ఉల్లిపాయ చట్నీ తయారీ విధానం : పోషకాలు, ప్రయోజనాలు
భారతీయ వంటకాలు

ఉల్లిపాయ చట్నీ తయారీ విధానం : పోషకాలు, ప్రయోజనాలు

బ్రేక్ ఫాస్ట్ రెసిపీస్ లో చట్నీలు చాలా ఫేమస్ అని మనకు తెలుసు. ముఖ్యంగా టిఫిన్స్ ఇడ్లీ, దోస, మరియు వడ వంటి వాటికి చట్నీలు తప్పని సరిగా ఉండాలి. ఈ ఆర్టికల్ యందు అదిరిపోయే ఉల్లిపాయ చట్నీ ఎలా తయారు చేయాలి, చట్నీ తయారీకి కావాల్సిన పదార్దాలు ఏమిటో తెలుసుకుందాం.

ఉల్లిపాయ చట్నీ తయారీకి కావాల్సిన పదార్దాలు

  • ఉల్లిపాయలు - నాలుగు
  • ట‌మాటాలు - ఒకటి
  •  ప‌చ్చి మిర్చి - రెండు
  • ఎండు మిర్చి - రెండు
  • ఆవాలు - 1 టీస్పూన్‌
  • మిన‌ప ప‌ప్పు - 1 టీస్పూన్‌
  • శెనగపప్పు - ఒక స్పూన్
  • మెంతులు - పావు స్పూన్
  • ధ‌నియాలు - 1 టీస్పూన్‌
  • జీల‌క‌ర్ర - 1 టీస్పూన్‌
  • వెల్లుల్లి రెబ్బ - నాలుగు
  • చింత పండు - కొద్దిగా ( చిన్న బొట్ట )
  • నూనె - రెండు లేదా స్పూన్స్
  • ఉప్పు - స‌రిప‌డా
  • క‌రివేపాకు - రెండు రెమ్మలు

ఉలిపాయ చట్నీ తయారీ విధానం

ముందుగా ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, టమాటాలను చిన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్‌లో నూనె వేయాలి. నూనె వేడయ్యాక అందులో మెంతులు, ధ‌నియాలు, జీల‌క‌ర్ర‌, వెల్లుల్లి ఒక‌దాని త‌రువాత ఒక‌టి వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చి మిర్చి వేయాలి. ఇవి వేగాక అందులో ఉల్లిపాయ ముక్క‌లు వేసి బాగా వేయించుకోవాలి.

ఉల్లిపాయముక్కలు బాగా వేగిన తరవాత, ఆపై అందులో ట‌మాటా ముక్కలు కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. ఇలా వేగిన త‌రువాత పక్కనబెట్టి చ‌ల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి కొద్దిగా చింత‌పండు, సరిపడా ఉప్పు కూడా వేసి మెత్త‌గా రుబ్బుకోవాలి. మీకు చట్నీ కొంచెం పల్చగా కావాలనుకుంటే కొద్దిగా వేడి నీళ్లు వేసి కలుపుకోవాలి.

ఇప్పుడు పోపుకోసం కళాయిలో నూనె వేసి, నూనె వేడయ్యాక ఆవాలు, మిన‌ప ప‌ప్పు, శెనగపప్పు, ఎండు మిర్చి, క‌రివేపాకుతో తాలింపు వేయాలి. తాళింపు బాగా వేగాక ముందుగా రుబ్బుకున్న మిశ్రమంలో వేసి కలుపుకుంటే సరిపోతుంది. ఘుమఘుమలాడే ఉల్లి చట్నీ రెడీ అయినట్లే. ఇది పెస‌ర‌ట్టు, దోశ‌, ఇడ్లీ, ఊత‌ప్పం వంటి టిఫిన్ల‌లోకి చాలా టేస్టీగా ఉంటుంది.

ఉల్లిపాయ చట్నీలో లభించే పోషకాలు, ప్రయోజనాలు

ఉల్లిపాయలు వివిధ రకాల పోషకాలను అందిస్తాయి, ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ B6, ఫోలేట్, పొటాషియం మరియు మాంగనీస్ . కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, కాపర్, సెలీనియం, కోలిన్ మరియు ఇతర విటమిన్లు మరియు ఖనిజాలు సంవృద్ధిగా లభిస్తాయి.

ఉల్లిపాయ చట్నీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి మరియు ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. ఉల్లిపాయలలోని యాంటీఆక్సిడెంట్లు మరియు సల్ఫర్ సమ్మేళనాలు మరియు పసుపు వంటివి మంటను తగ్గించడంలో సహాయపడతాయి, ఇది వివిధ దీర్ఘకాలిక వ్యాధులకు దోహదం చేస్తుంది.

ఉల్లిపాయ చట్నీలోని ఫైబర్ కంటెంట్ క్రమంగా ప్రేగు కదలికలను ప్రోత్సహించడంలో మరియు ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఉల్లిపాయలలోని యాంటీఆక్సిడెంట్లు మరియు సల్ఫర్ సమ్మేళనాలు LDL (చెడు) కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి మరియు HDL (మంచి) కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ఉల్లిపాయ చట్నీలోని ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెరను శోషించడాన్ని నెమ్మదిస్తుంది, రక్తంలో చక్కెర నియంత్రణలో సహాయపడుతుంది. ఉల్లిపాయలు క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉండే సమ్మేళనాలను కలిగి ఉంటాయి. సాధారణ ఉల్లిపాయల వినియోగం కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంతో ముడిపడి ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

ఉల్లిపాయ చట్నీలో కీలకమైన పదార్ధమైన చింతపండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది ఇనుము శోషణను పెంచుతుంది. శ్వాసకోశ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఉల్లిపాయలు యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి జలుబు వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి.

Post Comment