వెజిటబుల్ రాగి ఇడ్లి తయారీ విధానం : రాగి ఇడ్లీ రెసిపీ
భారతీయ వంటకాలు

వెజిటబుల్ రాగి ఇడ్లి తయారీ విధానం : రాగి ఇడ్లీ రెసిపీ

ఈ ఆర్టికల్ యందు టేస్టీ టేస్టీగా రాగి పిండి మరియు వెజిటబుల్స్ కాంబినేషన్లో చేసే వెజిటబుల్ రాగి ఇడ్లి రెసిపీ తయారీ విధానం, రాగి ఇడ్లి తయారీకి కావాల్సిన పదర్ధాలు గూర్చి తెలుసుకుందాం. మీరు నేర్చుకుని ట్రై చేసి రుచి చూడండి.

వెజిటబుల్ రాగి ఇడ్లి తయారీకి కావాల్సిన పదార్దాలు

  • రాగిపిండి – ఒక క‌ప్పు
  • బొంబాయి ర‌వ్వ – ఒక క‌ప్పు
  • పెరుగు – ఒక క‌ప్పు
  • ఉప్పు – త‌గినంత‌
  • వంట‌సోడా – పావు టీ స్పూన్
  • క్యాప్సికం – ఒక‌టి
  • త‌రిగిన క్యారెట్ – ఒకటి
  • కొత్తిమీర – కొద్దిగా
  • నూనె -ఒక టేబుల్ స్పూన్
  • ఆవాలు - అర టీ స్పూన్
  • క‌రివేపాకు – ఒక రెమ్మ‌

వెజిటబుల్ రాగి ఇడ్లి తయారీ విధానం

ముందుగా ఒక గిన్నెలో రాగిపిండిని తీసుకుని. త‌రువాత అందులో ర‌వ్వ, పెరుగు, సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. త‌రువాత దీనిని ఒక అర‌గంట పాటు పక్కనబెట్టి నానబెట్టుకోవాలి. అరగంట త‌రువాత ఇందులో వంట‌సోడా, చిన్న తరిగిన క్యాప్సికం ముక్క‌లు, కొత్తిమీర‌, క్యారెట్ తురుము వేసి కలుపుకోవాలి.

త‌రువాత స్టవ్ ఆన్ చేసి క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, శనగపప్పు, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ఈ తాళింపును ముందుగా కలుపుకున్న పిండి మిశ్రమంలో వేసి, అలాగే కొద్దిగా నీళ్లు పోసి ఇడ్లి పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ కుక్క‌ర్ లో తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి వేడి చేయాలి.

నీళ్లు మరిగేలోపు లోపు ఇడ్లి ప్లేట్ ల‌ల్లో  రాగి రుబ్బును  వేసుకోవాలి. త‌రువాత ఈ ప్లేట్ లను కుక్క‌ర్ లో పెట్టి మూత పెట్టాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై పదిహేను నుంచి ఇరవై నిమిషాలపాటు పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ వెజిటబుల్ రాగి ఇడ్లి రెడీ అయినట్లే.

వెజిటబుల్ రాగి ఇడ్లి లో లభించే పోషకాలు

రాగి ఇడ్లీ కేలరీలు. ఒక చిన్న ముక్క (30 గ్రాములు) రాగి ఇడ్లీలో 52 కిలో కేలరీలు ఉంటాయి. ఇందులో 82% కార్బోహైడ్రేట్‌లు, 12% ప్రోటీన్ మరియు 6% కొవ్వు ఉన్నాయి. రాగి ఇడ్లీ డైటరీ ఫైబర్, ప్రొటీన్, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, భాస్వరం, మెగ్నీషియం, కాపర్, సెలీనియం, థయామిన్ మరియు మాంగనీస్ మరియు విటమిన్ డి వంటి పోషకాలు సంవృద్ధిగా లభిస్తాయి.

రాగుల్లో కొలెస్ట్రాల్ మరియు సోడియం ఉండవు కాబట్టి, గుండె జబ్బులతో బాధపడేవారికి ఇది ప్రధాన ఆహారంగా ఉపయోగపడుతుంది . రాగి అనేది డైటరీ ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు మరియు ప్రొటీన్ల యొక్క గొప్ప మూలం, ఇది మిమ్మల్ని సంతృప్తిగా ఉంచుతుంది మరియు గ్యాస్ట్రిక్ ఖాళీ సమయాన్ని ఆలస్యం చేస్తుంది, తద్వారా మొత్తం కేలరీల తీసుకోవడం తగ్గించడానికి మరియు బరువు తగ్గడాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా, ఇది రక్తంలో చక్కెర స్పైక్‌లను నియంత్రించడంలో మరియు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా సహాయపడుతుంది.

Post Comment