ఇడ్లి ఉప్మా తయారీ విధానం : ఈజీ బ్రేక్ ఫాస్ట్ రెసిపీ
భారతీయ వంటకాలు

ఇడ్లి ఉప్మా తయారీ విధానం : ఈజీ బ్రేక్ ఫాస్ట్ రెసిపీ

మీరు ఎప్పుడైనా ఇంట్లో ఎక్కువ ఇడ్లీలు చేసి మిగిలిపోయినట్లయితే ఈ ఇడ్లీ ఉప్మా రెసిపీని ఒకసారి ప్రయత్నించి చూడండి. ఈ ఆర్టికల్ యందు ఈజీగా ఇడ్లిలతో టేస్టీ టేస్టీగా ఉప్మా ను ఎలా తయారు చేయాలి, కావాల్సిన పదార్దాలు ఏమిటో చూద్దాం.

ఇడ్లి ఉప్మా తయారీకి కావాల్సిన పదార్దాలు

  • ఇడ్లీలు - 6
  • నూనె - రెండు టేబుల్ స్పూన్స్
  • ఆవాలు - అర టీ స్పూన్
  • జీలకర్ర - అర టీ స్పూన్
  • శనగపప్పు - ఒక టీ స్పూన్
  • మినపపప్పు - ఒక టీ స్పూన్
  • వేరుశెనగ పలుకులు - ఒక టీ స్పూన్
  • జీడిపప్పు - తగినన్ని
  • ఉల్లిపాయ - రెండు
  • టమాటా - ఒకటి
  • అల్లం తురిము - అర టీ స్పూన్
  • కరివేపాకు - రెండు రెమ్మలు
  • పచ్చి మిరపకాయలు - మూడు
  • పసుపు - అర టీ స్పూన్
  • కొత్తిమీర - రెండు రెమ్మలు
  • ఉప్పు - సరిపడా

ఇడ్లి ఉప్మా తయారీ విధానం

ముందుగా ఇడ్లీలను తీసుకొని వాటిని చేతితో పిసికి పిండిలాగా విడివిడిగా చేసుకోవాలి. అనంతరం కళాయిలో నూనె వేసి, వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, శెనగపప్పు, మినపప్పు, జీడీ పప్పు, వేరుశెనగగుళ్ళు, కరివేపాకు వేసి రెండునిమిషాల పాటు వేయించాలి.

రెండు నిముషాలు వేగిన తరవాత, ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, పసుపు వేసి బాగా కలిపుతూ మూడు నిముషాలు వేయించి టమాటా ముక్కలు, సరిపడా ఉప్పు వేసి మూడు నిముషాలు బాగా మగ్గించాలి.

టమాటా బాగా మగ్గిన తరవాత ఇడ్లీ ముక్కలు, కొత్తిమీర వేసి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. అలా మూడు నిముషాలు కలుపుతూ వేయించాలి అంతే వేడి వేడిగా ఇడ్లి ఉప్మా రెడీ అయినట్లే. దీనిని వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే రుచిగా ఉంటుంది.

ఇడ్లి ఉప్మాలో లభించే పోషక విలువలు

ఇడ్లీ యొక్క పోషక విలువ - 35-39 కేలరీలు, 2-3 గ్రాముల ప్రొటీన్, 2-5 గ్రాముల డైటరీ ఫైబర్ మరియు 6-10 గ్రాముల కార్బోహైడ్రేట్లు; 1-5 మిల్లీగ్రాముల ఇనుము, మరియు దానిలో ఉపయోగించిన ఫ్లేవర్ ఐటెమ్‌ను బట్టి కాల్షియం, ఫోలేట్, పొటాషియం మరియు విటమిన్ ఎ యొక్క ట్రేస్ మొత్తాలను కలిగి ఉంటుంది.

ఇడ్లీ పిండిలో ఉండే లాక్టిక్ యాసిడ్ బాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరచడంలో మరియు పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇడ్లీ ఉప్మా పులియబెట్టిన ఆహారం, అంటే ఇది పేగు ఆరోగ్యానికి మంచిది.

ఇడ్లీ ఉప్మా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్‌లకు మంచి మూలం, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మధుమేహం లేదా ప్రీడయాబెటిస్ ఉన్నవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఇడ్లీ ఉప్మా తక్కువ కేలరీలు మరియు అధిక ఫైబర్ కలిగిన ఆహారం, ఇది బరువు తగ్గడానికి లేదా ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులకు ఇది మంచి ఎంపిక.

ఇడ్లీ ఉప్మా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్‌లకు మంచి మూలం, ఇది రోజంతా నిరంతర శక్తిని అందిస్తుంది. ఇడ్లీ ఉప్మా విటమిన్లు మరియు ఖనిజాలకు మంచి మూలం, ఇది బలమైన రోగనిరోధక వ్యవస్థకు ముఖ్యమైనది. మీరు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు తినడానికి మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది.

Post Comment