ఆనపకాయ పచ్చడి తయారీ విధానం : సొరకాయ పచ్చడి రెసిపీ
భారతీయ వంటకాలు

ఆనపకాయ పచ్చడి తయారీ విధానం : సొరకాయ పచ్చడి రెసిపీ

రోజూ పొద్దున్న చేసుకునే బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీలు ఎంత అవసరం అనేది మన అందరికి తెలుసు. ముఖ్యంగా టిఫిన్స్ ఇడ్లీ, దోస,పూరి మరియు వడ వంటి వాటికి చట్నీలు తప్పని సరిగా ఉండాలి. ఈ ఆర్టికల్ యందు అదిరిపోయే ఆనపకాయ పచ్చడి ఎలా తయారు చేయాలి, పచ్చడి తయారీకి కావాల్సిన పదార్దాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ కొత్త రెసిపీని మీరు కూడా ట్రై చేయండి.

ఆనపకాయ పచ్చడికి కావాల్సిన పదార్దాలు

  • ఆనపకాయ - ఒకటి (చిన్నది)
  • ప‌ల్లీలు - రెండు టేబుల్ స్పూన్స్,
  • ధ‌నియాలు - ఒక టీ స్పూన్
  • ప‌చ్చిమిర్చి - నాలుగు
  • ట‌మాటాలు – రెండు
  • ఆవాలు - ఒక స్పూన్
  • జీరా - అర స్పూన్
  • శెనగపప్పు - ఒక స్పూన్
  • మినపప్పు - ఒక స్పూన్
  • వెల్లుల్లి రెబ్బ‌లు - 6
  • ఉప్పు - త‌గినంత‌,
  • చింత‌పండు - ఒక బొట్ట
  • క‌రివేపాకు - రెండు రెమ్మ‌లు
  • ఎండుమిర్చి - రెండు
  • నూనె – రెండు టేబుల్ స్పూన్స్
  • ప‌సుపు – పావు టీ స్పూన్

ఆనపకాయ పచ్చడి తయారీ విధానం

ముందుగా ఆనపకాయ తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి క‌ళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ప‌ల్లీలు వేసి వేయించుకోవాలి. పల్లీలు కొద్దిగా వేగిన త‌రువాత అందులో ధ‌నియాలు, ప‌చ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఆలా వేగిన త‌రువాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.

త‌రువాత అదే కళాయిలో కొద్దిగా నూనె వేసుకుని, వేడయ్యాక ఆనపకాయ ముక్కలు వేసి ఓ ఐదు నిమిషాల పాటు మీడియం మంట‌పై వేయించుకోవాలి.  ఐదు నిమిషాల త‌రువాత ఇందులో ట‌మాట ముక్క‌లు, ప‌సుపు, కొద్దిగా చింత‌పండు, సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి క‌లుపుతూ ట‌మాటాలు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. మొత్తం మిశ్రమం వేయించాక పక్కనపెట్టి చల్లార్చుకోవాలి.

త‌రువాత ఒక జార్ ను తీసుకుని అందులో ముందుగా వేయించిన పల్లీలు, ప‌చ్చిమిర్చి మిశ్రమం వేసి రుబ్బుకోవాలి. త‌రువాత అందులో వెల్లుల్లి రెబ్బ‌లు, జీల‌క‌ర్ర వేసి క‌చ్చా ప‌చ్చాగా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత వేయించిన ఆనపకాయల ముక్క‌ల‌ను కూడా వేసి మ‌రీ మెత్త‌గా కాకుండా కొద్దిగా బ‌ర‌క‌గా ఉండేలా మిక్సీ ప‌ట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

ఇప్పుడు పోపు కోసం క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఆవాలు, శెనగపప్పు,మినపప్పు, ఎండుమిర్చి, క‌రివేపాకు వేసి పోపు మంచి వాసన వచ్చేవరకు వేయించాలి. తాళింపు వేగిన త‌రువాత దీనిని ముందుగా రుబ్బుకున్న ప‌చ్చ‌డిలో వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ ఆనపకాయ ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఆనపకాయతో పప్పు ,కూర‌లే కాకుండా ఈ విధంగా ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

ఆనపకాయ పచ్చడిలో లభించే పోషకాలు, ప్రయోజనాలు

అనపకాయలో నీటి శాతం 96% వరకూ ఉంటుంది. ఇందులో సంతృప్త కొవ్వు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటాయి మరియు డైటరీ ఫైబర్, విటమిన్ సి, రిబోఫ్లావిన్, జింక్, థయామిన్, ఐరన్, మెగ్నీషియం మరియు మాంగనీస్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి.

జ్వరం, దగ్గు, నొప్పి మరియు ఉబ్బసం వంటి అనేక ఆరోగ్య పరిస్థితులకు సహాయం చేయడానికి సీసా పొట్లకాయను సాంప్రదాయకంగా ఉపయోగిస్తారు . ఇది దాని ప్రయోజనాల కోసం పురాతన కాలం నుండి ఉపయోగించబడింది.

ఆనపకాయ విటమిన్ బి, సి మరియు ఇతర పోషకాలకు మంచి మూలంగా కూడా పరిగణించబడుతుంది. ఆనపకాయ విటమిన్ సి మరియు జింక్ యొక్క మంచి మూలం, ఇది అనేక చర్మ ప్రయోజనాలను అందిస్తుంది. విటమిన్ సి మొత్తం చర్మ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్.

ఆనపకాయ మలబద్ధకాన్ని నయం చేయడంలో సహాయపడుతుంది మరియు డయేరియాను కూడా నయం చేస్తుంది . కూరగాయలలో చాలా నీరు మరియు ఫైబర్ ఉండటం వల్ల ఇది మీ జీర్ణవ్యవస్థను శుభ్రపరచడంలో సహాయపడుతుంది మరియు సులభంగా ప్రేగు కదలికను అనుమతిస్తుంది.

ఆనపకాయ శరీరంలో వేడిని తగ్గిస్తుంది మరియు దాహాన్ని తీర్చడంలో సహాయపడుతుంది. శరీరంలో అవసరమైన నీటిని నింపడం ద్వారా శరీరాన్ని తిరిగి శక్తివంతం చేస్తుంది మరియు అలసటను నివారిస్తుంది.

Post Comment