అల్లం చట్నీ తయారీ విధానం : టేస్టీ అల్లం పచ్చడి రెసిపీ
భారతీయ వంటకాలు

అల్లం చట్నీ తయారీ విధానం : టేస్టీ అల్లం పచ్చడి రెసిపీ

బ్రేక్ ఫాస్ట్ రెసిపీస్ లోకి చట్నీలు ఎంత ఫేమస్ అనేది మనకు తెలుసు. ముఖ్యంగా టిఫిన్స్ ఇడ్లీ, దోస, మరియు వడ వంటి వాటికి చట్నీలు తప్పని సరిగా ఉండాలి. అందుకని ఈ ఆర్టికల్ యందు అదిరిపోయే అల్లం చట్నీ ఎలా తయారు చేయాలి, చట్నీ తయారీకి కావాల్సిన పదార్దాలు ఏమిటో తెలుసుకుందాం.

అల్లం చట్నీ తయారీకి కావాల్సిన పదార్దాలు

  • అల్లం ముక్క‌లు - ఒక కప్పు
  • చింతపండు - ఒక బొట్ట
  • టమాటా - ఒకటి
  • బెల్లం తురుము - రెండు స్పూన్
  • శ‌న‌గ ప‌ప్పు - ఒక స్పూన్‌
  • ధ‌నియాలు - ఒక స్పూన్‌
  • ఆవాలు - అర స్పూన్
  • జీరా - పావు స్పూన్
  • పచ్చిమిర్చి - ఒకటి
  • ఎండు మిర్చి - ఒకటి
  • నూనె - రెండు టీ స్పూన్‌
  • ఉప్పు - రుచికి స‌రిప‌డా
  • పసుపు - పావు స్పూన్
  • కరివేపాకు - ఒక రెమ్మ
  • నీళ్లు - త‌గిన‌న్ని

అల్లం చట్నీ తయారీ విధానం

ముందుగా అల్లం తొక్కతీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయిలో ఒక స్పూన్ నూనె వేసి, వేడయ్యాక అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, జీరా, ధనియాలు పసుపు, టమాటాముక్కలు వేసి దోరగా వేయించి పక్కన బెట్టి చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక జార్ లో  తీసుకుని అందులో బెల్లం, చింత‌పండు, సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి.

ఇప్పుడు పోపు కోసం క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఎండుమిర్చి, ఆవాలు, మినపప్పు, శెనగపప్పు, క‌రివేపాకు వేసి పోపు బాగా వేయించాలి. తాళింపు చ‌క్క‌గా వేగిన త‌రువాత దీనిని ముందుగా రుబ్బుకున్న ప‌చ్చ‌డిలో వేసి కలుపుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ అల్లం చట్నీ రెడీ అయినట్లే.

దీనిని అన్నంతో పాటు పొద్దున్న టిఫిన్స్ కి మంచి కాంబినేషన్ చాలా రుచిగా ఉంటుంది. ఈ అల్లం చట్నీతో చాలా పోషకవిలువలుతో పాటు, మంచి ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు.

అల్లం చట్నీలో లభించే పోషకాలు, ప్రయోజనాలు

అల్లం జింజెరాల్ యొక్క శక్తివంతమైన మూలం, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో కూడిన బయోయాక్టివ్ సమ్మేళనం. ఇందులో మాంగనీస్, పొటాషియం, విటమిన్ సి మరియు బి విటమిన్లు కూడా పుష్కలంగా ఉన్నాయి.

చింతపండు డైటరీ ఫైబర్, విటమిన్ సి మరియు బి విటమిన్లకు మంచి మూలం . ఇందులో పొటాషియం, మెగ్నీషియం మరియు ఐరన్ కూడా సంవృద్ధిగా ఉంటాయి. బెల్లం అనేది ఐరన్, కాల్షియం మరియు పొటాషియం వంటి ఖనిజాలను కలిగి ఉండే శుద్ధి చేయని చక్కెర . ఇందులో కొన్ని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా సంవృద్ధిగా ఉన్నాయి. మిరపకాయలలో క్యాప్సైసిన్ అనే సమ్మేళనం ఉంటుంది, ఇది నొప్పిని తగ్గించే మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి విటమిన్ సి మరియు పొటాషియం యొక్క మంచి మూలం.

అల్లం చట్నీ యొక్క మసాలా రుచి జీర్ణ రసాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది, జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. అల్లంలో ఉండే జింజెరాల్ అనే సమ్మేళనం కూడా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది కడుపు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. అల్లంలోని యాంటీఆక్సిడెంట్ కంటెంట్ కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

అల్లంలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు నోటి ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడానికి మరియు శ్వాసను తాజాగా ఉంచడంలో సహాయపడతాయి. మిరపకాయలోని క్యాప్సైసిన్ జీవక్రియను పెంచుతుంది మరియు థర్మోజెనిసిస్‌ను ప్రోత్సహిస్తుంది, బరువు నిర్వహణలో సహాయపడుతుంది.

Post Comment