దోసకాయ పచ్చడి తయారీ విధానం : దోసకాయ పోషకాలు, ప్రయోజనాలు
భారతీయ వంటకాలు

దోసకాయ పచ్చడి తయారీ విధానం : దోసకాయ పోషకాలు, ప్రయోజనాలు

రోజూ పొద్దున్న ఇంట్లో చేసుకునే బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీలు ఎంత అవసరం అనేది మన అందరికి తెలుసు. ముఖ్యంగా టిఫిన్స్ ఇడ్లీ, దోస,పూరి మరియు వడ వంటి వాటికి చట్నీలు తప్పని సరిగా ఉండాలి. అందుకని ఈ ఆర్టికల్ యందు అదిరిపోయే దొసకాయ పచ్చడి ఎలా తయారు చేయాలి, పచ్చడి తయారీకి కావాల్సిన పదార్దాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి.

దోసకాయ పచ్చడికి కావాల్సిన పదార్దాలు

  • దోస‌కాయ – ఒకటి
  • ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు – అర క‌ప్పు
  • ప‌చ్చిమిర్చి –  నాలుగు
  • జీల‌క‌ర్ర – అర టీ స్పూన్
  • ఉప్పు – త‌గింన‌త‌
  • పసుపు - పావు స్పూన్
  • చింతపండు – ఒకబొట్ట
  • టమాటా - ఒకటి
  • నూనె – రెండు టేబుల్ స్పూన్
  • శ‌న‌గ‌పప్పు – ఒక టీ స్పూన్
  • మిన‌ప‌ప్పు – ఒక టీ స్పూన్
  • ఆవాలు - అర టీ స్పూన్
  • జీల‌క‌ర్ర – అర టీ స్పూన్
  • ఎండుమిర్చి – రెండు
  • క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు

దోసకాయ పచ్చడి తయారీ విధానం

ముందుగా దోసకాయ తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయిలో వేడి చేయాలి. నూనె వేడయ్యాక అందులో ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, జీల‌క‌ర్ర‌, చింతపండు వేసి రెండు నిముషాలు వేయించాలి. ఇవి వేగిన తరవాత అందులో టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యేవరకు వేయించాలి.

టమాటాలు వేగినతరవాత అందులో దోసకాయ ముక్కలు, కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు వేసి ఓ ఐదు నిముషాలు వేయించుకోవాలి. వేయించిన మిశ్రమాన్నీ పక్కనబెట్టి చల్లర్చుకోవాలి. చల్లారిన తరవాత మిక్సిజార్ తీసుకుని అందులో వేయించుకున్న మిశ్రమాన్ని వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుకుగా మిక్సీ ప‌ట్టుకోవాలి.

త‌రువాత పోపు కోసం క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, ఎండుమిర్చి, శనగపప్పు, మినపగుళ్ళు, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి పోపు బాగా వేయించాలి. తాళింపు చ‌క్క‌గా వేగిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి, ఇప్పుడు ఈ తాళింపును ముందుగా త‌యారు చేసుకున్న ప‌చ్చ‌డిలో వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అంతే టేస్టీ టేస్టీగా ఉండే దోస‌కాయ కొబ్బ‌రి ప‌చ్చ‌డి త‌యారవుతుంది. దీనిని అన్నంతో పాటు అల్పాహారాల‌తో కూడా తిన‌వ‌చ్చు.

దోసకాయ పచ్చడిలో లభించే పోషకాలు, ప్రయోజనాలు

దోసకాయ పచ్చడి మంచి రుచితో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. దోసకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది మరియు కేవలం ఒక దోసకాయలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ డి, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి3, విటమిన్ బి5, విటమిన్ బి6, ఫోలిక్ యాసిడ్, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం వంటి అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

కేవలం ఒక కప్పు దోసకాయ ముక్కలలో, మీరు రోజుకు అవసరమైన విటమిన్ కెలో 14% నుండి 19% వరకు పొందుతారు. మీరు రాగి, భాస్వరం, పొటాషియం మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలతో పాటు విటమిన్లు B మరియు Cలను కూడా పొందుతారు.

దోసకాయ అధిక నీటి శాతంతో కూడిన పోషకమైన పండు. దోసకాయ తినడం వల్ల బ్లడ్ షుగర్ తగ్గుతుంది, మలబద్ధకాన్ని నివారించవచ్చు మరియు బరువు తగ్గడానికి తోడ్పడుతుంది . దోసకాయ యొక్క ఆరోగ్య ప్రయోజనాలను పెంచుకోవడానికి, పై తొక్కను కూడా తినండి.

Post Comment