కాకరకాయ కూర తయారీవిధానం : పోషకాలు, ప్రయోజనాలు
భారతీయ వంటకాలు

కాకరకాయ కూర తయారీవిధానం : పోషకాలు, ప్రయోజనాలు

రోజూ ఇంట్లో ఒకే రకమైన వంటలు అని, ఏదైనా కొత్తగా నేర్చుకుని ట్రై చేయాలనిపిస్తుందా.. అయితే ఖచ్చితంగా ఈ రెసిపీ మీ కోసమే. ఈ ఆర్టికల్ యందు అదిరిపోయే కాకరకాయ గ్రేవీ కూర రెసిపీ ఎలా తయారుచేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

కాకరకాయ కూర తయారీకి కావాల్సిన పదార్దాలు

  • కాకరకాయలు - నాలుగు
  • ఉల్లిపాయలు - రెండు
  • చింతపండు - ఒక బొట్ట
  • టమాటా - ఒకటి
  • పచ్చి మర్చి - రెండు
  • కారం - ఒక స్పూన్
  • ఉప్పు - తగినంత
  • పసుపు - అర టీ స్పూన్
  • జీలకర్ర - అర టీ స్పూన్
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూన్
  • నువ్వుల పొడి - అర స్పూన్
  • దనియాల పొడి - అర స్పూన్
  • ఒక టేబుల్ స్పూన్ చక్కెర లేదా బెల్లం
  • కరివేపాకు - రెండు రెమ్మలు

కాకరకాయ కూర తయారీ విధానం

ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడిగి చక్రాల్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. వీటిని ఒక బౌల్ లో తీస్కొని పసుపు, ఉప్పు వేసి కలిపి 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలు చిన్నగా తరిగి పెట్టుకోవాలి. నువ్వులు కూడా పొడి చేసి పెట్టుకోవాలి. టొమాటోలు గుజ్జుచేసి పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్‌లో సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, ఉల్లిపాయముక్కలు వేసుకొని బాగా వేయించాలి. ఆ తర్వాత అందులో పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు కూడా వేసి పచ్చి వాసనపోయేలా మూడు నుంచి ఐదు నిముషాలు వేయించుకోవాలి. అనంతరం ఆ మిశ్రమంలో కాకరకాయ ముక్కలు వేసుకొని బాగా కలపాలి.

ఆ తర్వాత ఒక పదినిషాలు మంటను సిమ్ లో పెట్టి మూత పెట్టి మగ్గనివ్వాలి. కాకరకాయ ముక్కలు బాగా మగ్గి దగ్గరగా అయ్యాక అందులో టమాటో గుజ్జు, సరిపడా కారం, ఉప్పు, నువ్వులు, దనియాల పొడి వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు, కొద్దిగా నీళ్లు, చక్కెర లేదా బెల్లం కొద్దిగా వేసుకొని. కావాల్సినంత దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత దింపేయడమే. ఇంకెందుకు ఆలస్యం ఘుమఘుమలాడే కాకరకాయ  కూరను మీరూ ట్రై చేయండి.

కాకరకాయ కూరలో లభించే పోషకాలు, ప్రయోజనాలు

ఒక కప్పు కాకరకాయ కూరలో (RDI)లో 90% విటమిన్ సి సంవృద్ధిగా లభిస్తుంది. విటమిన్ సి అనేది ఒక ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్, ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. ఇది చర్మ ఆరోగ్యానికి మరియు గాయం నయం చేయడానికి ముఖ్యమైన కొల్లాజెన్ ఉత్పత్తిలో కూడా పాత్ర పోషిస్తుంది .

కాకరకాయ కూరలో పొటాషియం కూడా లభిస్తుంది. పొటాషియం రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే ముఖ్యమైన ఖనిజం. ఇది కండరాలు మరియు నరాల పనితీరులో కూడా పాత్ర పోషిస్తుంది. కాకరకాయలో ఫైబర్ లభిస్తుంది. ఫైబర్ జీర్ణ ఆరోగ్యానికి ముఖ్యమైనది మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది సంతృప్తిని ప్రోత్సహించడానికి మరియు ఊబకాయం ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

కాకరకాయ కూర అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఆరోగ్యకరమైన మరియు పోషకాహారమైన వంటకం. కాకరకాయలలో విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్ల సంవృద్ధిగా లభిస్తాయి, మరియు ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి, వాపును తగ్గించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి మరియు బరువు తగ్గడాన్ని ప్రోత్సహించడానికి సహాయపడుతుంది.

Post Comment