కప్పు
  • నువ్వులు – రెండు క‌ప్పులు
  • బెల్లం తురుము –రెండు క‌ప్పులు
  • యాల‌కులు – నాలుగు
  • నెయ్యి –  సరిపడా

నువ్వుల లడ్డు తయారీ విధానం

ముందుగా క‌ళాయిలో ప‌ల్లీలు వేసి తక్కువ మంట‌పై మాడిపోకుండా దోర‌గా వేయించాలి. త‌రువాత వాటిని ప్లేట్ లో వేసి పొట్టును తీసేసి ప‌క్క‌కు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే క‌ళాయిలో నువ్వుల‌ను కూడా వేసి దోర‌గా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరవాత ఒక మిక్సీ జార్ తీసుకుని వేయించి ప‌ల్లీలు, బెల్లం తురుము, యాలకుల పొడి వేసి మ‌రీ మెత్త‌గా కాకుండా కొద్దిగాగరుకుగా ఉండేలా మిక్సీ ప‌ట్టుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.

ఇప్పుడు మిక్సీ పట్టిన మిశ్రమంలో ముందుగా వేయించుకున్న నువ్వులు వేసి, మొత్తం క‌లిసేలా బాగా క‌లుపుకోవాలి. ఆ త‌రువాత కొద్దిగా నెయ్యి కూడా వేసి ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా బెల్లం నువ్వుల మిశ్రమాన్ని తీసుకుని కావాల్సిన సైజులో ల‌డ్డూలుగా చుట్టుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే ప‌ల్లి నువ్వుల ల‌డ్డూ త‌యారవుతుంది. ఈ లడ్డులు పిల్ల‌ల‌కు, పెద్దలకు మంచి పౌష్ఠిక ఆహరం.

నువ్వుల లడ్డులో లభించే పోషకాలు, ప్రయోజనాలు

నువ్వులలో ప్రోటీన్లు , విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ప్రొటీన్‌తో పాటు బి విటమిన్లు థయామిన్, నియాసిన్, విటమిన్ బి6 మరియు ఫోలేట్ ఆకట్టుకునే మొత్తంలో ఉంటాయి. ఇవి శక్తిని అందించడంతో పాటు, ప్రోటీన్ శరీరం కండరాలతో సహా ఆరోగ్యకరమైన కణజాలాలను నిర్వహించడానికి మరియు నిర్మించడంలో సహాయపడుతుంది.

నువ్వులు ఆరోగ్యకరమైన అసంతృప్త కొవ్వులతో కూడిన పోషకాహారంలో పుష్కలంగా ఉంటాయి, ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నువ్వులులోని మెగ్నీషియం మరియు కాల్షియం కంటెంట్ ఎముకల ఆరోగ్యాన్ని మరియు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, ఇది శక్తిని ఇస్తుంది మరియు అలసట మరియు రక్తహీనత వంటి సమస్యలకు సహాయపడుతుంది. లడ్డూలోని యాంటీ ఆక్సిడెంట్లు సెల్ డ్యామేజ్‌తో పోరాడటానికి మరియు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

కేవలం 100 గ్రాముల నువ్వులు 975 మిల్లీగ్రాముల కాల్షియంను అందిస్తాయి .నువ్వుల గింజలు ఇనుము, రాగి, జింక్, సెలీనియం మరియు విటమిన్ B6, ఫోలేట్ మరియు నల్ల నువ్వులను క్రమం తప్పకుండా చేర్చడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు మెరుగుపడతాయని మరియు ఇనుము శోషణను ప్రోత్సహిస్తుందని నిరూపించబడింది .

Post Comment