భారతీయ వంటకాలు

బ్రేక్ ఫాస్ట్ లోకి పుదీనా చట్నీ తయారీ విధానం : టేస్టీ పుదీనా పచ్చడి రెసిపీ

పొద్దున్న బ్రేక్ ఫాస్ట్ కి చట్నీలు ఎంత అవసరం అనేది మనకు తెలుసు. ముఖ్యంగా టిఫిన్స్ ఇడ్లీ, దోస, ఉప్మా , అట్టు మరియు వడ వంటి వాటికి చట్నీలు తప్పని సరిగా ఉండాలి. ఈ ఆర్టికల్ యందు అదిరిపోయే పుదీనా మరియు కొత్తిమీర కాంబినేషన్లో పుదీనా చట్నీ ఎలా తయారు చేయాలి, చట్నీ తయారీకి కావాల్సిన పదార్దాలు ఏమిటో తెలుసుకుందాం

పుదీనా చట్నీ తయారీకి కావాల్సిన పదార్దాలు

  • పుదీనా ఆకులు - 2 కట్టలు
  • కొత్తిమీర - 1 కట్ట
  • చింతపండు - ఒక బొట్ట
  • శనగపప్పు - ఒక స్పూన్
  • మినపపప్పు - ఒక స్పూన్
  • ఆవాలు - అర  స్పూన్
  • పసుపు - పావు స్పూన్
  • జీలకర్ర - అర స్పూన్
  • ధనియాలు - అర స్పూన్
  • ఎండుమిర్చి - రెండు
  • పచ్చిమిర్చి - ఒకటి
  • వెల్లుల్లి రెబ్బలు - ఆరు
  • ఉప్పు - తగినంత
  • నూనె - రెండు స్పూన్స్
  • కరివేపాకు - ఒక రెమ్మ

పుదీనా చట్నీ తయారీ విధానం

ముందుగా పుదీనా, కొత్తిమీర ఆకులని శుభ్రంగా కడిగిపెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయిలో ఒక స్పూన్ నూనె వేసి, వేడయ్యాక పుదీనా, కొత్తిమీర ఆకులు, పచ్చిమిర్చి,వెల్లుల్లి రెబ్బలు, జీరా, ధనియాలు పసుపు వేసి పుదీనా, కొత్తిమీర ఆకులు మెత్తబడే వరకు వేయించి పక్కన బెట్టి చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక జార్ లో తీసుకుని అందులో చింత‌పండు, సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి.

ఇప్పుడు పోపు కోసం క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఎండుమిర్చి, ఆవాలు, మినపప్పు, శెనగపప్పు, క‌రివేపాకు వేసి పోపు బాగా వేయించాలి. తాళింపు చ‌క్క‌గా వేగిన త‌రువాత దీనిని ముందుగా రుబ్బుకున్న ప‌చ్చ‌డిలో వేసి కలుపుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ పుదీనా చట్నీ రెడీ అయినట్లే. ఈ పుదీనా పచ్చడి పొద్దున్న టిఫిన్స్ కి మంచి కాంబినేషన్, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఈ పుదీనా చట్నీలో చాలా పోషకవిలువలుతో పాటు, మంచి ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు

పుదీనా చట్నీలో లభించే పోషకాలు, ప్రయోజనాలు

పుదీనా ఆకులు మెంథాల్ యొక్క శక్తివంతమైన మూలం, ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో కూడిన సమ్మేళనం. వాటిలో విటమిన్ ఎ, విటమిన్ సి మరియు మాంగనీస్ కూడా పుష్కలంగా ఉంటాయి. కొత్తిమీర డైటరీ ఫైబర్, విటమిన్ సి, విటమిన్ కె మరియు పొటాషియం యొక్క మంచి మూలం . ఇందులో మాంగనీస్, ఐరన్ మరియు కాల్షియం కూడా సంవృద్ధిగా లభిస్తాయి. పచ్చి మిరపకాయలలో క్యాప్సైసిన్ అనే సమ్మేళనం నొప్పిని తగ్గించే మరియు శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. అవి విటమిన్ సి, పొటాషియం మరియు విటమిన్ ఎ యొక్క మంచి మూలం.

పుదీనాలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు కార్మినేటివ్ లక్షణాలు కడుపు నొప్పిని ఉపశమనం చేస్తాయి, గ్యాస్ మరియు ఉబ్బరం నుండి ఉపశమనం పొందుతాయి మరియు జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. పుదీనాలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు నోటి దుర్వాసనతో పోరాడటానికి మరియు నోటి ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి. పుదీనాలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థరైటిస్, తలనొప్పి మరియు ఇతర ఇన్‌ఫ్లమేటరీ పరిస్థితులతో సంబంధం ఉన్న వాపును తగ్గించడంలో సహాయపడతాయి.

పచ్చి మిరపకాయల్లో ఉండే క్యాప్సైసిన్ జీవక్రియను పెంచుతుంది మరియు థర్మోజెనిసిస్‌ను ప్రోత్సహిస్తుంది, బరువు నిర్వహణలో సహాయపడుతుంది. పుదీనా యొక్క శీతలీకరణ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మపు చికాకులను ఉపశమనానికి మరియు దురదను తగ్గించడంలో సహాయపడతాయి.

Post Comment