ఓట్స్ ఉప్మా తయారీ విధానం : బ్రేక్ ఫాస్ట్ ఓట్స్ ఉప్మా రెసిపీ
భారతీయ వంటకాలు

ఓట్స్ ఉప్మా తయారీ విధానం : బ్రేక్ ఫాస్ట్ ఓట్స్ ఉప్మా రెసిపీ

ఈ ఆర్టికల్ యందు ఎంచక్కా ఇంట్లోనే ఓట్స్ మరియు వెజిటబుల్స్ కాంబినేషన్లో ఓట్స్ ఉప్మా తయారీకి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గూర్చి తెలుసుకుందాం.

ఓట్స్ ఉప్మా తయారీకి కావాల్సిన పదార్దాలు

  • ఇన్‌స్టంట్ ఓట్స్ - ఒక కప్పు
  • నూనె  - రెండు స్పూన్స్
  • ఉల్లిపాయలు - ఒకటి
  • క్యారెట్ - ఒకటి
  • బీన్స్ - ఒక పది
  • పచ్చి బఠానీలు - సగం పిడికెడు
  • కరివేపాకు - రెండు రెమ్మలు
  • ఆవాలు - ఒక టీస్పూన్
  • జీలకర్ర  - ఒక టీస్పూన్
  • శనగపప్పు - ఒక టీస్పూన్
  • మినపపప్పు - ఒక స్పూన్
  • జీడిపప్పు - తగినన్ని
  • అల్లం - చిన్న ముక్క
  • పచ్చిమిర్చి - రెండు
  • కొత్తిమీర - కొద్దిగా
  • ఉప్పు - తగినంత

ఓట్స్ ఉప్మా తయారీ విధానం

ముందుగా పాన్‌లో కొద్దిగా నూనె వేసి, వేడయ్యాక ఇన్‌స్టంట్ ఓట్స్ వేసి దోరగా వేయించుకోవాలి. ఉల్లి, క్యారెట్, బీన్స్ చిన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్‌లో మరికొద్దిగా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, శనగ పప్పు, మినపపప్పు, జీడిపప్పు ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించుకోవాలి. పోపు మిశ్రమం బాగా వేగాక, ఆపై సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి.

తరవాత అందులో సన్నగా తరిగిన క్యారెట్లు, సన్నగా తరిగిన బీన్స్, పచ్చి బఠానీలు, రుచికి సరిపడా ఉప్పు వేసి మరో ఐదు నిముషాలు పాటు వేయించుకోవాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి ఎసరు బాగా మరిగించుకోవాలి. ఎసరు మరిగిన తర్వాత అందులో ముందుగా వేయించుకున్న ఓట్స్ వేసి, మూతపెట్టి ఆవిరి మీద ఉప్మా ఉడికించుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ ఓట్స్ ఉప్మా రెడీ అయినట్లే. చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని, నిమ్మరసం పిండుకొని తింటే అద్భుతంగా ఉంటుంది.

ఓట్స్ ఉప్మాలో లభించే పోషకాలు, ప్రయోజనాలు

ఒక మీడియం కప్పు ఓట్స్ ఉప్మాలో 248 కిలో కేలరీలు ఉంటాయి. ఇందులో 45% కార్బోహైడ్రేట్లు, 10% ప్రోటీన్ మరియు 45% కొవ్వు ఉంటుంది . ఓట్స్ ఉప్మా ప్రోటీన్, విటమిన్ డి, లుటిన్, ఆల్ఫా-కెరోటిన్, ఫాస్పరస్, మెగ్నీషియం, కాపర్, థయామిన్ మరియు డైటరీ ఫైబర్, విటమిన్ సి, బీటా కెరోటిన్, సెలీనియం మరియు విటమిన్ ఇ వంటి పోషకాలు సంవృద్ధిగా లభిస్తాయి.

ఓట్‌మీల్‌లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిలో బరువు తగ్గడం, రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం మరియు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది . వోట్స్ భూమిపై ఆరోగ్యకరమైన ధాన్యాలలో ఒకటి. అవి గ్లూటెన్ రహిత తృణధాన్యాలు మరియు ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్ల యొక్క గొప్ప మూలం.

Post Comment